Karnataka Elections: అక్కడి నుంచే పోటీ చేస్తా..కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై కీలక వ్యాఖ్యలు
చ్చే నెలలో కర్ణాటకలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ వేడి మొదలైంది. ఇప్పటికే టిక్కెట్లు ఎవరికి ఇవ్వాలనే దానిపై ప్రధాన పార్టీలు కసరత్తులు చేస్తున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు అనేక వ్యూహాలను రచిస్తున్నాయి.
వచ్చే నెలలో కర్ణాటకలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ వేడి మొదలైంది. ఇప్పటికే టిక్కెట్లు ఎవరికి ఇవ్వాలనే దానిపై ప్రధాన పార్టీలు కసరత్తులు చేస్తున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు అనేక వ్యూహాలను రచిస్తున్నాయి. అయితే ఈ తరుణంలో కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తాను షిగ్గాన్ నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రభుత్వ అనుకూలత ఉందని పేర్కొన్నారు.
మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో అనేక మార్పులు వచ్చాయని బొమ్మై అన్నారు. ఈసారి కూడా ఎన్నికలకు బీజేపీ పూర్తిస్థాయిలో సన్నద్ధమైనట్లు పేర్కొన్నారు. తమ పనితీరు ఆధారంగానే ప్రజల నుంచి ఓట్లు ఆశిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ హయాంలో దేశంలో భారీగా అవినీతి జరిగిందని విమర్శించారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ప్రభావం చూపించిందని ఆరోపించారు. అయితే కాంగ్రెస్ తమ అభర్థులను మంగళవారం ప్రకటించే అవకాశం ఉంది. కానీ బీజేపీ ఇప్పటివరకు ఎన్నికల్లో పోటీ చేసే వారి జాబితాను ప్రకటించలేదు. వారం రోజుల్లో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం