Deadliest Rivers: ఆ నది లో పడితే మరణమేనా..! ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన నదులు..

Deadliest Rivers: ఆ నది లో పడితే మరణమేనా..! ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన నదులు.. నదులంటే సహజంగా ప్రశాంతతకు, ఆహ్లాదానికి మారుపేరుగా చెప్పుకుంటాం. నదీతీరాల్లో సాయంత్ర వేళలు గడపటం అంటే అందరికీ ఇష్టం.. కానీ, ప్రపంచంలో కొన్ని నదులు అత్యంత ప్రమాదకరమైనవి. వాటి పేర్లు వింటేనే జనం భయపడిపోతారు. ప్రపంచంలోని అత్యంత భయంకరమైన, ప్రమాదకరమైన ఆ నదులేంటో ఇక్కడ తెలుసుకుందాం..

|

Updated on: Apr 03, 2023 | 4:11 PM

ఒకప్పుడు ప్రధాన నీటి వనరుగా ఉండే అనేక నదులు ప్రపంచమంతటా ప్రవహిస్తున్నాయి. కానీ నేటి కాలంలో చాలా నదులు పూర్తిగా కలుషితమయ్యాయి. అందులోని నీరు తాగడం అంటే మరణాన్ని ఆహ్వానించడమే. నైలు నది ప్రపంచంలోనే అతి పొడవైన నదిగా మనందరికీ తెలిసిందే. దీని పొడవు 6,600 కిలోమీటర్ల కంటే ఎక్కువ, కానీ ప్రపంచంలోని అత్యంత ఘోరమైన నదులు ఏవో మీకు తెలుసా.?

1 / 5

Cahill's Crossing: ఆస్ట్రేలియాలోని ఈ నది మొసళ్లకు ప్రసిద్ధి. 'నీటి రాక్షసులు'గా పిలువబడే మొసళ్లు ఇక్కడ పెద్ద సంఖ్యలో కనిపిస్తాయి. వాటికి మనిషి కనిపిస్తే చాలు..వారిపైకి దూసుకెస్తాయి. ఈ నదిని దాటడం అంటే ప్రాణాల మీద ఆశలు వదులుకున్నట్టే. కానీ ఇప్పటికీ ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని దాటుతున్నారు. నివేదిక మేరకు..అందులో 4 మైళ్ల దూరంలో సుమారు 120 మొసళ్ళు కనిపించాయని చెప్పారు.

2 / 5
Congo Rive: ఈ నదిని జైర్ నది అని కూడా అంటారు.  ఇది ఆఫ్రికాలో రెండవ పొడవైన నది. చాలా ప్రమాదకరమైనది. ఈ నదిలోకి వెళ్లడం అంటే మొసళ్లు, హిప్పోలు, పాములు వంటి ప్రాణాంతకమైన జంతువులను ఎదుర్కోవడమే.  ఇది కాకుండా ఒక నరమాంస భక్షక తెగ కూడా నదికి ఒక వైపున నివసిస్తుంది. ఇది మానవులను చంపి తింటుంది.

3 / 5
San Juan River: అర్జెంటీనాలో ప్రవహించే ఈ నది కూడా అత్యంత ప్రమాదకరమైనదే. మొసళ్లు, పాములు వంటి ప్రమాదకరమైన జీవులు ఈ నదిలో కనిపించనప్పటికీ, ఇది ఇప్పటికీ ప్రమాదకరమైనది. ఎందుకంటే ఇది మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు ప్రధాన మార్గాలలో ఒకటి. ఈ నది గుండా సామాన్యులేవరైనా ప్రయాణిస్తే.. వాళ్ల ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్నట్లే.

4 / 5
Citarum River
సీతారాం నది: ఇండోనేషియాలోని ఈ నది నీటిపారుదల, చేపల వేటకు ఎక్కువ ఉపయోగిస్తుంటారు ప్రజలు. అయితే, అదే సమయంలో ఇది ప్రపంచంలోని ప్రాణాంతక నదులలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఈ నది పూర్తి మురికి కూపంగా మారింది. ఇది క్యాన్సర్‌తో సహా అనేక వ్యాధులకు కారణమవుతుంది. ప్రమాదకరమైన వ్యాధులకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది.

Citarum River సీతారాం నది: ఇండోనేషియాలోని ఈ నది నీటిపారుదల, చేపల వేటకు ఎక్కువ ఉపయోగిస్తుంటారు ప్రజలు. అయితే, అదే సమయంలో ఇది ప్రపంచంలోని ప్రాణాంతక నదులలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఈ నది పూర్తి మురికి కూపంగా మారింది. ఇది క్యాన్సర్‌తో సహా అనేక వ్యాధులకు కారణమవుతుంది. ప్రమాదకరమైన వ్యాధులకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది.

5 / 5
Follow us