కోవిడ్ 19 తో సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి కుమారుడు ఆశిష్ ఏచూరి కన్నుమూత
కోవిడ్-19 తో తన పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి మృతి చెందినట్టు సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి తెలిపారు. ఆశిష్ ఈ ఉదయం మృతి చెందాడని, ఎంతో బాధతో ఈ విషయాన్ని...
కోవిడ్-19 తో తన పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి మృతి చెందినట్టు సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి తెలిపారు. ఆశిష్ ఈ ఉదయం మృతి చెందాడని, ఎంతో బాధతో ఈ విషయాన్ని తెలియజేస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు. అతనికి చికిత్స చేసిన డాక్టర్లు, నర్సులకు, ఇతర వైద్య సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా యూపీ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత దినేష్ శర్మ, ఆయన భార్య కూడా కరోనా వైరస్ పాజిటివ్ కి గురయ్యారు. తాము ఐసోలేషన్ లోకి వెళ్లినట్టు ఆయన వెల్లడించారు. అటు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఏ.కె వాలియా కోవిడ్ కారణంగా మరణించారు. ఢిల్లీలో 32 మంది రోగులను రక్షించేందుకు పోలీసులు 11 ఆక్సిజన్ సిలిండర్లను హుటాహుటిన వివిధ ఆసుపత్రులకు తరలించారు. ఢిల్లీలో ఆక్సిజన్ కోటాను కేంద్రం పెంచింది.
కాగా-34 ఏళ్ళ వయసున్న ఆశిష్ ఏచూరికి కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మొదట హొలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స చేశారు. కానీ పరిస్థితి విషమించడంతో గురు గ్రామ్ లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వెంటిలేటర్ పై చికిత్స అందించారు. ఈ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆశిష్ ఢిల్లీ కేంద్రంగా పని చేసే ప్రముఖ దినపత్రికలో సీనియర్ కాపీ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
అటు-సీతారాం ఏచూరికి, ఆయన కుటుంబ సభ్యులకు అనేకమంది సంతాప సందేశాలు పంపారు.
మరిన్ని చదవండి ఇక్కడ : New Covid Sintomas:ఈ ఐదు మెయిన్ కోవిడ్ లక్షణాలు… క్రిటికల్ సిట్యూషన్స్ వీడియో.. అత్యంత ప్రమాదకరంగా కొత్త కరోనా తెలంగాణలో షర్మిల సక్సెస్ అవుతారా? ఒక జయలలిత మమతా బెనర్జీ లా షర్మిల మిలిగిపోతారా ?:The Rajinikanth Show Video.