కోవిడ్ బీభత్సం, ఇండియా పర్యటనను రద్దు చేసుకున్న జపాన్ ప్రధాని, ఇప్పట్లో రానంటూ ప్రకటన
ఇండియాలో పెరిగిపోతున్న కోవిడ్ కేసులతో ఒకటొకటిగా ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. తాజాగా జపాన్ ప్రధాని యొషి హిడె సుగా సైతం తన భారత పర్యటనను రద్దు .చేసుకున్నారు.
ఇండియాలో పెరిగిపోతున్న కోవిడ్ కేసులతో ఒకటొకటిగా ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. తాజాగా జపాన్ ప్రధాని యొషి హిడె సుగా సైతం తన భారత పర్యటనను రద్దు .చేసుకున్నారు. ఇదే సమయంలో ఫిలిప్పీన్స్ టూర్స్ ని కూడా వాయిదా వేసుకున్నారు.బ్రిటన్ పీఎం బోరిస్ జాన్సన్ తరువాత ఇప్పుడు తను కూడా భారత్ లో అడుగు పెట్టబోనని ఆయన అంటున్నారు. ఇలా పర్యటన రద్దు చేసుకున్న రెండో దేశాధినేత అయ్యారు. నిజానికి ఈ నెలాఖరులో ఆయన ఇండియాను విజిట్ చేయాల్సి ఉంది . ఈ టూర్ బదులు తమ దేశంలో కోవిడ్ పరిస్థితిపై ఆయన దృష్టి పెడతారని జపాన్ మీడియా పేర్కొంది. చైనా తన సైనిక సంపత్తిని పెంపొందించుకుంటుండడంపై ఆందోళన వ్యక్తం చేసిన భారత, జపాన్ దేశాలు దీన్ని అదుపు చేసేందుకు చేపట్టాల్సిన చర్యల మీద చర్చించాల్సి ఉంది. ఈ విషయంలో రెండు దేశాలూ సహకరించుకోవాలని ఉభయ దేశాల ప్రధానులూ లోగడ నిర్ణయించారు. అటు- తమ దేశంలోనూ పెరిగిపోతున్న కరోనా కేసులతో జపాన్ కూడా తల్లడిల్లుతోంది. ఈ నేపథ్యంలో టోక్యో, ఒసాకా నగరాల్లో ఎమర్జెన్సీ ప్రకటించాలని అక్కడి ప్రభుత్వం యోచిస్తోంది.
జపాన్ లో కోవిడ్ కేసులు 5 లక్షల 40 వేలకు పైగా నమోదు కాగా.. 9, 707 మంది రోగులు మరణించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం నత్తనడకన సాగుతోంది. ఇక అమెరికా ప్రభుత్వం కూడా తమ దేశస్థులెవరూ ఇండియాకు వెళ్ళ రాదని ఆదేశించిన విషయం గమనార్హం. పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ చేయించుకున్నా ప్రస్తుతానికి ఇండియా పర్యటనను వాయిదా వేసుకోవాలని అక్కడి ప్రభుత్వం సూచించింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Sri Sitarama Kalyanam : పులకించిన భద్రాద్రి.. వైభవంగా శ్రీ సీతారామ స్వాముల వారి కళ్యాణం
ఆ ‘రియల్ హీరో’ కు రూ. 50 వేల రివార్డు, సరికొత్త జావా బైక్ కూడా ! రైల్వే శాఖ ప్రకటన