AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తస్మాత్‌ జాగ్రత్త..! వాషింగ్‌ మిషిన్‌ పేలుడుతో విధ్వంసం.. తృటిలో తప్పించుకున్న వ్యక్తి.. సీసీ కెమెరాలో షాకింగ్‌ దృశ్యాలు..

అది పేలడానికి కొన్ని క్షణాల ముందు దాని ముందు నుండి ఒక వ్యక్తి బయటకు వెళ్లటంతో అతడు తృటిలో ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. ఈ షాకింగ్ ఘటన అక్కడి సీసీ కెమెరాలోరికార్డైంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తస్మాత్‌ జాగ్రత్త..! వాషింగ్‌ మిషిన్‌ పేలుడుతో విధ్వంసం.. తృటిలో తప్పించుకున్న వ్యక్తి.. సీసీ కెమెరాలో షాకింగ్‌ దృశ్యాలు..
Washing Machine Blast
Jyothi Gadda
|

Updated on: Apr 03, 2023 | 7:00 PM

Share

సెల్‌ఫోన్‌ పేలుళ్లు, చార్జ్‌డ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ పేలుళ్లు..తరచూ వార్తల్లో చూస్తుంటాం. ఇలాంటి సందర్భాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా విన్నాం. అయితే, పేలుతున్న ఈ ఎలక్ట్రికల్ వస్తువుల జాబితాలో ఇప్పుడు కొత్తగా వాషింగ్ మిషన్ కూడా చేరింది.. అవును, ఒక వాషింగ్ మెషీన్ అకస్మాత్తుగా పేలింది. అది పేలడానికి కొన్ని క్షణాల ముందు దాని ముందు నుండి ఒక వ్యక్తి బయటకు వెళ్లటంతో అతడు తృటిలో ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. ఈ షాకింగ్ ఘటన అక్కడి సీసీ కెమెరాలోరికార్డైంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాగా ఈ ఘటన స్పెయిన్‌లో చోటుచేసుకుంది.

ఓన్లీ బ్యాంగర్స్ (@OnlyBangersEth) ఖాతా ద్వారా 16 సెకన్ల నిడివి గల వీడియో ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. తన బట్టల పాకెట్స్ సరిగ్గా చెక్ చేసుకోలేదని రాసి ఓ వ్యక్తి పోస్ట్ చేసిన ఈ వీడియోను 15 మిలియన్లకు పైగా వీక్షించారు. వీడియోలో చూసినట్లుగా ఒక వ్యక్తి తన భుజానికి బ్యాగ్‌ వేసుకుని, రెండు చేతుల్లో మూడు బ్యాగ్‌లు పట్టుకుని ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయాడు. అతడు డోర్‌ ఓపెన్‌ చేసుకుని వెళ్లిన క్షణాల్లోనే ఒక్కసారిగా అక్కడున్న వాషింగ్‌ మిషన్‌ పేలిపోయింది. పేలుడు ధాటికి అక్కడ ఉన్న ఇతర విద్యుత్ యంత్రాలు కూడా దగ్ధమయ్యాయి. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ఇది జరిగింది.

ఇవి కూడా చదవండి

పేలుడు శబ్దం వినడంతో అక్కడ ఉన్న చాలా మంది ప్రజలు తమ ఇళ్ల నుండి పరుగులు తీశారు. వెంటనే ఎమర్జెన్సీ నంబర్ 112కి కాల్ చేశారు. ఫైర్‌ స్టేషన్‌కి కూడా సమాచారం అందించారు. ఈ వాషింగ్ మెషీన్ లోపల బట్టలు ఉతకడానికి వేసినవారు తమ దుస్తులను సరిగ్గా వేయలేదని. బట్టల జేబులో లైటర్, ఛార్జర్ పెట్టి వాషింగ్ మెషీన్ లో వేయడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని ప్రాధమికంగా నిర్ధారించారు.

ఘటనానంతరం అగ్నిమాపక శాఖ అధికారులు అగ్నిప్రమాదం జరిగిన భవనం గోడను కూల్చివేశారని, శాంతిభద్రతల ప్రమాదం ఉందని మొత్తం భవనాన్ని పునర్నిర్మించాలని ఆదేశించినట్లు సమాచారం. కొన్నేళ్ల క్రితం స్కాట్‌లాండ్‌లో వాషింగ్ మెషీన్ పేలి ఇంటి వంటగది పూర్తిగా ధ్వంసమైన సంఘటన ఇదే. దీని గురించి ఇతరులకు తెలియజేసేందుకు లారా బిరెల్ ఫేస్‌బుక్‌లో ఒక ఫోటోను షేర్‌ చేశారు.