Purvottanasana: శ్వాసకోస ఇబ్బందులను తొలగించుకోవడానికి వేయాల్సిన యోగాసనం ఏమిటంటే

Surya Kala

Surya Kala |

Updated on: Jun 16, 2021 | 10:20 AM

Purvottanasana: రోజూ యోగా చేయడం వలన శరీరానికి కొత్త శక్తి వస్తుంది. అంతేకాదు అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయి. వ్యాధులతో పోరాడటానికి ఈ యోగా..

Purvottanasana: శ్వాసకోస ఇబ్బందులను తొలగించుకోవడానికి వేయాల్సిన యోగాసనం ఏమిటంటే
Purvottanasana

Follow us on

Purvottanasana: రోజూ యోగా చేయడం వలన శరీరానికి కొత్త శక్తి వస్తుంది. అంతేకాదు అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయి. వ్యాధులతో పోరాడటానికి ఈ యోగా.. వ్యాయామ రూపంలో పురాతన కాలం నుంచే భారతదేశంలో ప్రారంభమైనది. ఈ యోగా శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచి, శరీరం ఫిట్ గా ఉండటానికి బాగా సహాయపడుతుంది. అయితే ఒకొక్క యోగాసనం ఒకొక్క ప్రాధాన్యతను కలిగి ఉండి ఆరోగ్య ప్రయోజనాన్ని ఇస్తుంది. యోగాతో ఒత్తిడిని అధిగమించి ప్రశాంతంగా జీవనం సాగించడంతో పాటు, ప్రస్తుతం కరోనా వల్ల వాటిల్లుతున్న శ్వాసకోశ సంబంధ ఇబ్బందులను కూడా తొలగించుకోవచ్చని సూచిస్తున్నారు. ఈరోజు ఆరోగ్యకరమైన ఊపిరితిత్తుల కోసం చేయు యోగాసనం గురించి తెలుసుకుందాం..!

పూర్వోత్తానాసనం:

ముందుగా దండాసనంలో కూర్చోవాలి. రెండుకాళ్లను ముందుకు చాచి రెండు చేతులూ శరీరానికి ఇరుపక్కలా ఉంచుకోవాలి. నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ నడుము భాగాన్ని పైకి లేపాలి. చేతులు నడుముకు ఆరు సెంటీమీటర్ల వెనక వైపునకు ఉంచాలి. అరచేతులు భుజాల కిందుగా ఉండేట్లు చూడాలి. పాదాలు సమాంతరంగా ఉండాలి. కాలి వేళ్లు భూమిని తాకేట్లుగా ప్రయత్నించాలి.

ఉపయోగాలు :

పశ్చిమోత్తానాసనంలో వెన్నెముకను ముందుకు వంచుతాం. దానికి వ్యతిరేకంగా వెన్నెముకను ఈ ఆసనంలో స్ట్రెచ్ చేస్తాం. ఊపిరితిత్తులు, గుండెకు మంచి ఆరోగ్యకరమైన ఆసనం. చేతులు, పాదాలు ధృడంగా మారుతాయి.

Also Read: :అక్కడ ఆలయంలో రోజూ ప్రసాదం తినడానికి వచ్చే నక్కలు.. వింత చూడడనికి భారీగా భక్తులు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu