AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలో కోవిడ్ పై పోరు మరింత ఉధృతం, రంగంలోకి దిగిన భారత వైమానిక దళం,

దేశంలో కోవిడ్ పై పోరును ప్రభుత్వం ఉధృతం చేసింది. ఇందులో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (భారత వైమానిక దళాన్ని) ని రంగంలోకి దించింది. దేశ వ్యాప్తంగా వివిధ ఆసుపత్రులు,

దేశంలో కోవిడ్ పై పోరు మరింత  ఉధృతం, రంగంలోకి దిగిన భారత వైమానిక దళం,
Iaf Forced Into Services To Combat Covid In India
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Apr 22, 2021 | 8:31 AM

Share

దేశంలో కోవిడ్ పై పోరును ప్రభుత్వం ఉధృతం చేసింది. ఇందులో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (భారత వైమానిక దళాన్ని) ని రంగంలోకి దించింది. దేశ వ్యాప్తంగా వివిధ ఆసుపత్రులు, సెంటర్లకు ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య పరికరాలు, మందులను రవాణా చేసేందుకు ఐ ఏ ఎఫ్ విమానాలను వినియోగించుకోనున్నారు. దేశంలో ముఖ్యంగా పలు హాస్పిటల్స్ ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్న తరుణంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. విమానాల ద్వారా అత్యవసరమైన అన్ని మందులు, వైద్య పరికరాలను ఇకపై రవాణా చేస్తామని వైమానిక దళ అధికారులు తెలిపారు. తద్వారా కరోనా వైరస్ పై జరిపే పోరులో తాము కూడా భాగస్వామ్యం వహిస్తామన్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇటీవల దేశంలో కోవిద్ పరిస్థితిపై త్రివిధ దళాల శాఖల అధిపతులతో . చర్చించారు. ఇండియాలో కరోనా వైరస్ కేసులు సుమారు 3 లక్షలకు పైగా నమోదు కావడంపట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కట్టడికి ప్రయత్నాలను ముమ్మరం చేయాలనీ ఆయన అధికారులను ఆదేశించారు. దేశంలో ఒక్క రోజే 2 వేలమందికి పైగా కరోనా రోగులు మరణించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఆక్సిజన్ కొరత వల్ల తలెత్తిన పరిస్థితిని కూడా రాజ్ నాథ్ సింగ్ సమీక్షించారు.

మొదట భారత వైమానిక దళ  సర్వీసులను వినియోగించుకోవడం ద్వారా  కరోనాపై పోరును ఉధృతం చేయాలని నిర్ణయించినట్టు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.  ఇలా ఉండగా ఇండియా నుంచి వచ్చేవిమాన  ప్రయాణికులను తప్పనిసరిగా 10 రోజులపాటు క్వారంటైన్ లోకి పంపాలని ఫ్రాన్స్ సూత్రప్రాయంగా నిర్ణయించింది.  తమ దేశంలో కూడా కోవిద్ కేసులు పెరిగిపోతున్నాయని, ఈ తరుణంలో ఇండియాలో ఈ కేసులు పెరిగిపోవడాన్ని తాము పరిగణనలోకి తీసుకున్నామని ఫ్రాన్స్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.

ఇక బ్రిటన్ లోని హీత్రో విమానాశ్రయం ఇండియా నుంచి వచ్చే అదనపు విమానాలకు అనుమతి నిరాకరించాలని నిర్ణయించింది. ఇండియాలో వందకు పైగా కరోనా వైరస్ వేరియంట్ కేసులను గుర్తించడంతో తామీ చర్య తీసుకున్నట్టు ఆరోగ్య శాఖ మంత్రి మట్ హాన్ కాక్ తెలిపారు. ఇప్పటికే బ్రిటన్ ఇండియాను రెడ్ లిస్టులో చేర్చిన విషయాన్నీ ఆయన గుర్తు చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని అయన చెప్పారు. మరిన్ని చదవండి ఇక్కడ : తెలంగాణలో షర్మిల సక్సెస్ అవుతారా? ఒక జయలలిత మమతా బెనర్జీ లా షర్మిల మిలిగిపోతారా ?:The Rajinikanth Show Video. Bengal elections: పశ్చిమ బెంగాల్‌లో మరోసారి నాటు బాంబుల కలకలం.. మూడు చోట్ల బాంబు పేలుళ్లు… ఒకరి మృతి.. పలువురికి గాయాలు