Satya Nadella: తెలుగుతేజం టెక్ నిపుణుడు సత్య నాదెళ్ల మరో ఘనత.. మైక్రోసాఫ్ట్ చైర్మన్‌గా బాధ్యతలు
Satya Nadella: తెలుగుతేజం సత్య నాదేళ్ల మరో ఘనత సాధించారు. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓగా కొనసాగుతున్న ఆయన.. తాజాగా ఆ సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు..
Satya Nadella: తెలుగుతేజం సత్య నాదేళ్ల మరో ఘనత సాధించారు. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓగా కొనసాగుతున్న ఆయన.. తాజాగా ఆ సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత ఛైర్మన్ జాన్ థామ్సన్‌ను స్వతంత్ర డైరెక్టర్‌గా నియమించారు. బోర్డు చైర్మన్ గా సత్య నాదేళ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ సీఈఓగా 2014 నుంచి సత్య నాదేళ్ల కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా, 2014 ఫిబ్రవరిలో స్టీవ్ బాల్‌మెర్ నుంచి బాధ్యతలు స్వీకరించిన సత్య నాదెళ్ల ఎన్నో సేవలు అందించారు. 1975లో స్థాపించిన సంస్థకు కొత్త రూపురేఖలు తీసుకువచ్చిన ఘటన నాదెళ్లకు ఉంది. తన పదవీకాలం ప్రారంభం నుంచి సంస్థను ఎందో అభివృద్ధి చేశారు. మైక్రోసాఫ్ట్ వచ్చే వారం తన విండో ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కొత్త తరాన్ని ఆవిష్కరించనుంది. ఇది ప్రపంచంలోనే డెస్క్‌టాప్ కంప్యూటర్లలో దాదాపు మూడోవంతు కంప్యూటర్లకు శక్తినిస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.
బిల్ గేట్స్ 2014లో ఛైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ఆయన స్థానంలో థామ్సన్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయనను స్వతంత్ర డైరెక్టర్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా మైక్రోసాఫ్ట్ నుంచి గేట్స్ పూర్తిగా తప్పుకుని ఏడాది పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో బోర్డు కార్యవర్గంలో మార్పులు చోటుచేసుకున్నాయి. తన భార్య మిలిండాతో కలిసి ఏర్పాటు చేసిన ‘బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్’ నిర్వహించే ధార్మిక కార్యక్రమాలపై మరింత దృష్టి సారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని బిల్ అప్పట్లో ప్రకటించారు.
సత్యనారాయణ నాదెళ్ల అలియాస్ ‘సత్య నాదెళ్ల ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిన మైక్రోసాఫ్ట్ సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా 2014 ఫిబ్రవరి 4 న నియమితులయ్యారు. సత్య నాదెళ్ల హైదరాబాద్‌కి చెందిన ఒక ప్రవాస భారతీయుడు. మైక్రోసాఫ్ట్ కొత్త సీఈవోగా ఇతను నియమితులయ్యే అవకాశముందని వార్తలు రావడంతో ఇతని పేరు వెలుగులోకి వచ్చింది. అయితే అంతకుముందు ఆయన మైక్రోసాఫ్ట్‌లో క్లౌడ్ అండ్ ఎంటర్‌ప్రైజెస్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. మైక్రోసాఫ్ట్ ప్రస్తుత సీఈవో బామర్ 2015లోగా రిటైర్ కావాలనుకుంటున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఆయన నియామకం అన్వేషణ అనివార్యమైంది. 1976 నుండి సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, స్టీవ్ బాల్మేర్ తర్వాత మూడవ సీఈవోగా సత్య నాదెళ్ల బాధ్యతలు చేపట్టాడు. ఇలాంటి గొప్ప అవకాశం భారతీయులకు, అందులోనూ తెలుగువాళ్లకు లభించడం గర్వించదగిన విషయం.
ఆయనది అనంతపురం జిల్లా, ఎల్లనూరు మండలం, బుక్కాపురం గ్రామం. ఆయన తండ్రి బుక్కాపురం నాదెళ్ల యుగంధర్ 1962 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. రాష్ట్రంలో మంచి అధికారిగా పేరుతెచ్చుకున్నారు. 2004 నుంచి 2009 వరకు ప్రధాని నేతృత్వంలోని కేంద్ర ప్రణాళిక సంఘం సభ్యునిగా, ప్రధానమంత్రి కార్యదర్శిగా పనిచేశారు. నాదెళ్ల యుగంధర్ ఐఏఎస్‌కు ఎంపికైన తర్వాత కుటుంబాన్ని హైదరాబాద్‌కు మార్చారు. 1967లో బీఎన్ యుగంధర్ దంపతులకు హైదరాబాద్‌లో సత్య నాదెళ్ల జన్మించారు. సత్య నాదెళ్ల ప్రాథమిక విద్యాభ్యాసం అంతా హైదరాబాద్‌లోనే కొనసాగింది.