JIO Recharge: యూజ‌ర్ల‌కు మ‌రో స‌దుపాయం తీసుకొచ్చిన జియో.. ఇక‌పై వాట్సాప్ ద్వారా రీఛార్జ్..

JIO Recharge: టెలికాం రంగంలో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకుంది రిల‌య‌న్స్ జియో. అత్యంత త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ మంది యూజ‌ర్ల‌ను త‌న‌వైపు తిప్పుకుందీ దిగ్గ‌జ సంస్థ‌. ఇంట‌ర్‌నెట్ ఛార్జీల‌ను భారీగా త‌గ్గించిన...

JIO Recharge: యూజ‌ర్ల‌కు మ‌రో స‌దుపాయం తీసుకొచ్చిన జియో.. ఇక‌పై వాట్సాప్ ద్వారా రీఛార్జ్..
Jio Recharge With Whatsapp
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 17, 2021 | 6:07 AM

JIO Recharge: టెలికాం రంగంలో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకుంది రిల‌య‌న్స్ జియో. అత్యంత త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ మంది యూజ‌ర్ల‌ను త‌న‌వైపు తిప్పుకుందీ దిగ్గ‌జ సంస్థ‌. ఇంట‌ర్‌నెట్ ఛార్జీల‌ను భారీగా త‌గ్గించిన జియోకు ఎద్ద ఎత్తున యూజ‌ర్లు పెరిగారు. ఎప్ప‌టిక‌ప్పుడు యూజ‌ర్ల అవ‌స‌రాల‌కు అనుగుణంగా కొంగొత్త ఫీచ‌ర్లు తీసుకురావ‌డ‌మే దీనికి ప్ర‌ధాన కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు. ఇదిలా ఉంటే తాజాగా జియో మ‌రో కొత్త ఆప్ష‌న్‌ను తీసుకొచ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు జియో రీఛార్జ్ చేసుకోవాలంటే మై జియో యాప్ లేదా ఇత‌ర పేమెంట్ యాప్‌ల‌ను ఉప‌యోగిస్తుంటాం. అయితే తాజాగా జియో తీసుకొచ్చిన అవ‌కాశంతో వాట్సాప్ ద్వారా కూడా రీఛార్జ్ చేసుకునే స‌దుపాయం క‌ల్పించారు. ఇందుకోసం యూజ‌ర్లు తొలుత‌.. ఫోన్‌లో 7000770007ను సేవ్‌ చేసుకోవాలి. అనంత‌రం వాట్సాప్ నుంచి హాయ్ అని మెసేజ్ చేయాలి. ఇలా చేసిన త‌ర్వాత‌.. రీఛార్జ్ ఆప్ష‌న్‌తో పాటు.. గెట్‌ న్యూ జియో సిమ్‌ ఆర్‌ పోర్ట్‌ ఇన్‌ (ఎంఎన్‌పీ), సపోర్ట్‌ ఫర్‌ జియో సిమ్‌, సపోర్ట్‌ ఫర్‌ జియో ఫైబర్‌, సపోర్ట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ రోమింగ్‌, సపోర్ట్‌ ఫర్‌ జియో మార్ట్ వంటి ఆప్ష‌న్లు క‌నిపిస్తాయి. మీకు న‌చ్చిన ఆప్ష‌న్ ఎంచుకొవ‌చ్చు. రీఛార్జ్ ఆప్ష‌న్‌ను ఎంచుకోగానే.. కంపెనీ అధికారిక సైట్‌లోకి వెళుతుంది. అనంత‌రం అక్క‌డ పేమెంట్ చేస్తే స‌రిపోతుంది. ఈ స‌దుపాయం ప్ర‌స్తుతం ఇంగ్లిష్‌తో పాటు హిందీలో ఉంది. త్వ‌ర‌లోనే దేశంలోని మ‌రిన్ని స్థానిక భాష‌ల్లో ఈ సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.

Also Read: అంతరిక్షం లోకి తొలి సారిగా రేపు ముగ్గురు చైనా వ్యోమగాముల ‘ప్రయాణం’ ! విశేషాలు ఏమిటంటే ..?

Gold Wing Tour Bike:హోండా నుంచి సరికొత్త బైక్‌.. ధర రూ.37.2 లక్షలు.. అదిరిపోయే ఫీచర్స్‌

LPG Gas Subsidy: మీ బ్యాంక్ ఖాతాలోకి ఎల్‌పీజీ సబ్సిడీ డబ్బు రాలేదా.? ఫిర్యాదు చేయండిలా.! వివరాలివే..

గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు