Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPG Gas Subsidy: మీ బ్యాంక్ ఖాతాలోకి ఎల్‌పీజీ సబ్సిడీ డబ్బు రాలేదా.? ఫిర్యాదు చేయండిలా.! వివరాలివే..

ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లపై కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సబ్సిడీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. ప్రతీ ఒక్కరూ కూడా ఏడాదికి 12 సిలిండర్లు సబ్సిడీలో..

LPG Gas Subsidy: మీ బ్యాంక్ ఖాతాలోకి ఎల్‌పీజీ సబ్సిడీ డబ్బు రాలేదా.? ఫిర్యాదు చేయండిలా.! వివరాలివే..
Lpg
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 16, 2021 | 8:48 PM

ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లపై కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సబ్సిడీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. ప్రతీ ఒక్కరూ కూడా ఏడాదికి 12 సిలిండర్లు సబ్సిడీలో పొందొచ్చు. మొదట సిలిండర్‌కు పూర్తి డబ్బును చెల్లించిన తర్వాత.. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ స్కీం కింద సబ్సిడీ మొత్తాన్ని సరాసరి కస్టమర్ ఖాతాలోకి ప్రభుత్వం జమ చేస్తూ వస్తోంది. ఈ పధకం 2015లో ప్రారంభమైన విషయం విదితమే. మరి ఆ సబ్సిడీ డబ్బు బ్యాంకు ఖాతాల్లోకి పడకపోతే.. లబ్దిదారుడు ఎక్కడ ఫిర్యాదు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

LPG Subsidy డబ్బు మీ బ్యాంక్ ఖాతాలో జమ కానట్లయితే.. మీరు ఎల్‌పీజీ గ్యాస్ ప్రొవైడర్ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అంతేకాకుండా టోల్ ఫ్రీ నంబర్ 18002333555కు కాల్ చేసి ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చు. అయితే ఇలా చేయాలంటే ముందుగా మీ బ్యాంక్ ఖాతాలోకి సబ్సిడీ మొత్తం వస్తోందో లేదోనన్న విషయాన్ని తెలుసుకోవాలి. అందుకోసం ఈ కింద స్టెప్స్ ఫాలో అవ్వండి..

  • మొదటిగా www.mylpg.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
  • అక్కడ మీరు కుడివైపున గ్యాస్ సిలిండర్ల (భారత్, హెచ్‌పీ, ఇందేన్) చిత్రాలను చూస్తారు. అందులో మీ సిలిండర్ కంపెనీపై క్లిక్ చేయండి.
  • అప్పుడు మీకో విండో ఓపెన్ అవుతుంది
  • అక్కడ టాప్ రైట్ కార్నర్‌లో సైన్-ఇన్, న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అనే రెండు ఎంపికలు ఉంటాయి.
  • ఐడీ ఉంటే సైన్-ఇన్.. లేకపోతే రిజిస్టర్ అవ్వండి
  • లాగిన్ అయిన తర్వాత View Cylinder Booking History ఆప్షన్‌ను ఎంపిక చేయండి.
  • తద్వారా మీ సబ్సిడీ మొత్తాన్ని పరిశీలించండి.
  • గ్యాస్ సబ్సిడీ రాకపోతే Feedback Here ఆప్షన్ నొక్కి ఫిర్యాదు చేయండి.
  • టోల్ ఫ్రీ నంబర్ 18002333555కు కాల్ చేసి కూడా ఫిర్యాదు చేయవచ్చు.
  • సబ్సిడీ రాకపోవడానికి ఆధార్ లింకింగ్ (ఎల్‌పిజి ఆధార్ లింకింగ్) కూడా కారణం కావచ్చు.
  • అందుచేత వెంటనే మీ డిస్ట్రిబ్యూటర్‌ దగ్గరకు వెళ్లి ఆధార్‌ను లింక్ చేసుకోండి.

Also Read:

ఉదయాన్నే టిఫిన్ తిని స్నానం చేస్తున్నారా? అయితే జాగ్రత్త! ఈ విషయాలు తెలుసుకోండి

 కారు ఇంజిన్ నుంచి వింత శబ్దాలు.. బోనెట్ తెరిచి చూడగా ఫ్యూజులు ఔట్.!

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమిండియా జట్టు ఇదే.. ఆ ప్లేయర్‌కు మరోసారి నిరాశ.. కోహ్లీపై విమర్శలు.!

అత్తింటి మర్యాదా మజాకా.. కొత్త కోడలికి మెట్టు మెట్టుకో గిఫ్ట్‌.. వైరల్ అవుతున్న వీడియో..