Watch: మెట్రోరైల్లో మహిళల మధ్య వాగ్వాదం.. చిల్లీ స్ప్రేతో దాడి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

మెట్రోలో ఇద్దరు మహిళల మధ్య గొడవకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇద్దరు మహిళల మధ్య వాగ్వాదం హోరాహోరీ జరిగింది.. అయితే, వారి సమస్య ఏంటో వింటే మాత్రం నవ్వుకుంటారు.అదేంటంటే...

Watch: మెట్రోరైల్లో మహిళల మధ్య వాగ్వాదం.. చిల్లీ స్ప్రేతో దాడి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Delhi Metro
Follow us

|

Updated on: Apr 03, 2023 | 9:29 PM

సోషల్ మీడియాలో ప్రతిరోజూ అనేక రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఎలాంటి వీడియో ఎప్పుడు వైరల్ అవుతుందో చెప్పలేం. జంతువులు, పక్షులు, పాములు వంటి వీడియోలు కూడా బాగా వైరల్‌ అవుతుంటాయి. ఇకపోతే, పెళ్లిళ్లు, చిన్నపిల్లల అల్లరికి సంబంధించి వీడియోలు కూడా తరచూ సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంటాయి. అలాగే, ఇటీవలి కాలంలో మెట్రోలో జరుగుతున్న చిత్ర విచిత్ర సంఘటనలు కూడా నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి. అయితే, ఈ సారి కూడా అలాంటిదే మెట్రోలో ఇద్దరు మహిళల మధ్య గొడవకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇద్దరు మహిళల మధ్య వాగ్వాదం జరిగింది. అయితే, వారి సమస్య ఏంటో వింటే మాత్రం నవ్వుకుంటారు.అదేంటంటే… సీటు విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అయితే వీడియో చూస్తుంటే ఇదేం సమస్య అని ఎవరైనా అనుకోవచ్చు. కానీ, ఈ ఇద్దరు మహిళల మధ్య సమస్యకు సీటుయే మూలకారణం.

వీడియోలో, ఒక మహిళ మరో మహిళపై అరుస్తూ ఉంటుంది. మెట్రో కూడా పెద్ద రష్‌ ఏం లేన్నట్టుగానే కనిపిస్తుంది. ఇద్దరికీ కూర్చోవటానికి సరిపడా సీటు ఉంది. అయినా ఇద్దరూ వాదులాడుకుంటున్నారు.. ఇది ఇలాగే కొనసాగుతుండగా వింటున్న రెండో మహిళ ఆమెను హెచ్చరించింది. నోరు మెదపకుంటే కొడతానని బెదిరించింది. ఇంతలో అవతలి మహిళ తన బ్యాగులోంచి చిల్లీ స్ప్రే బయటకు తీసింది. ఎదురుగా ఉన్న మహిళను బెదిరిస్తూ..స్ర్పె చేస్తానని హెచ్చరించింది. ఇద్దరూ చేతులు పట్టుకుని పెనుగులాడుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో వీడియోలో చూడండి..

ఇవి కూడా చదవండి

తజిందర్ పాల్ సింగ్ బాగా అనే ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ వీడియోను షేర్ చేశారు. ఢిల్లీ మెట్రోలో ఇది మరో సీన్ అని పేర్కొంటూ తజిందర్ పాల్ ఈ వీడియోను ట్వీట్ చేశారు. మొన్న ఢిల్లీ మెట్రోలో సీట్ల విషయంలో మహిళలు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటున్న వీడియో వైరల్‌గా మారింది. ఆ తర్వాత ఈ వీడియో సోషల్ మీడియాలోకి కూడా చేరింది. ఇప్పటికే దాదాపు ఐదు లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ