Karthika Deepam: మోనిత నాకు అప్పుడు, ఇప్పుడు నచ్చలేదన్న శౌర్య… నాకు న్యాయం చేయండి అంటూ సౌందర్య కాళ్ళు పట్టుకున్న మోనిత

Karthika Deepam: రోజుకో ట్విస్ట్ తో ఆసక్తికరంగా సాగుతున్న కార్తీక్ దీపం సీరియల్ ఈరోజు (జూన్ 16) 1067వ ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. దీప పిల్లల్ని కావాలనుకుంటున్న కార్తీక్ .. మోనిత చేతికి చిక్కాడు...

Karthika Deepam: మోనిత నాకు అప్పుడు, ఇప్పుడు నచ్చలేదన్న శౌర్య... నాకు న్యాయం చేయండి అంటూ సౌందర్య కాళ్ళు పట్టుకున్న మోనిత
Karthika Deepam
Surya Kala

|

Jun 16, 2021 | 11:35 AM

Karthika Deepam: రోజుకో ట్విస్ట్ తో ఆసక్తికరంగా సాగుతున్న కార్తీక్ దీపం సీరియల్ ఈరోజు (జూన్ 16) 1067వ ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. దీప పిల్లల్ని కావాలనుకుంటున్న కార్తీక్ .. మోనిత చేతికి చిక్కాడు. ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్ చూద్దాం..!

నువ్వు ఎవరో తెలియనప్పుడే నువ్వు నచ్చావు.. అప్పుడు నీతోపాటు మోనిత ఆంటీ వచ్చింది. నాకు ఎందుకో మోనిత ఆంటీ అప్పుడు నచ్చలేదు.. ఇప్పుడు కూడా నచ్చదు… సారీ నాన్న నీ ఫ్రెండ్ ను ఇలా అన్నందుకు కోపం వచ్చిందా అంటుంది. శౌర్య. మాట మారుస్తూ.. టేబుల్ చైర్స్ తెమ్మని వారణాసికి చెప్పను అంటాడు అవి ఎక్కడ వేయాలని హిమ, శౌర్య ఆలోచిస్తారు.. ఇదంతా దీప మౌనంగా చూస్తూనే ఉంటుంది..

సౌందర్య శ్రావ్య తో మాట్లాడుతూ.. మీ నాన్న ఎలా ఉన్నారు.. ఆరోగ్యం బాగానే ఉంది. కానీ మనసు బాగోలేదు అంటూ ఫుల్ గా తాగుతున్నారట.. అయన ఏమైపోతారో అని మా అమ్మ దిగులుపడుతుంది అంటుంది శ్రావ్య.. మీ నాన్న, దీప కష్టాలు ఎప్పుడు తీరతాయో.. అంటూనే ఇద్దరు పిల్లలను సంస్కరవంతులుగా పెంచాను. ఇప్పుడు కార్తీక్ చేసిన పనికి రేపు ఎలా తలెత్తుకోవాలి అంటుంటే.. మోనిత అడుగు పెడుతుంది. నమస్కారం ఆంటీ అంటుంది. బావగారు పైన ఉన్నారా.. ఎక్కడ ఉన్నారు.. అంటుంటే బయటకు వెళ్లారు.. అవునా అంటూనే మోనిత మీ అక్క కనిపించడం లేదు అంటూ ఆరా తీస్తుంది. కోపంగా చూడకు శ్రావ్య.. మీ వచ్చానని నీకు కోపంగానే ఉంటుంది. ఆంటీ ఐతే నన్ను సరిగ్గా అర్ధం చేసుకుంటారు.. పెద్ద వారు మంచి చేదు తెలిసిన వారు మంచి మనసున్నవారు.. న్యాయం కోసం ధర్మం కోసం కన్న కొడుకునీ కూడా కాదని కోడలి కోసం నిలబడ్డారు. అంటూ సౌందర్య కాలి దగ్గర కూర్చుని దీప కు సపోర్ట్ చేసిన మీరంటే అభిమానం ఆంటీ.. నేను కూడా దీప లాంటి ఆడపిల్లనే అంటుంది మోనిత. మీ అబ్బాయి వల్ల అన్యాయం అయిపోయిన దానినే.. పెద్ద మనసు చేసుకుని నాకు న్యాయం చేయండి.. మీ అబ్బాయి నన్ను చేస్తున్నాడు.. ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నాడు. ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు. ఇది వరకు ఐతే అంత బాధపడే దానిని కాదు.. ఇప్పుడు అలా కాదు.. బిడ్డలను కన్న తల్లిగా బాధ మీకు తెలుసు అంటూనే .. శ్రావ్య నువ్వు కూడా ఒక బిడ్డను కన్నావు.. ఆదిత్య నిన్ను పట్టించుకోక పొతే ఎలా ఉంటుంది చెప్పు అంటుంది.. కార్తీక్ వస్తే నేను వచ్చి వెళ్లాలని చెప్పు.. అని కన్నీరు పెట్టుకుంటుంది మోనిత.

మురళీ కృష్ణ తాగుతూ.. మోనిత చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడుతుంటే భాగ్యం వచ్చి.. ఏమిటి అడుగుతుంది. దీపకి న్యాయం చేస్తారా.. అన్యాయం చేస్తా అనేది కార్తీక్ కు తెలియాలి అంటాడు.. ఏ ప్రయత్నం చేయకుండా ఇలా మందు తాగుతూ కూర్చుంటే.. బాధ తీరుతుందా అని భాగ్య ప్రశ్నిస్తుంది. అల్లుడుగారు చెప్పుడు మాటలు వినే రకం.. మోనిత చెప్పిన మాటలు విని ఇంతవరకూ తెచ్చుకున్నారు.. ఆస్థి దీప పిల్ల మీద రాయమని సౌందర్యకు చెప్పు అంటుంది.

కార్తీక్ కు వారణాసి ఫోన్ చేస్తే.. పిల్లలకు ఏమి కావాలన్నా కోనివ్వు అంటాడు. ఎవరు నన్ను నమ్మక పోయినా పర్వాలేదు.. దీప నన్ను నమ్మితే చాలు.. ప్రేమగా డాక్టర్ బాబు ని పిలిస్తే చాలు.. అపార్ధాలు తొలిగి ఆనందంగా ఉంటామనుకునే సమయంలో అని ఆలోచిస్తుండగా మోనిత అడుగు పెడుతుంది. బాగున్నావా దీప ఆరోగ్యం ఎలా ఉంది. ఇద్దరి ముఖంలో ఆనందం కనిపించడం లేదు.. ఎలా కనిపిస్తుంది నాకు ఇలా జరగకూండా ఉంటె అందరూ పండగ చేసుకునేవారు.. దీప ఆ ఇంటి పెద్దకోడలి స్థానంలో పెత్తనం చేస్తుండేదానివి.. నేను అప్పుడప్పుడు వస్తూ.. మీ అత్తతో చివాట్లు.. నీతో అగచాట్లు పడుతుండేదానిని.. కార్తీక్ నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు.. పిల్లలు లేరా అని ఇప్పుడే మాట్లాడుకుందాం.. నా ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు.. నేను అంత అలసయ్యనా.. దీప నువ్వు పదేళ్లు అనుభవించావు.. నా బాధ నీకే అర్ధం అవుతుంది. అది దృష్టిలో పెట్టుకుని నా తరపున ఆలోచించు.. ఇప్పుడే మీ అత్తగారి దగ్గరకు వెళ్లి వచ్చా.. నాకు న్యాయం చేయమని బతిమాలాను.. ఈ కొట్లాటలు పగలు ప్రతీకారాలు మానేసి పాజిటివ్ గా ఆలోచిద్దాం ఏమంటారు. అంటుంది మోనిత

నా వైపు చూడు కార్తీక్ నన్ను పట్టించుకో కార్తీక్… నీ వలన నెల తప్పిన ఓ కన్నెపిల్ల నిలబడి ఉంది అంటుంది.. నేను దీపను కాను 10 ఏళ్ళు ఎదురుచూడడానికి నేను మోనిత ను పడే రోజులు టైం ఇస్తున్న… నాకు న్యాయం చేయాలి.. లేదంటే నీ ఇంటి పరువు తీస్తాను రచ్చ చేస్తాను అంటూ వార్నింగ్ ఇస్తుంది. మరి కార్తీక్ రియాక్షన్ ఏమిటి రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

Also Read: శ్వాసకోస ఇబ్బందులను తొలగించుకోవడానికి వేయాల్సిన యోగాసనం ఏమిటంటే.. వేలంలో ఈ మొక్కను రూ. 14లక్షలకు దక్కించుకున్న ఓ వ్యక్తి.. అత్యంత ఖరీదైన మొక్కగా ఖ్యాతి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu