AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Backpain Relief Tips: వెన్నునొప్పితో ఇబ్బంది పడేవారు ఈ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలట.. సూచిస్తున్న నిపుణులు..

ప్రస్తుత ఆధునిక కాలంలో ఉద్యోగాలు చేసే వారిలో వెన్ను నొప్పి సమస్య అధికంగా ఉంటోంది. గంటల తరబడి ఒకేచోట కూర్చోవడం..

Backpain Relief Tips: వెన్నునొప్పితో ఇబ్బంది పడేవారు ఈ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలట.. సూచిస్తున్న నిపుణులు..
Pack Pain Relief Tips
Rajitha Chanti
|

Updated on: Jun 16, 2021 | 6:08 PM

Share

ప్రస్తుత ఆధునిక కాలంలో ఉద్యోగాలు చేసే వారిలో వెన్ను నొప్పి సమస్య అధికంగా ఉంటోంది. గంటల తరబడి ఒకేచోట కూర్చోవడం.. సరైన పద్దతిలో కూర్చోకపోవడం వలన వెన్నునొప్పి అధికంగా వేధిస్తుంది. దీనిని తగ్గించుకోవడానికి అనేక రకాల మందులను ఉపయోగిస్తుంటారు. ఈ నొప్పి రోజులు కాదు.. సంవత్సరాల తరబడి బాధిస్తుంటుంది. ఇటీవల యునైటెడ్ స్టేట్స్ కు చెందిన వైద్యులు ఆహారం వెన్ను నొప్పిని తగ్గిస్తుందని తెలిపారు. మన భారతీయ వంటకాలలో ఉపయోగించే అనేక రకాల ఆహార పదార్థాలు వెన్నునొప్పిని తగ్గించడంలో సహాయపడతాయట. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్యూనా చేపలో అనేక రకాల ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది డిటాక్సిఫైయర్ గా పనిచేస్తుంది. అలాగే శరీరంలోని ఇతర నొప్పి, మంటను తగ్గిస్తుంది.

సాల్మాన్ చేప.. ఇందులో కూడా అనేక రకాల పోషక విటమిన్లు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఒమేగా 3 ఉండడం వలన నొప్పి, మంటను తగ్గిస్తాయి. దీనికి కొద్దిగా మిరియాల పొడి కలిపి తీసుకోవడం మంచిది.

క్యారెట్లు.. ఇది శరీరానికి మేలు చేసే అత్యంత పోషకాహారం. ఇది వెన్ను నొప్పిని తగ్గించడమే కాకుండా.. అనేక రకాల అనారోగ్య సమస్యలను నివారిస్తుంది. ఇందులో విటమిన్లు, పోషకాలు ఎక్కువగా ఉండడం వలన రోజూవారీ డైట్ లో తీసుకోవడం మేలు.

స్వీట్ పోటాటో.. అంటే చిలగడదుంపలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వెన్ను నొప్పిని క్రమంగా తగ్గించడమే కాకుండా.. ఇతర సమస్యలను తొలగిస్తాయి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

నట్స్.. ఇవి రక్తప్రసరణను మెరుగుపరిచి.. గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఇందులో మంచి కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. బాదం, జీడిపప్పు ప్రతి రోజూ తీసుకోవడం వలన వెన్ను నొప్పి తగ్గుతుంది.

గ్రీన్ టీ.. ఇది కేవలం బరువు తగ్గేందుకు మాత్రమే పనిచేస్తుంది అనుకుంటారు. కానీ దీంతో చాలా ప్రయజనాలున్నాయని ఎవరికి తెలియదు. గ్రీన్ టీ కూడా వెన్ను నొప్పిని తగ్గించడంలో సహయపడుతుందని అనేక అధ్యాయనాల్లో తేలింది.

Also Read: Chandrashekar: సినీ పరిశ్రమలో మరో విషాదం.. ‘రామాయణ్’ ఫేమ్ చంద్రశేఖర్ కన్నుమూత..

Monsoon Recipes: వర్షాకాలంలో ఈ బెస్ట్ స్నాక్స్ సులభంగా ఇంట్లోనే చేసుకోని ఎంజాయ్ చేయండి..

Follow Us
747 కోట్లతో తీస్తే అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా
747 కోట్లతో తీస్తే అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
ఒక్క ఆకుతో తెల్ల జుట్టు నల్లగా.. ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే..
ఒక్క ఆకుతో తెల్ల జుట్టు నల్లగా.. ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే..
వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేస్తే కలిగే నష్టాలు..
వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేస్తే కలిగే నష్టాలు..
మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా?టేస్టీ దోశలుగా మార్చేసుకోండి
మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా?టేస్టీ దోశలుగా మార్చేసుకోండి