Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rythu Bandhu: తెలంగాణ రైతుల ఖాతాల్లోకి అమౌంట్.. ‘రైతు బంధు’ డబ్బు వచ్చిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలంటే..

TS Rythu Bandhu: తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రైతు బంధు పథకం కింద రాష్ట్రంలోని రైతులకు ఎకరానికి రూ.5000 పెట్టుబడి

Rythu Bandhu: తెలంగాణ రైతుల ఖాతాల్లోకి అమౌంట్.. 'రైతు బంధు' డబ్బు వచ్చిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలంటే..
Rythu Bandhu
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 16, 2021 | 6:38 PM

TS Rythu Bandhu: తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రైతు బంధు పథకం కింద రాష్ట్రంలోని రైతులకు ఎకరానికి రూ.5000 పెట్టుబడి మద్ధతును వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లుగా తెలంగాణ వ్యవసాయ శాఖ తెలిపింది. గతేడాది కరోనా కారణంగా తగినంత ఆదాయాన్ని అందించలేకపోయామని.. దీంతో రైతుల సాగులోకి కావాల్సిన పెట్టుబడులను వీలైనంత త్వరగా.. జమ చేయాలని ఆర్థిక మంత్రి టి.హరీష్ రావు మంగళవారం అన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. నల్గోండాలో ఎక్కువ మంది రైతులు (4,72,983) ఉండగా.. మేడ్చల్-మల్కాజ్‏గిరి జిల్లాలో అత్యల్పంగా (39,762) రైతులు ఉన్నారు. ఈ ఏడాది సుమారు 63.25 లక్షల మంది రైతులను(150.18లక్షల ఎకరాలకు) రైతుబంధు పథకానికి అర్హులుగా గుర్తించినట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. వీరందరికీ రైతుబంధు సాయాన్ని అందించేందుకు రూ. 7508.78 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని జూన్ 25 వరకు రైతుల బ్యాంకుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు.

ఆన్‏లైన్‎లో రైతు బంధు పథకాన్ని ఎలా చెక్ చేసుకోవాలంటే..

1. ముందుగా https://treasury.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. 2. ఆ తర్వాత రైతు బంధు స్కీమ్ రబీ వివరాలు ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోవాలి. 3. ఆ తర్వాత సంవత్సరం, రకం, పీపీబీ నంబర్ సెలక్ట్ చేసుకోవాలి. 4. అనంతరం సబ్మిట్ ఆప్షన్ ఎంచుకోవాలి. విండో పై మీకు స్టేటస్ ఆప్షన్ కనిపిస్తుంది. 5. ఆ తర్వాత డ్రాప్ డౌన్ జాబితాలో స్కీమ్ వైస్ రిపోర్ట్ పై క్లిక్ చేయండి. 6. ఆ తర్వాత మీ పూర్తి వివరాలను ఎంటర్ చేయాలి. 7. అనంతరం మీ సంవత్సరాన్ని ఎంచుకోవాలి. 8. మీ పీపీబీ నంబర్ ఎంటర్ చేయాలి. 9. అనంతరం సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Also Read: Backpain Relief Tips: వెన్నునొప్పితో ఇబ్బంది పడేవారు ఈ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలట.. సూచిస్తున్న నిపుణులు..

Credit Incentives: ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంచడానికి 50 వేల కోట్ల రుణ ప్రోత్సాహకాలు ఇచ్చే దిశలో మోడీ ప్రభుత్వం