Fire in Bag: రోడ్డు మీద నడుస్తున్న వ్యక్తి బ్యాగ్ లో పేలుడు.. హడలి పోయిన జనం..పేలింది ఏమిటంటే.. Viral Video

చైనా ఫోనులు అంటే మనదగ్గర కొంత క్రేజ్ ఉందనేది వాస్తవం. అవి ఎంతకాలం.. ఎలా పనిచేస్తాయనేది పక్కన పెట్టి తక్కువ ధరల్లో మనకు దొరుకుతాయి.. ఎక్కువ ఫీచర్లు ఉంటాయి. ఇదే చూస్తారు చాలా మంది.

Fire in Bag: రోడ్డు మీద నడుస్తున్న వ్యక్తి బ్యాగ్ లో పేలుడు.. హడలి పోయిన జనం..పేలింది ఏమిటంటే.. Viral Video
Phone Fire
Follow us
KVD Varma

|

Updated on: Apr 21, 2021 | 5:25 PM

Fire in Bag: చైనా ఫోనులు అంటే మనదగ్గర కొంత క్రేజ్ ఉందనేది వాస్తవం. అవి ఎంతకాలం.. ఎలా పనిచేస్తాయనేది పక్కన పెట్టి తక్కువ ధరల్లో మనకు దొరుకుతాయి.. ఎక్కువ ఫీచర్లు ఉంటాయి. ఇదే చూస్తారు చాలా మంది. మన దగ్గర చాలా సార్లు చైనా ఫోన్లు చార్జింగ్ లో ఉండగా పేలిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కోసారి అవి పేలి కొందరి ప్రాణాలు కూడా పోయిన సంఘటనలు చాలానే ఉన్నాయి. అయితే, ఎటువంటి చార్జింగ్ పెట్టకుండా.. అలా బ్యాగులో పెట్టిన ఫోన్ పేలిన సంఘటన ఎప్పుడూ మనకు తెలీదు. మనకి అది అనుభవం లేదు కానీ, చైనాలో మాత్రం ఇటీవల అదే జరిగింది. ఎటువంటి చార్జింగ్ పెట్టకుండా.. బ్యాగులో పెట్టుకుని వెళుతున్న ఫోన్ పేలిపోయింది. దెబ్బతో చుట్టూ ఉన్న జనం హడలి చచ్చారు. కాకపొతే అది చైనా ఫోన్ కాదని బాధితుడు చెప్పాడు.

ఈ సంఘటన వినడానికి షాకింగ్ గానే ఉంది కదూ.. అవును.. దీని వీడియో సోషల్ మీడియాలో చూసిన వారూ ఇలాగే షాక్ అయ్యారట. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఒక వీడియో షేర్ చేసింది. ఆ వీడియోలో ఒక వ్యక్తి రద్దీగా ఉన్న రోడ్డుపై నడిచి వెళుతున్నాడు. ఇంతలో అకస్మాత్తుగా తన బ్యాగులోంచి పెద్ద శబ్దంతో మంటలు వచ్చాయి. దీంతో ఆ వ్యక్తి బ్యాగ్ ను విసిరేసి అక్కడ నుంచి పక్కకు జరిగిపోయాడు. ఈ ఘటనలో ఆ వ్యక్తి చేయి, జుట్టు, కనురెప్పలు మంటలకు కాలాయని మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది. ఆ వీడియో క్లిప్ లో బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం అది 2016లో కొన్న శాంసంగ్ ఫోన్. ఆ ఫోన్ బ్యాటరీతో ప్రోబ్లం ఉంది. కానీ, ఇది పేలిన సమయంలో చార్జింగ్ లో లేదు అని అతను చెప్పాడు.

ఇదిగో ఆ వీడియో మీకోసం..

Also Read: Bollineni Srinivas Gandhi: అవినీతిలో యువ సామ్రాట్.. ఒకే డిపార్ట్‌మెంట్‌లో 13 ఏళ్ల పాటు విధులు.. తవ్వేకొద్ది వెలుగుచూస్తున్న అక్రమాలు!

Corona Pandemic: అయ్యో..ఏమీ చేయలేకపోతున్నామే..! ఇటువంటిది ఎప్పుడూ చూడలేదు..ప్రస్తుత కరోనా పరిస్థితులపై ఓ లేడీ డాక్టర్ ఆవేదన..Viral Video

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!