Indian Railways: పట్టాలెక్కనున్న శతాబ్ది, దూరంతో రైళ్లు.. మరో 50 ట్రైన్లకు గ్రీన్ సిగ్నల్..

Railways Restart Trains: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. నెల క్రితం భారీగా నమోదైన కేసులతో అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో పెద్ద ఎత్తున

Indian Railways: పట్టాలెక్కనున్న శతాబ్ది, దూరంతో రైళ్లు.. మరో 50 ట్రైన్లకు గ్రీన్ సిగ్నల్..
Trains

Railways Restart Trains: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. నెల క్రితం భారీగా నమోదైన కేసులతో అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో పెద్ద ఎత్తున రవాణా సర్వీసులు నిలిచిపోయాయి. రైళ్ల సర్వీసులను కూడా పెద్ద ఎత్తున రద్దు చేస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. అయితే.. ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతుండటంతో.. నిలిపివేసిన రైళ్ల సర్వీసులను మళ్లీ పున:ప్రారంభించేందుకు రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు సర్వీసులను పునరుద్ధరించగా.. మరికొన్ని సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు భారత రైల్వే సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 21 నుంచి పలు మార్గాల్లో నడిచే రైళ్లను తిరిగి ప్రారంభిస్తున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు.

అయితే రైల్వే శాఖ విడుదల చేసిన జాబితా ప్రకారం.. శతాబ్ది, దూరంతో సహా 29 ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల సర్వీసులు మళ్లీ ప్రారంభం కానున్నాయి. వీటితో పాటు ఈ నెల 25 నుంచి సమ్మర్‌ స్పెషల్‌ రైళ్లను గోరఖ్‌పూర్‌ నుంచి బాంద్రా టెర్మినస్‌ వరకు నడుపుతామని కేంద్ర రైల్వేమంత్రి తెలిపారు. ఇందులో న్యూఢిల్లీ – కల్కా శతాబ్ది, న్యూఢిల్లీ – డెహ్రాడూన్‌ శతాబ్ది, న్యూ ఢిల్లీ – అమృత్‌సర్‌ జంక్షన్‌ శతాబ్ది, ఢిల్లీ సారాయ్‌ రోహిల్లా – జమ్ముతావి దురంతో ఎక్స్‌ప్రెస్‌, శ్రీమాతా వైష్ణోదేవి కత్రా – న్యూఢిల్లీ శ్రీ శక్తి ఎక్స్‌ప్రెస్‌, లక్నో – ప్రయాగ్‌రాజ్‌ సంగం ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఈ నెల 21 నుంచి నడుస్తాయని రైల్వేశాఖ వెల్లడించింది.

Also Read:

Rythu Bandhu: అత్యధిక లబ్ధిదారులు ఈ జిల్లా రైతులే.. చురుగ్గా సాగుతున్న రైతు బందు పంపిణీ

Helmet: మెదడు పని తీరును తెలుసుకునే హెల్మెట్‌.. అభివృద్ధి చేసిన అమెరికాకు చెందిన కెర్నల్‌ సంస్థ