నివర్ తుఫాన్ కల్లోలం: తమిళనాడు, పుదుచ్చేరి సీఎంలకు అమిత్ షా ఫోన్, అండగా ఉంటామని భరోసా

|

Updated on: Nov 26, 2020 | 6:54 PM

నివర్ తుఫాన్ బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా తమిళనాడు, పుదుచ్చేరిపై తన ప్రతాపాన్ని చూపించింది. ఈ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో కూడా భారీ వర్షం కురిసింది.

నివర్ తుఫాన్ కల్లోలం: తమిళనాడు, పుదుచ్చేరి సీఎంలకు అమిత్ షా ఫోన్, అండగా ఉంటామని భరోసా

నివర్‌ సైక్లోన్‌ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. భీకరంగా విరుచుకుపడుతోంది. వందల కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు గజగజ లాడిస్తున్నాయి. తీర ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. సముద్రపు అలలు అంతెత్తున ఎగసి పడుతున్నాయి. బంగాళాఖాతం వెంబడి సముద్రం అల్లకల్లోలంగానే ఉంది.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 26 Nov 2020 04:53 PM (IST)

    నివర్ తుఫాన్ ప్రభావంపై కేంద్ర హోం మంత్రి ఆరా

    నివర్ తుఫాన్ బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా  తమిళనాడు, పుదుచ్చేరిపై తన ప్రతాపాన్ని చూపించింది. ఈ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో కూడా భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో తుపాను పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, పుదుచ్చేరి సీఎం నారాయణస్వామితో అమిత్ షా ఫోన్లో మాట్లాడారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కేంద్రం అన్ని విధాల అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

    నివర్ తుఫాన్ క్రమంగా వాయువ్య దిశగా ప్రయాణిస్తున్నట్లు ఐఎండీ తెలిపింది. దీని ఫలితంగా కర్నాటకలోని దక్షిణ జిల్లాల్లో ఓ మోస్టారు వర్షాలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వివరిచింది.  వచ్చే 48 గంటల్లో బెంగళూరు సిటీ, రూరల్ ఏరియాస్‌తో పాటు చిక్కబల్లాపూర్, కొలార్, తూమకూరు, మాండ్య, రామానగర జిల్లాల్లో ఈ రోజు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వివరించింది. దీంతో ఈ ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

  • 26 Nov 2020 03:50 PM (IST)

    ఏపీపై నివర్ తుఫాన్ ఎఫెక్ట్

    నివర్ తుపాను కారణంగా నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలోని వెంకటగిరిలో అత్యధికంగా 30 సెం.మీ. వర్షపాతం నమోదైంది. తొమ్మిదిచోట్ల 20 సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.  72 ప్రాంతాలలో 11.5 నుంచి 20 సెం.మీ. వరకు వర్షపాతం నమోదయ్యిందని వెల్లడించింది.  కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 6 నుంచి 11 సెం.మీ. వరకు వర్షపాతం రికార్డయ్యిందని వివరించింది. ఉభయగోదావరి జిల్లాల్లో 6 నుంచి 11 సెం.మీ. వరకు వర్షం కురిసినట్లు  విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది.

  • 26 Nov 2020 02:55 PM (IST)

    కర్ణాటక దిశగా కదులుతోన్న నివర్‌

    పుదుచ్చేరీ సమీపంలో తీరం దాటిన నివర్ తుపాను అనంతకం అతి తీవ్ర తుపాను నుంచి తీవ్ర తుపానుగా మారింది. ప్రస్తుతం ఈ తుఫాన్‌ వాయువ్య దిశగా కదిలి కర్ణాటకవైపు వెళ్లే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. రానున్న ఆరు గంటల్లో తుపాను మరింత బలహీనపడనుందని ఐఎండీ తెలిపింది.

    అయితే తుఫానును తేలిగ్గా తీసుకోవడానికి లేదని, తుపానులో కొంతభాగం ఇంకా సముద్రంలోనే కేంద్రీకృతమై ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. తుపాను ప్రభావంతో తమిళనాడులోని పలు జిల్లాలతో పాటు, పుదుచ్చేరి, ఆంధ్రా, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు తీర ప్రాంతంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని వాతవరణ శాఖ హెచ్చరించింది.

  • 26 Nov 2020 02:34 PM (IST)

    అన్నవరం తెప్పోత్సంపై నివార్ ఎఫెక్ట్..తెప్పోత్సవాన్ని రద్దు చేసిన అధికారులు

    తూర్పుగోదావరి జిల్లాలో జోరుగా కురుస్తున్నవర్షాలు

    తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి తెప్పోత్సవాన్ని అధికారులు రద్దు చేశారు. ఈ తెప్పోత్సవం గురువారం సాయంత్రం జరగాల్సి ఉంది. వర్షాల కారణంగా రద్దు చేసినట్లు దేవస్థానం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. వర్షం కారణంగా స్వామి అమ్మవార్లను కొండ దిగువకు తీసుకొని వెళ్లే అవకాశం లేనందున నిర్వహించవలసిన తులసి ధాత్రీ పూజ కొండపైనే నిర్వాహించనున్నట్లు తెలిపారు.

  • 26 Nov 2020 01:24 PM (IST)

    నివార్ తుఫాన్ ప్రభావంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష

    సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తు మంత్రి అనిల్ కుమార్

    నివర్‌ తుఫాన్‌ ప్రభావంపై ముఖ్యంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. తుఫాన్‌ తీరాన్ని తాకిందని, బలహీనపడుతుందని సీఎంకు అధికారులు సూచించారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో సగటున 7 సెం.మీ వర్షపాతం నమోదైందని సీఎం జగన్‌కు రిపోర్ట్‌ అందించారు. రేణిగుంటలోని మల్లెమడుగు రిజర్వాయర్‌ సమీపంలో వాగులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

  • 26 Nov 2020 12:50 PM (IST)

    నెల్లూరు జిల్లాపై తుపాను ప్రభావం..రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు.. పర్యవేక్షిస్తు మంత్రి అనిల్ కుమార్..

    నెల్లూరు జిల్లాలో జోరుగా వర్షాలు

    తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రమాద ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. మంత్రి అనిల్ కుమార్, కలెక్టర్ చక్రధర్ బాబు వర్షాభావ పరిస్థితులను ఎప్పటకప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

  • 26 Nov 2020 12:08 PM (IST)

    చిత్తూరులో నివర్ తుపాన్ బీభత్సం..మల్లిమడుగు వాగులో చిక్కుకున్న ముగ్గురు రైతులు..

    చిత్తూరులో నివర్ ఎఫెక్ట్..

    తిరుపతి రేణిగుంట దగ్గర కుమ్మరలోపు చెరువుకు వరద ఉధృతి పెరిగింది. నీటి ప్రవాహంలో ముగ్గురు రైతులు కొట్టుకుపోయారు... కొట్టుకుపోతూ చెట్లను పట్టుకుని ప్రాణాలు కాపాడమంటూ ఆర్తనాదాలు పెడుతున్నారు.

  • 26 Nov 2020 11:31 AM (IST)

    జలదిగ్భందంలో చిత్తూరు జిల్లా.. రేణిగుంట ఎయిర్‌పోర్టుకు నిలిచిపోయిన రాకపోకలు

    రేణిగుంట ఎయిర్పోర్టుకు వెళ్లే ప్రధాన రహదారిపైకి వరద నీరు

    నివర్ తుఫాన్ ఎఫెక్ట్ కి చిత్తూరు జిల్లా గజగజా వణుకుతోంది.. ఏడుకొండల్లోంచి వచ్చిన వరద నీరంతా తిరుపతిని ముంచెత్తుతోంది. కరకంబాడి మెయిన్ రోడ్డుమీదికి నాలుగు అడుగుల మేర వరదనీరు చేరింది. సుభాష్ నగర్ కాలనీ, ఎర్రమిట్ట కాలనీ, లీలామహల్ సెంటర్, సుబ్బారెడ్డినగర్, కొర్లగుంట, కొత్తపల్లె కాలనీల్లో ఇళ్లల్లోకి వరదనీరు చేరింది. రేణిగుంట ఎయిర్పోర్టుకు వెళ్లే ప్రధాన రహదారిని పూర్తిగా రాకపోకలు నిలిపివేశారు.

  • 26 Nov 2020 10:55 AM (IST)

    తిరుమలపై నివార్ ప్రభావం.. కనుమ మార్గంలో విరిగిపడిన కొండచరియలు..

    తిరుమలలో కురుస్తున్న భారీ వర్షం

    తెలుగు రాష్ట్రాల్లో నివార్ ప్రభావం కనిపిస్తోంది. చిత్తూరు, కడప, నెల్లూరుతోపాటు చాలా జిల్లాలు ఇప్పటికే తడిసి ముద్ధయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. తిరుమల రెండో కనుమ రహదారిలో కొండ చరియలు విరిగిపడ్డాయి.14వ కిలోమీటరు వద్ద భక్తులు ప్రయాణిస్తున్న వాహనంపై పడ్డ బండరాళ్లు పడ్డాయి. తెలంగాణకు చెందిన భక్తులు వెళ్తున్న కారుపై పడ్డ బండరాళ్లు పడటంతో కారు ముందుభాగం ధ్వంసం అయ్యింది. ప్రమాదం నుంచి సురక్షితంగా భక్తులు బయటపడ్డారు.

  • 26 Nov 2020 10:18 AM (IST)

    నెల్లూరుపై నివార్ ప్రవావం.. ఆత్మకూరులో భారీ వర్షం..ఇళ్లలోకి చేరిన వర్షపునీరు..

    వణికిస్తున్న నివార్ వర్ష బీభత్సం..

    తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పలు గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రమాద ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. ఆత్మకూరులో భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఇళ్లలోకి వర్షపునీరు వచ్చి చేరడంతో జనం ఆందోళనకు గురవుతున్నారు.

  • 26 Nov 2020 09:38 AM (IST)

    కడప జిల్లాలో జమ్మలమడుగులో తుఫాన్ కంట్రోల్‌ రూమ్‌

    జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయం కంట్రోల్‌ రూమ్‌ నెంబర్.. 96766 08282, 08560-271088

    కడప జిల్లాను సైక్లోన్‌ గజగజ వణికిస్తోంది. రైల్వే కోడూరు ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో రహదారులు ఏకంగా చెరువులను తలపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ నెంబర్.. 96766 08282, 08560-271088

  • 26 Nov 2020 09:18 AM (IST)

    తిరుమల కొండలపై నివార్ ఎఫెక్ట్.. భక్తుల వాహనంపై విరిగిపడిన కొండ చెరియలు

    తెలంగాణ భక్తుల వాహనాలపై పడిన కొండచరియలు

    నివర్ తుఫాన్ ప్రభావం తిరుమలకొండపై కూడా పడింది. రాత్రి తిరుమల రెండోఘాట్ రోడ్ లో కొండ చెరియలు విరిగిపడ్డాయి. తెలంగాణ నుండి శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు భక్తులు వస్తున్న వాహనంపై ఈ కొండచరియలు పడ్డాయి. తెలంగాణ నుండి శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు భక్తులు వస్తున్న వాహనంపై ఈ కొండచరియలు పడ్డాయి. వాహనంలోని భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.

  • 26 Nov 2020 09:03 AM (IST)

    నివార్ బీభత్సానికి వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు.. తమిళనాడు, పుదుచ్చేరి

    తిరుమలకొండపై నివర్ తుఫాన్ ప్రభావం

    నివర్ తుఫాన్ ప్రభావం తిరుమలకొండపై కూడా పడింది. రాత్రి తిరుమల రెండోఘాట్ రోడ్ లో కొండ చెరియలు విరిగిపడ్డాయి. తెలంగాణ నుండి శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు భక్తులు వస్తున్న వాహనంపై ఈ కొండచరియలు పడ్డాయి. తెలంగాణ నుండి శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు భక్తులు వస్తున్న వాహనంపై ఈ కొండచరియలు పడ్డాయి. వాహనంలోని భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.

  • 26 Nov 2020 08:58 AM (IST)

    నివర్ తుఫాన్ జనజీవనం అతలాకుతలం...బీభత్సానికి వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు

    తెలుగు రాష్ట్రాల్లో కూడా నివర్‌ బీభత్సం

    తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలనే కాదు తెలుగు రాష్ట్రాలు కూడా నివర్‌ బీభత్సానికి వణుకుతున్నాయి. ప్రధానంగా ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలుల దెబ్బకు భారీ వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలుతున్నాయి.

  • 26 Nov 2020 08:50 AM (IST)

    బీభత్సానికి వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు..చిత్తూరు జిల్లా కోవనూరు వద్ద కాలువ ఓవర్ ఫ్లో

    చిత్తూరు జిల్లాలో నివర్ బీభత్సం

    చిత్తూరు జిల్లాలో నివర్ బీభత్సం సృష్టిస్తోంది. కేవిబిపురం మండలం కోవనూరు వద్ద కాలువ ఓవర్ ఫ్లో కారణంగా శ్రీకాళహస్తి-కెవిబిపురం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరదయ్యపాలెం మండలంలో ముందస్తు చర్యలలో భాగంగా 306 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.

  • 26 Nov 2020 08:42 AM (IST)

    తీరం దాటాక కాస్త బలహీనపడ్డ తుఫాను

    నివర్‌ సైక్లోన్‌ వెన్నులో వణుకు పుట్టిస్తోంది

    నివర్‌ సైక్లోన్‌ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. భీకరంగా విరుచుకుపడుతోంది. వందల కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు గజగజ లాడిస్తున్నాయి. తీర ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. సముద్రపు అలలు అంతెత్తున ఎగసి పడుతున్నాయి. బంగాళాఖాతం వెంబడి అల్లకల్లోలంగానే సముద్రం.

Published On - Nov 26,2020 6:16 PM

Follow us
తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..
తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..
ఓపెనర్లుగా కోహ్లీ, రోహిత్.. బ్యాకప్‌గా సచిన్ 2.0..
ఓపెనర్లుగా కోహ్లీ, రోహిత్.. బ్యాకప్‌గా సచిన్ 2.0..
ఊపిరితిత్తులను శుభ్రంగా, ఆరోగ్యం ఉంచే ఆహారాలు ఇవే
ఊపిరితిత్తులను శుభ్రంగా, ఆరోగ్యం ఉంచే ఆహారాలు ఇవే
ఓయ్ చూసుకోబడలే.! బికినీలో బస్సెక్కేసిన మహిళ.. ఈ బామ్మ రియాక్షన్!
ఓయ్ చూసుకోబడలే.! బికినీలో బస్సెక్కేసిన మహిళ.. ఈ బామ్మ రియాక్షన్!
నీటిలో కనిపించిన నల్లటి ఆకారం.. ఏంటని వెళ్లి చూడగా దిమ్మతిరిగింది
నీటిలో కనిపించిన నల్లటి ఆకారం.. ఏంటని వెళ్లి చూడగా దిమ్మతిరిగింది
అలాంటి వస్త్రాలు ధరించినందుకు క్లాస్ రూంకు అనుమతి నిరాకరణ..
అలాంటి వస్త్రాలు ధరించినందుకు క్లాస్ రూంకు అనుమతి నిరాకరణ..
అందుకే వేసవిలో కొబ్బరి బోండం నీళ్లు తాగాలట.. ఎన్ని లాభాలో!
అందుకే వేసవిలో కొబ్బరి బోండం నీళ్లు తాగాలట.. ఎన్ని లాభాలో!
అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్..
అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్..
నా భర్త మరో అమ్మాయిని ప్రేమించాడు.. బాంబ్ పేల్చిన నటి స్నేహ
నా భర్త మరో అమ్మాయిని ప్రేమించాడు.. బాంబ్ పేల్చిన నటి స్నేహ
మీరు తోపులైతే.. కేవలం 15 సెకన్లలో ఇందులో గుర్రాన్ని కనిపెట్టండి..
మీరు తోపులైతే.. కేవలం 15 సెకన్లలో ఇందులో గుర్రాన్ని కనిపెట్టండి..
తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..
తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..