Corona Virus దేశంలో దడపుట్టిస్తున్న కరోనా మహమ్మారి.. ట్రిపుల్ మ్యూటెంట్ చెందిన మరో కొత్త రకం వైరస్..!
ఓవైపు డబుల్ మ్యూటెంట్ వైరస్ వల్లనే దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోందని నిపుణులు విశ్లేషిస్తుండగా.. ట్రిపుల్ మ్యూటెంట్ చెందిన మరో కొత్త రకం వైరస్ తాజాగా వెలుగులోకి వచ్చింది.
Covid 19 bengal strain: ఓవైపు డబుల్ మ్యూటెంట్ వైరస్ వల్లనే దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోందని నిపుణులు విశ్లేషిస్తుండగా.. ట్రిపుల్ మ్యూటెంట్ చెందిన మరో కొత్త రకం వైరస్ తాజాగా వెలుగులోకి వచ్చింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ వైర్‌సను పరిశోధకులు గుర్తించారు. కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్లో ట్రిపుల్ మ్యూటెంట్ వైర్‌సను కనుగొన్నట్టు సమాచారం..ఇక ఆ నంబర్‌ను చూస్తేనే వణుకుపుడుతోంది. లక్ష, 2 లక్షలు..కాదు..కాదు..అక్షరాలా 3 లక్షలు. ఎస్..నిపుణులు హెచ్చరించినట్లుగానే మూడు లక్షలకు చేరువైంది పాజిటివ్ కేసుల సంఖ్య…
ట్రిపుల్ మ్యూటేషన్‌లో మూడు కోవిడ్ స్ట్రెయిన్లు కలిపి కొత్త వేరియంట్‌గా మారాయని భావిస్తున్నారు నిపుణులు. మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌లో నమోదైన కేసుల్లో ట్రిపుల్ మ్యూటేంట్ కనిపించిందని పరిశోధకులు తెలిపారు. ట్రిపుల్ మ్యూటేంట్‌తో వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. అటు డబుల్ మ్యూటేషన్‌తో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. దేశంలో కరోనా మొదటి వేవ్‌లో పది మందిల్లో ఒకరు లేదా ఇద్దరికి వైరస్ వ్యాప్తి చెందగా, ప్రస్తుత డబుల్ మ్యూటేషన్‌తో వైరస్ వ్యాప్తి ఎనిమిదికి చేరింది. డబుల్ మ్యూటేషన్‌తో చివరికి చిన్న పిల్లలు కూడా వైరస్ బారిన పడుతున్నారు. ట్రిపుల్ మ్యూటేషన్ అంతకుమించి వేగంగా వ్యాప్తి చెందుతుందని భావిస్తున్నారు.
మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా వుంది ఇప్పుడు ఢిల్లీ పరిస్ధితి. అసలే కరోనా విజృంభణతో వణికిపోతున్న ఢిల్లీని మరో మహమ్మారి వేధిస్తోంది. గత కొన్ని రోజులుగా దేశ రాజధానిలో డెంగీ బారినపడుతున్న రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.రికార్డు స్థాయిలో కేసులు వెలుగు చూస్తున్నాయి. జనవరి 1 నుంచి ఈ నెల 17 వరకు నమోదైన డెంగీ కేసుల సంఖ్య… 2018లో ఇదే సమయంలో నమోదైన కేసులను అధిగమించింది.ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ కరోనా ధాటికి చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. వేలల్లో కేసులు.. వందల్లో మరణాలతో విలవిలలాడిపోతున్నాయి. హాస్పిటల్స్ అన్ని కిక్కిరిసిపోతున్నాయి. ఆక్సిజన్ అందక పిట్టల్లా రాలిపోతున్నారు కరోనా బాధితులు..ఢిల్లీలో కరోనా కేసులు గత రికార్డులను అధిగమించాయి. మహారాష్ట్రలో వైరస్ భయానక వాతావరణం కల్పిస్తోంది..
నేటి నుంచి మహారాష్ట్రలో మరిన్ని కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు..బ్రేక్ ద చైన్ పేరిట ఆంక్షలు ప్రకటించింది మహారాష్ట్ర ప్రభుత్వం..ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు 15శాతం మందితో పనిచేసేందుకు అవకాశం కల్పించగా,వివాహాలు, శుభకార్యాలకు 25 మందికి మాత్రమే అనుమతిని ఇస్తూ కరోనా నిబంధనలు అతిక్రమిస్తే 50 వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించింది..ఇదే సమయంలో కరోనా వేరియంట్లు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల 18 రాష్ట్రాల్లో సేకరించిన శాంపిల్ లలో ఒక డబుల్ మ్యూటేషన్ వేరియంట్ కనిపించినట్లుగా తెలుస్తుంది.ఇక తాజాగా పూణేలోని ఎన్ఐవీ మహారాష్ట్రలోని ప్రయోగశాలలతో డేటాను పంచుకుంది, జనవరి నుండి మార్చి వరకు మహారాష్ట్రలో తీసిన 361 కోవిడ్ -19 నమూనాలు మరియు జన్యు క్రమం ప్రకారం, 61% డబుల్ మ్యూటేషన్ వైరస్ ఉన్నట్టు గుర్తించింది. రాష్ట్రంలో కరోనా కారణంగా దారుణంగా ప్రభావితమైన రాష్ట్రంగా ఉంది.
Read Also… దేశంలో కోవిడ్ పై పోరు మరింత ఉధృతం, రంగంలోకి దిగిన భారత వైమానిక దళం,