Corona Medicine: క్లినికల్ ట్రయల్స్ లో కరోనా వ్యాధి లక్షణాలు తగ్గించే కొత్త మందు పరిశోధనలు..త్వరలో అందుబాటులోకి!

కరోనా మొదటి సరి వచ్చినపుడు దాని లక్షణాలను తగ్గించడానికి ఏమి చేయాలనే ఆలోచించి ఆదిశగా పరిశోధనలు చేశారు శాస్త్రవేత్తలు. తరువాత ఆ లక్షణాలను బట్టి చికిత్స చేస్తూ మరణం అంచుల్లోకి జారిపోకుండా కరోనా రోగుల్ని కాపాడుకుంటూ వచ్చారు.

Corona Medicine: క్లినికల్ ట్రయల్స్ లో కరోనా వ్యాధి లక్షణాలు తగ్గించే కొత్త మందు పరిశోధనలు..త్వరలో అందుబాటులోకి!
Corona
Follow us
KVD Varma

|

Updated on: Apr 21, 2021 | 9:34 PM

Corona Medicine: కరోనా మొదటి సరి వచ్చినపుడు దాని లక్షణాలను తగ్గించడానికి ఏమి చేయాలనే ఆలోచించి ఆదిశగా పరిశోధనలు చేశారు శాస్త్రవేత్తలు. తరువాత ఆ లక్షణాలను బట్టి చికిత్స చేస్తూ మరణం అంచుల్లోకి జారిపోకుండా కరోనా రోగుల్ని కాపాడుకుంటూ వచ్చారు. కరోనా సోకితే వచ్చే ముఖ్యలక్షణాలు ఫ్లూ (ఇన్‌ఫ్లూయెంజా)కి దగ్గరలో ఉండడంతో దానికి ఉపయోగించే మందులతో కంట్రోల్ చేస్తూ కొద్ది ఫలితాలు సాధించారు. తరువాత కొన్ని దేశాల్లో రెమ్‌డెసివిర్‌ మందు రోగులపై వాడితే అది పనిచేసింది. దీంతో కరోనా ట్రీట్ మెంట్ లో రెమ్‌డెసివిర్‌ మందు ప్రధానంగా వాడుతూ వస్తున్నారు. ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయం కనిపెట్టామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇన్‌ఫ్లూయెంజాను నయం చేయడానికి గతంలో అభివృద్ధి చేసిన ఒక మందుకు కరోనా వైరస్‌ తీవ్రతను కట్టడి చేసే సామర్థ్యం ఉందని వారు అంటున్నారు. ఎలుకలపై ఈ మందును పరిశీలించినపుడు అది విజయవంతంగా పనిచేసిందని పేర్కొంటున్నారు. ఇక ఈ మందును మానవులపై కూడా క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించారు. అవి తుదిదశలో ఉన్నట్టు చెబుతున్నారు.

అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌ (ఎన్‌ఐహెచ్‌), బ్రిటన్‌లోని ప్లైమౌత్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో మోల్నుపిరావిర్‌ (ఎంకే-4482) అనే ఔషధంపై పరిశోధనలు చేశారు. కరోనా వల్ల బాధితుల ఊపిరితిత్తుల్లో కలిగే నష్టాన్ని కూడా ఇది తగ్గిస్తుందని వారు చెప్పారు. కరోనా వైరస్‌కు ప్రస్తుతం అనేకరకాల టీకాలు ఉన్నాయని తెలిపారు. అయితే ఈ వైరస్‌ వల్ల సోకే ఇన్‌ఫెక్షన్‌ను నయం చేయడానికి అన్ని సమర్థ ఔషధాలు లేవన్నారు. అందువల్ల తాజా ఆవిష్కారం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుందని వివరించారు.

ప్రస్తుతం రెమ్‌డెసివిర్‌ అనే యాంటీవైరల్‌ ఔషధాన్ని కొవిడ్‌ చికిత్స కోసం ఉపయోగిస్తున్నప్పటికీ దాన్ని.. ఇంజెక్షన్‌ రూపంలోనే ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. అందువల్ల అది ఆసుపత్రుల్లోనే ఇవ్వాలని తెలిపారు. అయితే, ఇప్పుడు పరిశోధనల్లో ఫలితాలు సాధిస్తున్న ఎంకే-4482 మాత్రల రూపంలో ఉంటుందనీ, అది వాడటం సులువుగా మారుతుందనీ వారు వివరించారు. దీన్ని ఎలుకల్లో ప్రయోగించినప్పుడు వాటిలో సాంక్రమిక వైరస్‌ స్థాయి వంద రెట్లు తగ్గినట్లు తేల్చారు. అలాగే మానవుల్లో వ్యాప్తిలో ఉన్న ఇతర కరోనా వైరస్‌లు, మెర్స్, సార్స్‌ వంటి వైరస్‌ల పునరుత్పత్తిని అడ్డుకునే సామర్థ్యం దీనికి ఉందని స్పష్టం చేశారు.

Also Read: Morning Time: మీరు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేయండి… రోజంతా హుషారుగా.. ఆరోగ్యంగా ఉంటారు

Corona Pandemic: కర్ఫ్యూ కట్టుబాట్లు.. కరోనా ఇబ్బందులు.. ఉత్తరప్రదేశ్ లో బ్యాంకుల పనివేళల కుదింపు

నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.