Online Jewelry: మీరు ఆన్‌లైన్‌లో నగలు కొంటున్నారా..? అయితే వీటిని గుర్తించుకోవడం మంచిది.. లేకపోతే మోసమే..!

Online Jewelry: ప్రముఖ నగల వ్యాపారులందరూ ఆన్‌లైన్‌లో బంగారు నగలను అమ్ముతున్నారు. ఆ నగలను చూస్తే వెంటనే కొనేయాలని అనిపించేంతగా ఉంటాయి. మీకు బంగారు..

Online Jewelry: మీరు ఆన్‌లైన్‌లో నగలు కొంటున్నారా..? అయితే వీటిని గుర్తించుకోవడం మంచిది.. లేకపోతే మోసమే..!
Jewelry Online Order
Follow us

|

Updated on: Jun 16, 2021 | 8:14 PM

Online Jewelry: ప్రముఖ నగల వ్యాపారులందరూ ఆన్‌లైన్‌లో బంగారు నగలను అమ్ముతున్నారు. ఆ నగలను చూస్తే వెంటనే కొనేయాలని అనిపించేంతగా ఉంటాయి. మీకు బంగారు నగలు, క్వాలిటీ, హాల్‌మార్క్ లాంటివాటిపై పూర్తిగా అవగాహన ఉందా? అయితే మీరు ఏమాత్రం ఆలోచించకుండా ఆన్‌లైన్‌లో నగలు కొనుగోలు చేయవచ్చు. ఆన్‌లైన్‌లో నగలు ఆర్డర్‌ చేసే ముందు ఓసారి వివరాలన్నీ చెక్‌ చేసుకోవడం మంచిది. ఆ వివరాలను స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోవాలి. ఫోటో చూసి ఆర్డర్ చేయకుండా డిస్క్రిప్షన్‌లోని వివరాలన్నీ పూర్తిగా చదవకుండా ఆర్డర్‌ చేయవద్దు. నగల క్వాలిటీ హాల్‌మార్క్‌, మేకింగ్ ఛార్జీల వివరాలు తప్పకుండా తెలుసుకోవాలి. నగలు డెలివరీ అయిన తర్వాత అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. నగలను ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేయాలనుకుంటే చాలా రకాల వెరైటీలు ఉంటాయి. షాపులో అయితే కొన్ని డిజైన్లు మాత్రమే చూపిస్తారు. కానీ ఆన్‌లైన్‌లో బోలడన్నీ డిజైన్‌లు ఉంటాయి. వాటిలో మీకు నచ్చినది సెలెక్ట్ చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో నగలు ఆర్డర్ చేసేముందు రిటర్న్, రీప్లేస్ ఆప్షన్స్ ఉన్నాయో లేదో అనే విషయాన్ని ముందగానే చెక్‌ చేసుకోవాలి. రిటర్న్, రీప్లేస్ పాలసీ నియమని బంధనలు పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలి. మీకు ఒకవేళ నగలు నచ్చకపోతే వెనక్కి పంపే అవకాశం ఉన్న నగల్ని మాత్రమే ఎంపిక చేసుకోవడం బెటర్‌. అయితే షాపులో అయితే మీరు నగలను స్వయంగా పరిశీలించే అవకాశం ఉంటుంది. కానీ ఆన్‌లైన్‌లో అయితే అలాంటి అవకాశం ఉండదు. ఫోటోలను మాత్రమే చూసి ఆర్డర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే నగల ఆర్డర్‌ చేసిన తర్వాత నచ్చకపోతే ఏ మాత్రం ఆలోచించకుండా రిటర్న్‌ పెట్టుకోవాలి. డిస్కౌంట్స్, ఆఫర్స్ వివరాలు కూడా చెక్ చేయాలి. నగల షాపులన్నీ ఆఫర్స్ అందిస్తాయి. ముఖ్యంగా ధంతేరాస్, అక్షయ తృతీయ లాంటి సందర్భాల్లో ఈ ఆఫర్లు ఎక్కువగా ఉంటాయి. ఆన్‌లైన్‌లో నగలు కొనడానికి ఏ వెబ్‌సైట్ కనిపిస్తే ఆ వెబ్‌సైట్ ఓపెన్ చేయకూడదు. కొన్ని నకిలీవి కూడా ఉంటాయి. ఆవేమి గుర్తించకుండా ఆర్డర్‌ చేస్తే మోసపోవాల్సి ఉంటుంది. మంచి పేరున్న వెబ్‌సైట్ల నుంచి మాత్రమే చేసుకోవాలి. ప్రముఖ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి సంస్థలు కూడా ఆన్‌లైన్‌లో నగలను అమ్ముతున్నాయి. సెల్లర్స్ వివరాలు తెలుసుకోవాలి. రేటింగ్ చూడాలి.

ఇవీ కూడా చదవండి:

Xiaomi Mi Watch: కొత్త స్మార్ట్‌ వాచ్‌ను విడుదల చేయనున్న ఎంఐ.. అత్యాధునిక ఫీచర్లు.. పూర్తి వివరాలు

Jan Dhan Yojana: మీకు జన్‌ధన్‌ ఖాతా ఉందా..? రూ.2 లక్షల వరకు ఉచిత బీమా సౌకర్యం.. క్లెయిమ్‌ చేసుకోవడం ఎలా..?