AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంతరిక్షం లోకి తొలి సారిగా రేపు ముగ్గురు చైనా వ్యోమగాముల ‘ప్రయాణం’ ! విశేషాలు ఏమిటంటే ..?

మొదటి సారిగా చైనా ముగ్గురు వ్యోమగాములతో కూడిన అంతరిక్షయానాన్ని చేపట్టింది. గురువారం వీరు ' లాంగ్ మార్చ్-2 ఎఫ్' రాకెట్ (అంతరిక్షనౌక) లో తమ స్పేస్ ట్రావెల్ కి శ్రీకారం చుట్టనున్నారు.

అంతరిక్షం లోకి తొలి సారిగా రేపు ముగ్గురు చైనా వ్యోమగాముల 'ప్రయాణం' !  విశేషాలు ఏమిటంటే ..?
Chinese Rocket With Manned
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Jun 16, 2021 | 2:34 PM

Share

మొదటి సారిగా చైనా ముగ్గురు వ్యోమగాములతో కూడిన అంతరిక్షయానాన్ని చేపట్టింది. గురువారం వీరు ‘ లాంగ్ మార్చ్-2 ఎఫ్’ రాకెట్ (అంతరిక్షనౌక) లో తమ స్పేస్ ట్రావెల్ కి శ్రీకారం చుట్టనున్నారు. నీ హైషింగ్, లియు బూమింగ్, టాంగ్ హంగ్ బో అనే ఈ వ్యోమగాములకు అచ్చు ఇళ్లలో ఉండే సౌకర్యాల వంటివే అంతరిక్షంలోనూ ఉంటాయి. వీళ్ళు తమ వెంట 120 వేర్వేరు రకాల ఫుడ్ ఐటమ్స్ ని, ఇంకా స్పేస్ ట్రేడ్ మిల్స్ ని కూడా తీసుకువెళ్తారట…వీరికి రోదసిలో వేర్వేరు గదులు కూడా ఉంటాయి. ఇది చైనా చేపట్టిన అతి పెద్ద స్పేస్ మిషన్.. 5 ఏళ్ళ తరువాత ఆ దేశం ఇలాంటి మిషన్ ని చేపట్టడం ఇదే మొదటిసారి. ఈ వ్యోమగాములు అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో మూడు నెలలపాటు ఉంటారు. షేర్ చేసుకోవడానికి బాత్ రూమ్, డైనింగ్ ఏరియా, కమ్యూనికేషన్ సెంటర్, ఇంకా ఒకరికొకరు పంపుకోవడానికి ఈ-మెయిల్ సౌకర్యం…గ్రౌండ్ కంట్రోల్ తో అనుసందానించిన టూ వే వీడియో కాల్ సదుపాయం వంటివి అన్నీ వీరికి ఉంటాయట.. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9 గంటల 22 నిముషాలకు జియుక్వాన్ లాంచ్ సెంటర్ నుంచి ఈ రాకెట్ అంతరిక్షంలోకి ఎగయనుంది.

గోబీ అనే ఎడారి ప్రాంతంలో ఉన్న ఈ స్పేస్ సెంటర్ లో రోదసికి సంబంధించిన కార్యకలాపాలను సీక్రెట్ గా నిర్వహిస్తున్నారు. ఈ ముగ్గురు వ్యోమగాముల్లో నీ హైషింగ్ కమాండర్ గా వ్యవహరిస్తారు. 1998 లో శిక్షణ పొందిన తొలి బ్యాచ్ లో ట్రెయినింగ్ తీసుకున్నవారిలో ఈయన కూడా ఒకరట. ఇదివరకే చైనా చేపట్టిన స్పేస్ ఫ్లైట్ మిషన్ లో ఈయన కూడా పాల్గొన్నాడట.

మరిన్ని ఇక్కడ చూడండి: Dil Raju: తెలుగులో నేరుగా సినిమా చేయనున్న తమిళ్ హీరో సూర్య… క్రేజీ కాంబినేషన్ సెట్ చేయనున్న దిల్‏రాజు ?

Taapsee Pannu: ఆ సినిమాతో టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇవ్వ‌బోతున్న క్యూట్ గ‌ర్ల్ తాప్సీ !