Indonesia: గల్లంతైన ఇండోనేషియా సబ్ మెరైన్.. అందులో 53 మంది! తీవ్రంగా వెదుకుతున్న నేవీ!

ఇండోనేషియాలో ఒక సబ్ మెరైన్ కనిపించకుండా పోయింది. దీంతో అక్కడ దీనికోసం వేట మొదలైంది. ఈ నేవీ సబ్ మెరైన్ లో 53 మంది ఉన్నట్టు సమాచారం. దీంతో వీరి క్షేమ సమాచారంపై ఆందోళన నెలకొంది.

Indonesia: గల్లంతైన ఇండోనేషియా సబ్ మెరైన్.. అందులో 53 మంది! తీవ్రంగా వెదుకుతున్న నేవీ!
Indonesia Submarine Missing
Follow us

|

Updated on: Apr 21, 2021 | 8:02 PM

Indonesia: ఇండోనేషియాలో ఒక సబ్ మెరైన్ కనిపించకుండా పోయింది. దీంతో అక్కడ దీనికోసం వేట మొదలైంది. ఈ నేవీ సబ్ మెరైన్ లో 53 మంది ఉన్నట్టు సమాచారం. దీంతో వీరి క్షేమ సమాచారంపై ఆందోళన నెలకొంది. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఇండోనేషియా ఉత్తర భాగంలోని బాలీ వద్ద ఈ సబ్ మెరైన్ మిస్ అయింది. అక్కడ నిర్వహిస్తున్న టర్పడో డ్రిల్ నిర్వహిస్తున్న సమయంలో ఇది అదృశ్యం అయిందని నేవీ అధికారి ఒకరు రీయూటర్స్ కు తెలిపారు. ఆ సబ్ మెరైన్ నుంచి రిలే సిగ్నల్స్ అనుకున్నంతగా రావడంలేదని ఆ వర్గాలు చెప్పాయి. ఇండోనేషియా మిలటరీ చీఫ్ హాది తజాంటు మాట్లాడుతూ.. ఈ సబ్ మెరైన్ బుధవారం ఉదయం 4;30 గంటల స్థానిక సమయంలో మిస్ అయిందని చెప్పారు.” మేం ఇప్పటికీ ఆ సబ్ మెరైన్ జాడ కోసం వెతుకుతూనే ఉన్నాం. బాలి నుంచి 60 కిలోమీటర్ల పరిధిలో ఉన్న సముద్ర జలాల్లో సబ్ మెరైన్ కోసం వెతుకులాట సాగుతూనే ఉంది. అందులో 53 మంది ఉన్నారు. వారి గురించే మేం ఆందోళన చెందుతున్నాం.” అని ఆయన తెలిపారు. అదేవిధంగా ఆస్ట్రేలియా, సింగపూర్ ల నుంచి సబ్ మెరైన్ వెతకడం కోసం సహాయాన్ని ఆయన కోరారు. కానీ, ఆ దేశాల నుంచి స్పందన రాలేదని తెలిసింది. ఈ సబ్ మెరైన్ 1978 సంవత్సరానికి చెందింది. జర్మనీ లో తయారైంది. ఈ విషయాన్ని ఆ దేశ మిలటరీ వెబ్ సైట్ లో పేర్కొన్నారు.

కాగా, సముద్రం అడుగుభాగంలో సంచరించే సబ్ మెరైన్ ల నుంచి సంకేతాలు రాకపోతే అది ప్రమాదంలో పడినట్టుగా భావిస్తారు. సముద్ర అంతర్భాగంలో చలించే సబ్ మెరైన్ ల ఆచూకీ సంకేతాల ద్వారానే తెలుస్తుంది. సబ్ మెరైన్ కనిపించకుండా పోయి ఆరురోజులు కావడంతో అది ఏదైనా ప్రమాదంలో పడి ఉంటుందని భావిస్తున్నారు. ఒకవేళ అటువంటిది జరిగితే, దాని జాడ దొరకడం కష్టమే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక దానిలో ఉన్న సిబ్బందికీ తప్పించుకునే అవకాశం దొరకదని వారంటున్నారు. పూర్తిగా నీటి అడుగుభాగానికి చేరిపోతే.. సబ్ మెరైన్ ను గుర్చించడం దాదాపు అసాధ్యమని చెబుతున్నారు.

Also Read: చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న హీరోయిన్.. తండ్రితో ఉన్న త్రోబ్యాక్ ఫోటోస్ షేర్ చేసిన ముద్దుగుమ్మ..

CM K Chandrashekar rao : సోమాజిగూడ యశోదా ఆస్పత్రికి సీఎం కేసీఆర్, కరోనా చికిత్సలో భాగంగా రాక