AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్రేటర్‌ ఎన్నికల బీజేపీ మేనిఫెస్టో విడుదల.. గ్రేటర్ లో అందరికీ ఉచితంగా కరోనా టీకా.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేనిఫెస్టోః ఫడ్నవిస్

బల్దియా పీఠంపై కన్నేసిన భారతీయ జనతాపార్టీ దూసుకుపోతోంది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా అన్ని వర్గాల అగ్రనేతలను ఎన్నికల ప్రచారానికి దింపింది. తాజాగా గ్రేటర్‌ ఎన్నికల మేనిఫెస్టోను ఇవాళ బీజేపీ విడుదల చేసింది. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఈ మేనిఫెస్టోను బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విడుదల చేశారు.

గ్రేటర్‌ ఎన్నికల బీజేపీ మేనిఫెస్టో విడుదల.. గ్రేటర్ లో అందరికీ ఉచితంగా కరోనా టీకా.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేనిఫెస్టోః ఫడ్నవిస్
Balaraju Goud
|

Updated on: Nov 26, 2020 | 1:55 PM

Share

బల్దియా పీఠంపై కన్నేసిన భారతీయ జనతాపార్టీ దూసుకుపోతోంది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా అన్ని వర్గాల అగ్రనేతలను ఎన్నికల ప్రచారానికి దింపింది. తాజాగా గ్రేటర్‌ ఎన్నికల మేనిఫెస్టోను ఇవాళ బీజేపీ విడుదల చేసింది. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఈ మేనిఫెస్టోను బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఆ పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫడ్నవిస్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భావానికి సుదీర్ఘ పోరాటం జరిగిందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేనిఫెస్టో రూపొందించామన్నారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పాత్ర చాలా ఉందన్న ఫడ్నవిస్.. ప్రజలకు ఏం కావాలో బీజేపీకి తెలుసన్నారు. రాజ్యాంగాన్ని మోదీ సర్కార్‌ మాత్రమే కాపాడుతోందని ఆయన స్పష్టం చేశారు. గ్రేటర్‌లో గెలిపిస్తే సెప్టెంబర్‌ 17ని అధికారికంగా నిర్వహిస్తామని ఫడ్నవిస్‌ వెల్లడించారు.

బీజేపీ మేనిఫెస్టో హైలైట్స్ ఇవేః

    • వరదల్లో నష్టపోయిన వారికి 25 వేలు సాయం
    • కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తాం
    • గ్రేటర్‌లో గెలిపిస్తే సెప్టెంబర్‌ 17ని అధికారికంగా నిర్వహిస్తాం
    • ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేస్తాం
    • హైదరాబాద్‌లో డ్రైనేజీ వ్యవస్థను బాగు చేస్తాం..
    • అక్రమ నిర్మాణాలను కూల్చేస్తాం
    • పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టులో మహిళలకు ఉచిత ప్రయాణం
    • ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ కోసం హై క్వాలిటీ వైఫై
    • లక్ష మంది పేదలకు ప్రధాని ఆవాజ్‌ యోజన కింద ఇళ్లు
    • 10 వేల కోట్లతో మూసీ ప్రక్షాళన
    • వచ్చే వర్షాకాలం నాటికి హైదరాబాద్ నాలాల పునరుద్ధరణ
    • ఎస్సీ కాలనీలు, బస్తీ వాసులకు ఆస్తిపన్ను రద్దు
    • 125 గజాలలోపు ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు అవసరం లేదు
    • గ్రేటర్‌లో ఇంటింటికి నల్లా కనెక్షన్.. 24 గంటలు ఉచితంగా మంచినీరు సరఫరా
    • ఆన్‌లైన్‌ క్లాస్‌లకు ఉచిత ట్యాబ్లు
    • ప్రయివేటు స్కూల్స్‌లో ఫీజుల నియంత్రణ
    • మూసి ప్రక్షాళన..10 వేల కోట్లతో సుమేధ కొత్త చట్టం
    • సుమేధ ద్వారా నాలల నిర్మాణం అక్రమ కట్టడాలు కూల్చివేత
    • పేదలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
    • మహిళల కోసం కిలోమీటరుకో టాయిలెట్
    • గ్రేటర్ పరిధిలో టూవీలర్లు, ఆటోలపై ఇప్పటివరకు ఉన్న చలాన్లు రద్దు
    • కులవృత్తులకు ఉచిత విద్యుత్

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!