Viral News: పోలీసులను చూడగానే బ్యాగ్‌ను చీకట్లో విసిరేసి పారిపోయిన వ్యక్తి.. అందులో ఏముందో తెలిస్తే షాకే..
పోలీసులు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్న అక్రమ స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదు. తాజాగా చెన్నైలో వెలుగులోకి వచ్చిన ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వివరాల్లోకి వెళితే.. ఆదివారం చెన్నైలోని బీచ్ రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు రెగ్యులర్ చెకింగ్స్‌లో భాగంగా తనిఖీలు నిర్వహింంచారు...
పోలీసులు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్న అక్రమ స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదు. తాజాగా చెన్నైలో వెలుగులోకి వచ్చిన ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వివరాల్లోకి వెళితే.. ఆదివారం చెన్నైలోని బీచ్ రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు రెగ్యులర్ చెకింగ్స్‌లో భాగంగా తనిఖీలు నిర్వహింంచారు. ఇదే సమయంలో అటుగా వస్తోన్న ఓ ఆటోను పోలీసు అధికారులు ఆపారు.
ఈ సమయంలో ఆటోలో ఓ ప్రయాణికుడు ఉన్నాడు. అతని వయసు సుమారు 40 ఏళ్లు ఉంది. చేతిలో ఓ బ్యాగ్‌తో ఉన్నాడు. పోలీసులు ఆటో డ్రైవర్‌ను డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు బండి పేపర్స్‌ను చెక్ చేస్తున్నారు. దీంతో అప్పటి వరకు ఆటోలో కూర్చున్న ప్రయాణికుడు బయటకు దిగి వేగంగా నడవడం ప్రారంభించాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అతన్ని వెంబడించారు. సమీపంలో ఉన్న బీచ్ రైల్వే స్టేషన్‌లోకి వేగంగా పరిగెత్తాడు. ఆ సమయంలో చేతిలో ఉన్న బ్యాగ్‌ను చెట్ల మధ్యలో విసిరేసి అప్పటికే బయలుదేరిన సబర్బన్ రైలులోకి ఎక్కేశాడు. పోలీసులు చేరుకోకముందే రైలు స్టేషన్ నుంచి బయలుదేరింది.
ఇక చేసేదేమి లేక పోలీసులు సదరు వ్యక్తి విసిరేసిన బ్యాగును చెక్ చేవారు. ఆ బ్యాగ్‌లో 2 కిలోల బంగారు కడ్డీలు కనిపించడంతో ఒక్కసారిగా విస్తుపోయారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కూపి లాగుతున్నారు. పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు ఆ వ్యక్తి ఓమ్మి బస్సులో రామనాథపురం నుంచి చెన్నైకి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు . వాషర్‌మన్‌పేటకు వెళ్లేందుకు ఆటోను అద్దెకు తీసుకున్నట్లు ఆటో డ్రైవర్ చెప్పాడు . ఇది స్మగ్లింగ్ కేసుగా పోలీసులు అనుమానిస్తున్నారు. బంగారాన్ని ఆదాయపు పన్ను శాఖకు అప్పగించారు. సదరు వ్యక్తిని గుర్తించేందుకు సీసీటీవీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..