ఆలయంలో అక్రమనిర్మాణం.. బుల్డోజర్‌తో కూల్చివేసిన మున్సిపల్‌ కార్పొరేషన్‌..!

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సోమవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆలయ ఆవరణలో పోలీసు భద్రత మధ్య ఈ కూల్చివేతల ప్రక్రియ మొదలైంది. ఆలయ ప్రాంగణంలో 10,000 చదరపుటడుగుల భూమి ఆక్రమణకు గురైనట్టు అధికారులు చెబుతున్నారు.

ఆలయంలో అక్రమనిర్మాణం..  బుల్డోజర్‌తో కూల్చివేసిన మున్సిపల్‌ కార్పొరేషన్‌..!
Indore Temple Tragedy
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 03, 2023 | 8:37 PM

ఇప్పటి వరకు అక్రమ కట్టడాలను బుల్డొజర్లతో కూల్చివేసిన ఘటనలు చూశాం. కానీ, అక్రమంగా నిర్మించారనే ఆరోపణల నేపథ్యంలో ఆలయ నిర్మాణాలను బుల్డొజర్లతో కూల్చివేశారు స్థానిక అధికారు. ఈ ఘటన మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటు చేసుకుంది. బుల్డోజర్లతో ఆలయ కూల్చివేతకు ముందుగా విగ్రహాలను మరో మందిరానికి తరలించారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ అదేశాలతో సోమవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆలయ ఆవరణలో పోలీసు భద్రత మధ్య ఈ కూల్చివేతల ప్రక్రియ మొదలైంది. ఆలయ ప్రాంగణంలో 10,000 చదరపుటడుగుల భూమి ఆక్రమణకు గురైనట్టు అధికారులు చెబుతున్నారు.

కూల్చివేతలకు స్థానికుల నుండి ఎలాంటి నిరసనలు, అవాంతారాలు తలెత్తకుండా పోలీసు బలగాలను మోహరించారు. విగ్రహాలను కాంతఫాడ్ ఆలయానికి తరలించి యథాప్రకారం పూజాదికాలు నిర్వహించారు. రామ నవమి రోజున ఇండోర్ ఆలయ విషాదం తర్వాత, అక్కడి నగర కార్పొరేషన్ అక్రమ ఆలయ భవనాలను బుల్డోజర్‌తో కూల్చివేసింది.

గత గురువారం శ్రీ రామనవమి హవనం సందర్భంగా ఆలయంలోని మెట్లబావి పైకప్పు కూలిపోయి 60 మంది మెట్లబావిలో పడిపోయారు. కొందరు స్వతహాగా తప్పించుకోగా, 20 మందిని రక్షించారు. ఆక్రమణలకు గురైన ప్రాంతంలోని భవనాలను ఖాళీ చేయడమే కాకుండా ఆలయ సముదాయంలోని దేవతా విగ్రహాలను కూడా తరలించారు.

ఇవి కూడా చదవండి

మెట్టు బావి పైన అక్రమంగా భవనాన్ని నిర్మించారని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఇండోర్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారి మాట్లాడుతూ.. ఇప్పుడు కూల్చివేసిన శిథిలాలను మెట్ల బావిలో నింపినట్టుగా చెప్పారు. దాంతో మెట్లబావి భవనం శాశ్వతంగా మూసివేయబడింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..