Gold Wing Tour Bike:హోండా నుంచి సరికొత్త బైక్‌.. ధర రూ.37.2 లక్షలు.. అదిరిపోయే ఫీచర్స్‌

Gold Wing Tour Bike: హోండా మోటారు సైకిల్‌ అండ్ స్కూటర్‌ ఇండియా తన సరికొత్త సూపర్‌ బైక్‌ గోల్డ్‌ వింగ్‌ టూర్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. జపాన్‌లోనే పూర్తిగా..

Gold Wing Tour Bike:హోండా నుంచి సరికొత్త బైక్‌.. ధర రూ.37.2 లక్షలు.. అదిరిపోయే ఫీచర్స్‌
Gold Wing Tour
Follow us
Subhash Goud

|

Updated on: Jun 16, 2021 | 9:50 PM

Gold Wing Tour Bike: హోండా మోటారు సైకిల్‌ అండ్ స్కూటర్‌ ఇండియా తన సరికొత్త సూపర్‌ బైక్‌ గోల్డ్‌ వింగ్‌ టూర్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. జపాన్‌లోనే పూర్తిగా తయారై ఇక్కడి మార్కెట్లోకి వస్తోంది. 1833 సీసీ సామర్థ్యం కలిగిన ఈ బైక్‌.. 2021 రెండు వేరియంట్లలో మార్కెట్లోకి వస్తోంది. సెవెన్‌ స్పీడ్‌ డ్యూయల్‌ ట్రాన్స్‌మిషన్‌తో ఎయిర్‌ బ్యాగులతో కూడిన వేరియంట్‌ ధరను రూ.39.16,055 (ఎక్స్‌షో రూమ్‌)గా కంపెనీ నిర్ణయించింది. సిక్స్‌ స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌తో వస్తున్న వేరియంట్‌ ధరను రూ.37,20,324గా పేర్కొంది.

ఈ బైక్‌లో ఎలక్ట్రిక్ట్‌ స్క్రీన్‌, డ్యూయల్‌ ఎల్‌ఈడీ ఫాగ్‌ లైట్స్‌, క్రూయజ్‌ కంట్రోల్‌, ఏడు అంగుళాల కలర్‌ టీఎఫ్‌టీ లిక్విడ్‌ క్రిస్టల్‌డిస్‌ప్లే, స్పీకర్లు, హిల్‌స్టార్ట్‌తో పాటు మరెన్నో సదుపాయాలు ఉన్నాయి. యూపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటోకు ఇది సపోర్ట్‌ చేస్తుంది. అలాగే స్మార్ట్‌ఫోన్‌లోని ఫోన్‌ నెంబర్లు, మ్యూజిక్‌ ప్లే లిస్ట్‌ను యాక్సెస్‌ చేయవచ్చు. బ్లూటూత్‌ కనెక్టివిటితో పాటు రెండు యూఎస్‌బీ టైప్‌ సి-పోర్టులు ఉన్నాయనిక కంపెనీ సీఈవోఅత్సషి ఒగాటా తెలిపారు.

ఇవీ కూడా చదవండి

Xiaomi Mi Watch: కొత్త స్మార్ట్‌ వాచ్‌ను విడుదల చేయనున్న ఎంఐ.. అత్యాధునిక ఫీచర్లు.. పూర్తి వివరాలు

Gold Prices: శుభవార్త.. బంగారం కొనేవారికి ఊరట.. నెల కనిష్టానికి పసిడి ధరలు.. హాల్‌ మార్క్‌ రూల్స్‌ అమల్లోకి..!

Online Jewelry: మీరు ఆన్‌లైన్‌లో నగలు కొంటున్నారా..? అయితే వీటిని గుర్తించుకోవడం మంచిది.. లేకపోతే మోసమే..!