AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Pandemic: అయ్యో..ఏమీ చేయలేకపోతున్నామే..! ఇటువంటిది ఎప్పుడూ చూడలేదు..ప్రస్తుత కరోనా పరిస్థితులపై ఓ లేడీ డాక్టర్ ఆవేదన..Viral Video

కరోనా తీవ్రంగా విరుచుకుపడుతోంది. ఆసుపత్రులు ఖాళీ లేక కరోనా బారిన పడిన వారు పడుతున్న తిప్పలకు సంబంధించిన వార్తలు దేశం నలుమూలల నుంచి వస్తూనే ఉన్నాయి. ఇక ఆక్సిజన్ కొరత వేధిస్తోంది.

Corona Pandemic: అయ్యో..ఏమీ చేయలేకపోతున్నామే..! ఇటువంటిది ఎప్పుడూ చూడలేదు..ప్రస్తుత కరోనా పరిస్థితులపై ఓ లేడీ డాక్టర్ ఆవేదన..Viral Video
Mumbai lady Doctor
KVD Varma
|

Updated on: Apr 21, 2021 | 4:56 PM

Share

Corona Pandemic:  కరోనా తీవ్రంగా విరుచుకుపడుతోంది. ఆసుపత్రులు ఖాళీ లేక కరోనా బారిన పడిన వారు పడుతున్న తిప్పలకు సంబంధించిన వార్తలు దేశం నలుమూలల నుంచి వస్తూనే ఉన్నాయి. ఇక ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. ఈ నేపధ్యంలో డాక్టర్లు కూడా ఏమీ చేయలేక నిస్సహాయులుగా ఉండిపోతున్నారు. మానవత్వంతో ఏదైనా చేద్దామన్నా ఉధృతంగా వచ్చి పడుతున్న కరోనా బాధితులకు సేవలు అందించడంలో వారు తీవ్ర ఒత్తిడి ఎదుర్కుంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం డాక్టర్ల మానసిక పరిస్థితి ఎలా ఉందొ తెలియచెప్పే వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఒక లేడీ డాక్టర్ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై తమ నిస్సహాయతను వ్యక్తం చేస్తూ ఆసుపత్రుల్లో ఉన్న పరిస్థితులను వివరిస్తూ ఆమె కన్నీళ్ళ పర్యంతం అయ్యారు. ముంబయి కి చెందిన డాక్టర్ తృప్తిగిలాడి ఆ వీడియోలో ఏమన్నారంటే..

కరోనా ఉద్ధృతితో ఆస్పత్రుల్లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. మేము నిస్సహాయులుగా మారాం. మాస్కు ధరించి జాగ్రత్తలు పాటిస్తేనే ఈ ఉపద్రవం నుంచి బయటపడతాం అంటూ ఆ వీడియోలో ఆమె సూచించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ”దేశంలో పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. నగరాలు, పట్టణాలు, పల్లెలను కరోనా చట్టేసింది. ముఖ్యంగా ముంబయిలో పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయి. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత ఏర్పడుతోంది. రోగులకు పడకలు లభించడంలేదు. వైద్యులు, వారి బంధువులకు కూడా పడకలు దొరకడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించండి. మేము నిస్సహాయులుగా మారుతున్నాం. ఇలాంటి పరిస్థితులను నేను ఎప్పుడూ ఎదుర్కోలేదు.” అని ఆ డాక్టర్ కంటతడి పెట్టారు.

”నాకు ఇప్పటివరకు కరోనా రాలేదు. నాకు ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంది. ఇకపై కూడా నాకు కరోనా రాదు అని మీరు అనుకుంటే అది పొరపాటే. యువకులు కూడా వెంటిలేటర్‌ మీద చికిత్స పొందుతున్నారు. మీరు అలాంటి పరిస్థితులు ఎదుర్కోకూడదనే మేము కోరుకుంటున్నాం. కచ్చితమైన జాగ్రత్తలు వహించండి. ఎవరిని కలిసినా, ఎవరితో మాట్లాడినా మాస్కు తప్పనిసరిగా ధరించాల్సిందే. ఏవైనా స్వల్ప ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే తగిన జాగ్రత్తలు పాటించాలి. అలా చేస్తే అవసరమైన వారికి పడకలు అందించిన వారమవుతాము” అని ఆమె చెప్పారు. వైరస్‌ను తేలిగ్గా తీసుకోవద్దని, అందరూ టీకాలు వేయించుకోవాలని సూచించారు. అందరూ జాగ్రత్తలు పాటిస్తే కరోనాను ఎదుర్కోగలమని, మూడో దశ రాకుండా నివారించగలమని పేర్కొన్నారు.

ఆ వీడియోను మీరూ చూడండి..

Also Read: ఆక్సిజన్ ట్యాంకర్‌ను దొంగిలించారు.. ఢిల్లీ ప్రభుత్వంపై హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ సంచలన ఆరోపణలు.

Vaccine for Eighteen: పద్దెనిమిది ఏళ్లకు టీకా..అమూల్ టచ్ తో  ప్రచారం..అదిరింది అంటున్న నెటిజనం!