AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేం రోగం రా బాబోయ్‌..! పారిశుద్య కార్మికుడికి వింత వ్యాధి.. చర్మం కింద పాకుతున్న పురుగులు..

మురుగునీటి శుద్ధి కార్మికుడిగా పనిచేస్తున్న ఒక వ్యక్తికి ఉన్నట్టుండి విరేచనాలు కావడం మొదలైంది. ఆ తర్వాత అతనికి చర్మంపై దురద, దద్దుర్లు రావడం కూడా కనిపించింది. వెంటనే ఆస్పత్రికి వెళ్లిన బాధితుడికి చికిత్స చేసిన వైద్యులు షాక్‌ తిన్నారు. అతని చర్మం కింద పురుగులు పాకుతూ కనిపించడం చూసి ఆశ్చర్యపోయారు.

ఇదేం రోగం రా బాబోయ్‌..! పారిశుద్య కార్మికుడికి వింత వ్యాధి.. చర్మం కింద పాకుతున్న పురుగులు..
Worms Slithering Under His
Jyothi Gadda
|

Updated on: Apr 03, 2023 | 6:31 PM

Share

రకరకాల చర్మ వ్యాధులు వస్తుంటాయి. కానీ, ఇలాంటి వ్యాధులు చాలా అరుదు. ఇది ప్రాణాంతక వ్యాధి అని వైద్యులు చెబుతున్నారు. పైగా ఇది సాధారణంగా కనిపించే లక్షణం కాదని, వింత రోగం లా ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇన్ ఫెక్షన్ చర్మం పైన కాకుండా… చర్మం కింది భాగంలో కనిపించింది. రోగి చర్మం కింద సూక్ష్మ క్రిములు పాకుతూ స్పష్టంగా కనపడుతున్న దృశ్యం గగ్గుర్పాటుకు గురిచేస్తుంది. ఈ సంఘటన స్పెయిన్ లో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం…64 ఏళ్ల వ్యక్తి కి అరుదైన హైపర్ ఇన్ఫెక్షన్ సోకింది. మురుగునీటి శుద్ధి కార్మికుడిగా పనిచేస్తున్న ఒక వ్యక్తికి ఉన్నట్టుండి విరేచనాలు కావడం మొదలైంది. ఆ తర్వాత అతనికి చర్మంపై దురద, దద్దుర్లు రావడం కూడా కనిపించింది. వెంటనే ఆస్పత్రికి వెళ్లిన బాధితుడికి చికిత్స చేసిన వైద్యులు షాక్‌ తిన్నారు. అతని చర్మం కింద పురుగులు పాకుతూ కనిపించడం చూసి ఆశ్చర్యపోయారు. ఇది సాధారణంగా కనిపించే లక్షణం కాదని, వింత రోగం లా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇది ప్రాణాంతక వ్యాధిగా డాక్టర్లు నిర్ధారించారు. అయితే, అతనికి ఈ ఇన్ఫెక్షన్ ఎలా సోకింది అనే విషయం మాత్రం తెలియలేదు. పర్యావరణ కారణాల వల్లే ఇలాంటి వ్యాధి సోకి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అయితే, చికిత్స తర్వాత, రోగి దద్దుర్లు , విరేచనాలు తగ్గాయి డాక్టర్స్‌ చెప్పారు.

ఈ పురుగు వ్యాధి సాధారణంగా లక్షణం లేనిదని వైద్యులు చెబుతున్నారు. చాలా సార్లు ఈ వ్యాధి ఎక్కువ రోజుల వరకు బయటపడదని చెప్పారు అయితే, హార్మోన్ థెరపీ ఈ వ్యాధిని తగ్గించగలదని చెప్పారు. అయితే, హార్మోన్ థెరపీ ఈ వ్యాధిని తగ్గించగలదు. ఈ పురుగులు రోగనిరోధక శక్తిని పూర్తిగా నాశనం చేసినప్పటికీ. చాలా సార్లు, హైపర్ ఇన్ఫెక్షన్ పెరుగుదల కారణంగా, సెప్సిస్ కూడా శరీరంలో సంభవిస్తుంది. ఇది తరువాత ప్రాణాంతకంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..