Nagarjuna: మాజీ రా ఏజెంట్ ఆఫీసర్‏గా నాగార్జున.. ఇజ్రాయెల్ యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకుంటున్న కింగ్ ?

Nagarjuna New Movie: కింగ్ నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల వైల్డ్ డాగ్ సినిమాతో

Nagarjuna: మాజీ రా ఏజెంట్ ఆఫీసర్‏గా నాగార్జున.. ఇజ్రాయెల్ యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకుంటున్న కింగ్ ?
Nagarjuna
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 16, 2021 | 5:00 PM

Nagarjuna New Movie: కింగ్ నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాగ్. కోవిడ్ కారణంగా కొన్ని వారాల్లోనే థియేటర్ రన్ కంప్లీట్ చేసుకున్న నాగ్ మూవీ వైల్డ్ డాగ్.. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో సత్తా చాటింది. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో… రా అండ్ రస్టిక్ యాక్షన్ తో NIA ఆఫీసర్ రోల్ లో కొత్తగా కనిపించి ఫిదా చేసాడు నాగ్.  ఈ సినిమా తర్వాత వెంటనే ప్రవీణ్ సత్తారు సినిమాను స్టార్ట్ చేసాడు. యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అయితే కరోనా కారణంగా రెండో షెడ్యూల్ వాయిదా పడింది.

కరోనా పరిస్థితులు తగ్గిన తర్వాత ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా.. నాగార్జునపై కీలక యాక్షన్ ఘట్టాలు తెరకెక్కించనున్నట్లుగా సమాచారం. ఇందుకోసం నాక్ ప్రత్యేకంగా సిద్ధమవుతున్నారట. ఈ నేపథ్యంలోనే ఆయన క్రావ్ మాగా, సమురై స్వొర్డ్ అనే ఇజ్రాయెల్ యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకుంటున్నట్లుగా ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. ఇందులో నాగ్ ఓ మాజీ రా ఏజెంట్ అధికారిగా కనిపించనున్నారట. జూలై నుంచి చిత్రీకరణ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్.

Also Read: Ration Card Download: రేషన్ కార్డును తీసుకోవాలని అనుకుంటున్నారా.. ఈ విధంగా మీరు రెండు నిమిషాల్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

Corona Testing: కేవలం 15 నిమిషాల్లోనే గదిలో కరోనాను గుర్తించే కొత్త పరికరాన్ని కనుగొన్న బ్రిటిష్ శాస్త్రవేత్తలు

Sarkaru Vari Paata Movie: మహేష్ ఫ్యాన్స్‏కు తమన్ హామీ.. ‘సర్కారు వారి పాట’ మూవీలో సాంగ్స్ అలా ఉండనున్నాయంటూ..

Andrea Jeremiah: కెరీర్‏లోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకోనున్న ఆండ్రియా… ‘పిశాసు-2’ సినిమాలో సీన్ కోసం రిస్క్ చేసిన హీరోయిన్..