Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సిడ్నీ వేదికగా రసవత్తర పోరు.. రోహిత్ ప్లేస్‌ను భర్తీ చేసేది ఎవరు?.. కోహ్లీ ప్లాన్ ఏంటి..?

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న భారత్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్ నవంబర్ 27న ప్రారంభం కానుంది. సమవుజ్జీవుల మధ్య పోటీ రసవత్తరంగా ఉంటుందని...

సిడ్నీ వేదికగా రసవత్తర పోరు.. రోహిత్ ప్లేస్‌ను భర్తీ చేసేది ఎవరు?.. కోహ్లీ ప్లాన్ ఏంటి..?
Sanjay Kasula
|

Updated on: Nov 27, 2020 | 7:19 AM

Share

AUS vs IND 1st ODI Match : క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న భారత్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్ నవంబర్ 27న ప్రారంభం కానుంది. సమవుజ్జీవుల మధ్య పోటీ రసవత్తరంగా ఉంటుందని ఇప్పటికే మాజీ ఆటగాళ్లు, క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం సిడ్నీ వేదికగా తొలి వన్డే జరగనుంది. కాగా, నవంబర్ 27 నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా సుదీర్ఘ పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. సిడ్నీ వేదికగా తొలి వన్డే శుక్రవారం జరగనుంది.

2018-19 సీజన్లో 2-1 తేడాతో వన్డే సిరీస్‌ గెలిచిన భారత్‌‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి ఆస్ట్రేలియా తహతలాడుతోంది. ఆ సీజన్లో వన్డే సిరీస్‌తోపాటు టెస్టు సిరీస్‌ను గెలిచిన టీమిండియా 1-1తో టీ20 సిరీస్‌ను సమం చేసింది. సొంత గడ్డపై టీమిండియా  చేతిలో ఒక్క సిరీస్‌లోనూ ఆస్ట్రేలియా గెలవకపోవడం అదే మొదటిసారిక కావడం విశేషం.

దీంతో ఈసారి ఎలాగైనా గెలిచి లెక్క సరి చేయాలనే కసితో ఆసీస్ జట్టు మంచి ప్లాన్‌‌తో రెడీ అవుతంోది. ఇదిలావుంటే దాదాపు ఎనిమిది నెలల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌ కోసం గ్రౌండ్ లోకి దిగబోతోంది టీమిండియా. ఐపీఎల్ వంటి లీగ్స్ ఆడినప్పటికీ.. జట్టులోని సభ్యులు కలిసి ఎంట్రీ ఇవ్వబోతోంది మాత్రం సిడ్నీ వేదికగానే.

ఇక గతేడాది దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో ఓపెనర్‌గా వరుసగా డబుల్‌ సెంచరీ, సెంచరీతో చెలరేగిన రోహిత్‌ శర్మ గనుక గాయం కారణంగా జట్టుకు దూరమైన టీమిండియాకు కోలుకోలేని దెబ్బ తగులనుంది. ఇప్పటికే మొదటి టెస్టు తర్వాత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఇండియాకు తిరిగి రానున్న విషయం తెలిసిందే. దీంతో హిట్‌మ్యాన్‌ కూడా అందుబాటులో లేకుంటే బ్యాటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

అయితే భారత క్రికెట్‌ జట్టు పటిష్టంగా ఉన్నప్పటికీ రోహిత్‌ శర్మ సేవలు అందుబాటులో లేకపోవడం నిరాశ కలిగించే ఆంశం. అతని ప్లేస్‌ను ఎవరితో బర్తీ చేస్తారు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఇక లీగ్‌‌లో అద్భుత ప్రదర్ననతో టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కేఎల్ రాహుల్ నిలిచాడు.  ఓపెనర్ రోహిత్ శర్మ గైర్హాజరీతో ఇన్నింగ్స్‌ ఆరంభించే ఛాన్స్ ఉంది. రాహుల్ కాకుండా మిడిలార్డర్‌లో వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్య తుదిజట్టులో ఉంటే బౌలింగ్ చేస్తాడా లేదా అనేది ప్రశ్న. ఐపీఎల్‌లో ముంబయి తరఫున ఆడిన అతడు కేవలం బ్యాటింగ్ మాత్రమే చేశాడు. వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకున్న అనంతరం అతడు టీమిండియాకు దూరమైన సంగతి తెలిసిందే.

పితృత్వ సెలవులపై కోహ్లీ చివరి మూడు టెస్టులకు దూరమవుతున్న సంగతి తెలిసిందే. తొలి టెస్టు అనంతరం అతడు స్వదేశానికి తిరిగి రానున్నాడు. పూర్తి ఫిట్‌నెస్ సాధించని రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ కూడా తొలి రెండు టెస్టులకు దూరమవుతున్నారు. అయితే ఆస్ట్రేలియాలో కఠిన క్వారంటైన్‌ నిబంధనలు, గాయం నుంచి కోలుకోవడానికి కొన్ని వారాల సమయం పడుతుండటంతో వారిద్దరు చివరి టెస్టులకు కూడా అనుమానమే అని వార్తలు వస్తున్నాయి.