Chandrashekar: సినీ పరిశ్రమలో మరో విషాదం.. ‘రామాయణ్’ ఫేమ్ చంద్రశేఖర్ కన్నుమూత..
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ఈ ఏడాది చిత్రసీమలో ఎంతోమంది నటీనటులు అనారోగ్య సమస్యలతో.. కరోనాతో మరణించారు.
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ఈ ఏడాది చిత్రసీమలో ఎంతోమంది నటీనటులు అనారోగ్య సమస్యలతో.. కరోనాతో మరణించారు. ప్రముఖ నటుడు రామాయణ్ సీరియల్ ఫేమ్ చంద్రశేఖర్ (98) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా వయోభారంతో బాధపడుతున్న ఆయన బుధవారం ముంభైలోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు.. ఈ విషయాన్ని ఆయన కుమారుడు నిర్మాత అశోక్ శేఖర్ ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
“నాన్నగారు నిద్రలోనే కన్నుమూశారు. ఆయనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. వయసు మీద పడటంతోనే చనిపోయారు” అంటూ ట్వీట్ చేశారు. జుహులోని పవన్ హాన్స్ లో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. హైదరాబాద్‌కు చెందిన చంద్రశేఖర్ నటనపై ఉన్న ఆసక్తితో 1950లో జూనియర్ ఆర్టిస్టుగా మారారు. ఆ తర్వాత సురంగ్ అనే చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. ‘కవి’, ‘మస్తానా’, ‘బసంత్ బహార్’, ‘కాలీ టోపీ లాల్ రుమాల్’, ‘గేట్ ఆఫ్ ఇండియా’, ‘ఫ్యాషన్’, ‘ధర్మ’, ‘డ్యాన్స్ డ్యాన్స్’, ‘లవ్ లవ్ లవ్’ తదితర సినిమాల్లో నటించారు. చంద్రశేఖర్ దాదాపు 250కి పైగా సినిమాల్లో నటించారు. 1964లో స్వీయ నిర్మాణంలో ‘ఛ ఛ ఛ’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. 1966లో ‘స్ట్రీట్ సింగర్’ అనే సినిమాని తెరకెక్కించారు. 70ల్లో ‘పరిచయ్’, ‘కౌశిష్’, ‘ఖుష్బూ’, ‘మౌసమ్’ తదితర సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ పనిచేశారు. రామానంద్ సాగర్ దర్శకత్వంలో రూపొందిన ‘రామాయణ్ సీరియల్‌తో (డీడీ ఛానల్) మరింత గుర్తింపు పొందారు. ఇందులో ఆర్య సుమంత్ అనే పాత్ర పోషించారు.
RadheShyam Movie: ‘రాధేశ్యామ్’ మూవీతో ప్రభాస్ మరో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నాడా ?