AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Helmet: మెదడు పని తీరును తెలుసుకునే హెల్మెట్‌.. అభివృద్ధి చేసిన అమెరికాకు చెందిన కెర్నల్‌ సంస్థ

Helmet: రాబోయే కొన్ని వారాల్లో అమెరికాలో ఓ అద్భుతమైన హెల్మెట్‌ అందుబాటులోకి రానుంది. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ‘కెర్నల్‌’ అనే సంస్థ హెల్మెట్‌ లాంటి.

Helmet: మెదడు పని తీరును తెలుసుకునే హెల్మెట్‌.. అభివృద్ధి చేసిన అమెరికాకు చెందిన కెర్నల్‌ సంస్థ
Helmet
Subhash Goud
|

Updated on: Jun 18, 2021 | 8:52 AM

Share

Helmet: రాబోయే కొన్ని వారాల్లో అమెరికాలో ఓ అద్భుతమైన హెల్మెట్‌ అందుబాటులోకి రానుంది. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ‘కెర్నల్‌’ అనే సంస్థ హెల్మెట్‌ లాంటి రెండు పరికరాలను అభివృద్ధి చేసింది. దీని ప్రత్యేకత ఏంటంటే.. మీ మెదడును పూర్తిగా చదివేస్తుంది. దీని ద్వారా మెదడు పని తీరును తెలుసుకునే ఉపయోగపడుతుంది. సెన్సర్ల నెట్లు ఉన్న ఈ హెల్మెట్‌ పెట్టుకుంటే మెదడులో విద్యుత్‌ ప్రపంపనలు, రక్త ప్రవాహాన్ని వాయువేగంతో కొలవడంతో పాటు పూర్తిగా విశ్లేషిస్తుంది. తాము రూపొందించిన హెల్మెట్‌లను పదుల సంఖ్యలో మార్కెట్‌లోకి తీసుకురానుంది. ఈ హెల్మెట్‌ ధర 50 వేల డాలర్లు మాత్రమే. అయితే కెర్నల్‌ అభివృద్ధి చేసిన పరికరాల్లో రెండు రకాలున్నాయి. ఒకటి ఫ్లో, రెండోది ఫ్లక్స్‌. ఫ్లో – బ్రెయిన్‌ ఇంటర్ఫేస్‌ ద్వారా మెదడు రియల్‌ టైం డేటాను రికార్డు చేయవచ్చు. అంతేకాకుండా దానికి అమర్చిన లేజర్‌ పరికరాల ద్వారా మెదడు కార్యకలాపాల కచ్చితత్వం తెలుసుకునే ఉపయోగపడుతుంది.

అయితే వీటిని మెదడుపై పరిశోధన చేసే సంస్థలకు పంపిణీ చేయనున్నారు. ఈ పరిజ్ఞానం చాలా ఏళ్ల నుంచి అందుబాటులో ఉంది. కానీ ఒక గది అంత పరిమాణంలో ఉండే ఖరీదైన యంత్రాల ద్వారా టెస్టులు చేస్తేనే ఇవన్నీ తెలుస్తాయి. రోగులు కూడా గంటల తరబడి ఆస్పత్రుల్లో ఉండాల్సిన అవసరం ఉండదు. ఎవరైనా ప్రవేటు వ్యక్తులు ఆసక్తి ఉంటే కొనుగోలుచేయవచ్చని కెర్నల్‌ సంస్థ సీఈవో జాన్సన్‌ చెబుతున్నారు.  కెర్నెల్‌ కంపెనీ తయారు చేసే హెల్మెట్‌ అందుబాటులోకి వస్తే ఇబ్బందులు ఉండవు. సరికొత్త టెక్నాలజీతో తయారు చేసిన ఈ హెల్మెట్‌ను ఎవరైనా ధరించవచ్చని, దీనిని రూపొంచడానికి ఐదేళ్లు శ్రమించినట్లు బ్రియాన్‌ జాన్సన్‌ తెలిపారు. అయితే హెల్మెట్‌ తయారికీ ఆయన ఇప్పటి వరకు దాదాపు రూ.815 కోట్లు ఖర్చు పెట్టాడట.

హెల్మెట్‌ ఎలా పని చేస్తుంది..?

హెల్మెట్‌ లాంటి పరికరాన్ని వ్యక్తి తలకు అమరుస్తారు. హెల్మెట్‌లోని లేజర్‌ కిరణాలు పుర్రె ద్వారా మెదడులోకి ప్రశేఇస్తాయి. మెదడులో కోట్ల సంఖ్యలో న్యూరాన్లు ఉంటాయి. మనకు ఎలాంటి భావోద్వేగం కలిగినా ఇవి ప్రతిస్పందిస్తాయి. అంతేకాకుండా మన ఆలోచనలన్నింటికి ఇవే మూలం. అందు వల్ల మెదడులోకి ప్రవేశించిన లేజర్‌ కిరణాలు న్యూరాన్ల పని తీరును పసిగట్టి ఆ ప్రక్రియను రికార్డు చేస్తాయి.

ఇవీ కూడా చదవండి:

Satya Nadella: తెలుగుతేజం టెక్‌ నిపుణుడు సత్య నాదెళ్ల మరో ఘనత.. మైక్రోసాఫ్ట్‌ చైర్మన్‌గా బాధ్యతలు

5G Technology: భారత్ లో 5జి టెక్నాలజీ త్వరలో.. దీనితో లక్షల్లో ఉద్యోగావకాశాలు దొరికే ఛాన్స్!