AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sarkaru Vari Paata Movie: మహేష్ ఫ్యాన్స్‏కు తమన్ హామీ.. ‘సర్కారు వారి పాట’ మూవీలో సాంగ్స్ అలా ఉండనున్నాయంటూ..

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ హావ కొనసాగుతుంది. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన అలా వైకుంఠపురం సినిమాతో

Sarkaru Vari Paata Movie: మహేష్ ఫ్యాన్స్‏కు తమన్ హామీ.. 'సర్కారు వారి పాట' మూవీలో సాంగ్స్ అలా ఉండనున్నాయంటూ..
Sarkaru Vari Pata
Rajitha Chanti
|

Updated on: Jun 16, 2021 | 3:27 PM

Share

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ హావ కొనసాగుతుంది. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన అలా వైకుంఠపురం సినిమాతో తమన్ మళ్లీ ఫాంలోకి వచ్చాడు. ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. దీంతో టాప్ డైరెక్టర్స్, బడా హీరోల దృష్టి తమన్ పై పడింది. ఇటీవల పవర్ స్టార్ పవన్ నటించిన వకీల్ సాబ్ సినిమాకు మ్యూజిక్ హిట్ కూడా అందించాడు తమన్. ప్రస్తుతం తమన్.. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. దీంతో సర్కారు వారి పాట సినిమాపై మ్యూజిక్ ఫ్యాన్స్ కు ఆసక్తి పెరిగిపోయింది. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన దూకుడు, బిజినెస్ మ్యాన్, ఆగడు వంటి సినిమాలు మ్యూజిక్ పరంగా కూడా సూపర్ హిట్ అయ్యాయి.

మరోసారి మహేష్ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండడంతో అభిమానులలో అంచనాలు భారీగానే ఉన్నాయి. తాజాగా తమన్ సర్కారు వారి పాట సినిమాపై స్పందించాడు. మరోసారి థమన్ మహేష్ ఫ్యాన్స్ కి హామీ ఇచ్చాడు. సర్కారు వారి వారి పాట ఆల్బమ్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కానీ ఊహించిన దాని కంటే ఎక్కువగా హిట్ అవుతాయని తెలిపాడు. అలాగే తాము ముందు చెప్పినట్టుగానే ఈ కరోనా పరిస్థితులు మెరుగుపడ్డాక.. తాము ఇస్తామన్న అప్డేట్ కూడా ఇస్తామని హామీ కూడా ఇచ్చి.. సరికొత్త మిక్స్ ట్యూన్ ని కూడా అభిమానులు కోసం విడుదల చేసాడు. ఇప్పటికే ఈ సినిమాలో మూడు పాటలు ఆల్రెడీ పూర్తిచేసామని.. ఇంకా రెండు పాటలు మాత్రమే మిగిలున్నాయని చెప్పాడు. అలాగే సర్కారు వారి పాట మూవీ ఆల్బమ్ దాదాపుగా మాస్ అండ్ ఎనర్జిటిక్ సాంగ్స్ ఉండబోతున్నాయని చెప్పాడు. అలాగే ఇందులో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉండబోతుందని తెలిపారు. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా..పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి 14 ప్లస్ బ్యానర్స్ తో పాటు మహేష్ కూడా సినిమాను నిర్మిస్తున్నాడు.

Also Read: RadheShyam Movie: ‘రాధేశ్యామ్’ మూవీతో ప్రభాస్ మరో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నాడా ?