Corona Testing: కేవలం 15 నిమిషాల్లోనే గదిలో కరోనాను గుర్తించే కొత్త పరికరాన్ని కనుగొన్న బ్రిటిష్ శాస్త్రవేత్తలు

Corona Testing: కరోనాను గుర్తించే విధానంలో సరికొత్త విజయాన్ని బ్రిటిష్ శాస్త్రవేత్తలు సాధించారు. గదిలో ఉన్న వ్యక్తులలో ఎవరికైనా కరోనా ఉంటె కనుక ఈ పరికరం కేవలం 15 నిమిషాల్లో గుర్తిస్తుంది.

Corona Testing: కేవలం 15 నిమిషాల్లోనే గదిలో కరోనాను గుర్తించే కొత్త పరికరాన్ని కనుగొన్న బ్రిటిష్ శాస్త్రవేత్తలు
Corona Testing
KVD Varma

|

Jun 16, 2021 | 4:19 PM

Corona Testing: కరోనాను గుర్తించే విధానంలో సరికొత్త విజయాన్ని బ్రిటిష్ శాస్త్రవేత్తలు సాధించారు. గదిలో ఉన్న వ్యక్తులలో ఎవరికైనా కరోనా ఉంటె కనుక ఈ పరికరం కేవలం 15 నిమిషాల్లో గుర్తిస్తుంది. అదే పెద్ద గదిలో అయితే దీనికి 30 నిమిషాలు పడుతుంది. కరోనా సోకిన వారి గురించి సమాచారం ఇచ్చే ఈ పరికరం, రాబోయే కాలంలో విమాన క్యాబిన్లు, తరగతి గదులు, సంరక్షణ కేంద్రాలు, గృహాలు, కార్యాలయాలలో స్క్రీనింగ్ కోసం అత్యంత విలువైన పరికరంగా చెప్పొచ్చు. ఎందుకంటే, దీనిద్వారా ఆ గదిలో ఎవరైనా కరోనా బారిన పడి ఉంటె ఈ పరికరం గుర్తిస్తుంది. దీంతో తగిన జాగ్రత్తలు తీసుకునే వీలు చిక్కుతుంది. దీనికి కోవిడ్ అలారం అని పేరు పెట్టారు.

ఎలా పని చేస్తుంది..

ఇది ఫైర్ ను గుర్తించే పొగ అలారం కంటె కొంచెం పెద్దగా ఉంటాయి. ఇవి వాసన ద్వారా కరోనా రోగులను గుర్తించ గలుగుతాయి. శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం ప్రతి మనిషి వద్ద ఒక విధమైన వాసన వస్తుంది. కరోనా సోకిన వారి నుంచి వచ్చే వాసన భిన్నంగా ఉంటుంది. దీని ఆధారంగా ఈ పరికరం పనిచేస్తుంది. లక్షణాలు లేకుండా కరోనా సోకినా ఈ పరికరం గుర్తిస్తుంది. రోబో సైంటిఫిక్ ఈ పరికరం చర్మం మరియు శ్వాస ద్వారా ఉత్పత్తి అయ్యే రసాయనాలను గుర్తించడం ద్వారా సోకినవారిని గుర్తిస్తుంది. వైరస్ కారణంగా అస్థిర సేంద్రియ సమ్మేళనాలు (VOC లు) మారుతాయి. ఇది శరీర వాసనను సృష్టిస్తుంది. దీనిని ఈ పరికరం లోని సెన్సార్లు గుర్తిస్తాయి. పరికరం ఈ సమాచారాన్ని అధీకృత వ్యక్తికి సందేశం ద్వారా పంపుతుంది.

ఫలితాల్లో ఖచ్చితత్వం ఎలా..

లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ (LSHTM) మరియు డర్హామ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఈ పరిశోధన యొక్క ప్రారంభ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని చెబుతున్నారు. పరికరంలో ఫలితాల యొక్క ఖచ్చితత్వ స్థాయి 98-100 శాతం వరకు ఉందని పరీక్ష సమయంలో శాస్త్రవేత్తలు చూపించారు. ఇది RT-PCR, కరోనా యాంటిజెన్ పరీక్ష కంటే చాలా ఖచ్చితత్వంతో సోకిన కరోనా గురించి సమాచారం ఇస్తోందని వారంటున్నారు. ఈ మెషిన్ డిటెక్టర్ కోవిడ్ వైరస్ సోకిన వ్యక్తులను కనుగొనగలదు, సోకిన వ్యక్తి కరోనా లక్షణాలను చూపించకపోయినా, యంత్రం దాని పనిని సమర్థవంతంగా చేస్తుంది. ఒక గదిలో కరోనాతొ ఉన్న వ్యక్తీ ఉన్నారని దీని ద్వారా గుర్తించిన తర్వాత, గదిలో ఉన్న వ్యక్తులను వ్యక్తిగత స్థాయిలో పరీక్షించాల్సి ఉంటుంది. ఈ పరిశోధకులు చెబుతున్న దాని ప్రకారం ప్రస్తుతం ఇవి ప్రాథమిక ఫలితాలు. అధ్యయనం ప్రచురించారు. దీనిని ఇప్పుడు సమీక్షించాల్సి ఉంది. బహిరంగ ప్రదేశాల్లో సంక్రమణను గుర్తించడానికి, కొరోనా కాకుండా భవిష్యత్తులో అంటువ్యాధులను గుర్తించడానికి ఇది ప్రభావవంతంగా ఉంటుంది.

ప్రతి వ్యాధికి భిన్నమైన వాసన ఉంటుందని డర్హామ్ విశ్వవిద్యాలయంలో బయోసైన్స్ ప్రొఫెసర్ స్టీవ్ లిండ్సే చెప్పారు. ”మేము కరోనాతో పరిశోధన ప్రారంభించాము. కరోనా సోకిన అలాగే, సాధారణ ప్రజల వాసనను వేరు చేయడం పనిని సులభతరం చేసింది. వ్యాధులను గుర్తించే ఈ సాంకేతికత ఆసక్తికరంగా ఉంటుంది. పరికరం ధర సుమారు 5.15 లక్షలు, కానీ ఎంతో నష్టం చేకూర్చే కరోనాను గుర్తించడం కోసం ఈ మొత్తం పెద్దదేమీ కాదు.” అని ఆయన చెబుతున్నారు.

Also Read: Heart Problems: డయాబెటిస్ కోసం ఉపయోగించే మందుతో గుండె జబ్బులను కూడా నియంత్రించవచ్చు అంటున్న బ్రిటన్ శాస్త్రవేత్తలు

Health Benefits of Laughing: నవ్వంటే బ్రెయిన్‌కు లవ్‌.. లాఫింగ్ వ‌ల్ల‌ క‌లిగే అద్భుత‌మైన‌ ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఇవే

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu