Lemon Juice: రోజుకు ఒక గ్లాసు నిమ్మరసం.. వేసవిలో వచ్చే అనేక ఆరోగ్య సమస్యలు పరార్..
ఏడాది పొడవునా మనకు లభించే నిమ్మకాయల శక్తి తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. పుల్లగా ఉండి మీ రుచిమొగ్గలకు సరికొత్త ఉత్సాహం తెచ్చే నిమ్మశక్తి ఇటు సంప్రదాయ వైద్యంలోనూ, అటు ఇంగ్లీష్ మెడిసిన్ లోనూ అగ్రతాంబూలం అందుకోవటానికి చాలా కారణాలున్నాయి.
Updated on: Apr 03, 2023 | 4:01 PM

చాలా మంది జీర్ణ సమస్యలను ఎదుర్కొంటారు. అయితే, మీకు అలాంటి సమస్య ఉంటే, ప్రతి రోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ పిండుకుని తాగడం వల్ల ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.

రుచికరమైన నిమ్మరసం వర్క్ ఫ్రం హోం వారికి దివ్యౌషధం. గంటలతరబడి కంప్యూటర్ ముందు పని చేయడం వల్ల తలెత్తే సైడ్ ఎఫెక్ట్స్ కొన్నింటికి నిమ్మరసం విరుగుడుగా పనిచేస్తుంది.

తరచుగా నోరు పొడిబారిపోవడం, తరచుగా దాహం,తాగునీరు కారణంగా తరచుగా మూత్రవిసర్జన సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, నిమ్మకాయ నీరు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది

ప్రస్తుతం చాలా మంది ప్రజలు ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు. మీరు మీ వయస్సు కంటే అధిక బరువు కలిగి లావుగా ఉంటే, అనేక ఇతర వ్యాధులకు దారితీస్తుంది. ఇలాంటి సందర్భాల్లో నిమ్మరసం, వేడినీరు తాగడం వల్ల ఊబకాయం తగ్గుతుంది.

ఇంకా స్వచ్ఛమైన గాలి పెద్దగా లేనిచోట వచ్చే తలనొప్పి, నిరుత్సాహం కాస్త నిమ్మకాయ జ్యూస్ తాగాది తొలగిపోతాయి. హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలంటే ముందు లైమ్ జ్యూస్ మీ డైట్ లో చేర్చుకోండి.

బాగా నీరసంగా ఉన్నప్పుడు కొబ్బరినీటిలో నిమ్మరసం పిండుకొని తాగడం వల్ల తక్షణ శక్తి కలుగుతుంది. గుండెల్లో మంట, డయేరియా, బద్ధకం నివారణకు నిమ్మరసం మంచి ఔషధం

పొట్టలోని చెడు బ్యాక్టీరియాను చంపడానికి ఇది బాగా పని చేస్తుంది. దీని కోసం ముందుగా నిమ్మకాయను కట్ చేసి దాని రసాన్ని ఒక గ్లాసు నీళ్లల్లో కలుపుకుని , సరిపడ ఉప్పు వుసుకుని తాగాలి. ఇలా వారానికి కనీసం 2 సార్లు తాగినట్టయితే... మీరు దాని నుండి చాలా ప్రయోజనం పొందుతారు.




