TCIL Recruitment 2023: నెలకు రూ.3 లక్షల జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే..
భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన న్యూఢిల్లీలోని టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (టీసీఐఎల్).. జనరల్ మేనేజర్, చీఫ్ జనరల్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల..
భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన న్యూఢిల్లీలోని టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (టీసీఐఎల్).. జనరల్ మేనేజర్, చీఫ్ జనరల్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ/ ఎంటెక్/ ఎంసీఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా 50 నుంచి 56 యేళ్ల మధ్య ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో ఏప్రిల్ 19, 2023వ తేదీలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి మొదటి రూ. లక్ష నుంచి రూ.3 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్..
The Chief General Manager (HR), Telecommunications Consultants India Ltd., TCIL Bhawan, Greater Kailash –I, New Delhi – 110048.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.