Vaccine for Eighteen: పద్దెనిమిది ఏళ్లకు టీకా..అమూల్ టచ్ తో  ప్రచారం..అదిరింది అంటున్న నెటిజనం!  

అమూల్ ఈ బ్రాండ్ పేరు తెలీని వాళ్ళు మన దేశంలో దాదాపు ఉండరనే చెప్పొచ్చు. అమూల్ అంటే పాలు-పాల ఉత్పత్తులకు ఒక ట్రేడ్ మార్క్ గా చెప్పుకుంటారు.

Vaccine for Eighteen: పద్దెనిమిది ఏళ్లకు టీకా..అమూల్ టచ్ తో  ప్రచారం..అదిరింది అంటున్న నెటిజనం!  
Amul Doodle
Follow us
KVD Varma

|

Updated on: Apr 21, 2021 | 4:09 PM

Vaccine for Eighteen: అమూల్ ఈ బ్రాండ్ పేరు తెలీని వాళ్ళు మన దేశంలో దాదాపు ఉండరనే చెప్పొచ్చు. అమూల్ అంటే పాలు-పాల ఉత్పత్తులకు ఒక ట్రేడ్ మార్క్ గా చెప్పుకుంటారు. దేశంలోని డెయిరీ పరిశ్రమలో ఎక్కువశాతం అమూల్ చేతిలోనే ఉన్నాయని చెబుతారు. అయితే, అమూల్ అంటే పాలు మాత్రమె కాదు అందరికీ ఇంకో విషయం కూడా గుర్తు వస్తుంది. అది వారి ప్రచార ధోరణి. అమూల్ ప్రచార ప్రకటనలు చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉంటాయి. కరెంట్ ఎఫైర్స్ ఉపయోగించుకుని వాళ్ళు చేసినంత బాగా ప్రచార చిత్రాలు ఇంకెవరూ చేయలేరు. రాజకీయాలు.. సినిమాలు ఇలా ఏదైనా ఒక పాప్యులర్ ఈవెంట్ ఉంటె దాని ఆధారంగా అమూల్ నుంచి వచ్చే డూడుల్స్ అడిరిపోతాయి అంతే.

తాజాగా అమూల్ ఒక సరికొత్త ప్రచార చిత్రాన్ని వదిలింది. కరోనా వ్యాక్సినేషన్ పై ప్రభుత్వం 18 ఏళ్లు నిండిన వారందరికీ టీకాలు ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దీని ఆధారంగా అమూల్ సరికొత్త డూడుల్ సిద్ధం చేసింది. ఇంతకీ అందులో ఏముందో తెలుసా? ఫేస్ మాస్క్ ధరించిన అముల్ అమ్మాయి డూడుల్‌లో ఉంది. ఆమె చేతిలో ఒక బోర్డు ఉంది. దానిపై 18 అని రాసి ఉంది. ఆమె పక్కనే పీపీటీ కిట్ ధరించిన హెల్త్ కేర్ ప్రొఫెషనల్ ఒకరు ఉన్నారు. పీపీటీ కిట్ తొ ఉన్న ఈయన థమ్సప్ సిగ్నల్ ఆ అమ్మాయికి చూపిస్తున్నారు. వీరికి నేపధ్యంగా టీకాలు నిల్వ చేసే స్టోర్ కనిపిస్తోంది. ఇక దానిమీద క్యాప్షన్ ‘నో వేయిటీన్..ఇఫ్ యూ ఆర్ ఎయిటీన్’ (పద్దెనిమిది వస్తే..వేచి ఉండక్కర్లేదు) అని ఉంది. కింద వైపు చిన్న అక్షరాలతో అమూల్ యువర్ షాట్ ఆఫ్ బట్టర్ అని రాసి ఉంది. ఇప్పుడు ఈ డూడుల్ పై ట్విట్టర్ లో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. అమూల్ ట్విట్టర్ లో ఉంచిన డూడుల్ ఇదే!

ట్విట్టర్ లో వెల్లువెత్తిన కొన్ని కామెంట్స్..

Also Read: కోవిడ్ బీభత్సం, ఇండియా పర్యటనను రద్దు చేసుకున్న జపాన్ ప్రధాని, ఇప్పట్లో రానంటూ ప్రకటన

Sri Sitarama Kalyanam : పులకించిన భ‌ద్రాద్రి.. వైభ‌వంగా శ్రీ సీతారామ స్వాముల వారి క‌ళ్యాణం