Dil Raju: మాస్ డైరెక్టర్‏తో తమిళ్ హీరో సూర్య సినిమా….. క్రేజీ కాంబినేషన్ సెట్ చేయనున్న దిల్‏రాజు ?

Dil Raju: ప్రముఖ నిర్మాత దిల్ రాజు వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే సరికొత్త కాంబినేషన్లతో సినిమాలు నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు.

Dil Raju: మాస్ డైరెక్టర్‏తో తమిళ్ హీరో సూర్య సినిమా..... క్రేజీ కాంబినేషన్ సెట్ చేయనున్న దిల్‏రాజు ?
Dil Raju
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 16, 2021 | 2:48 PM

Dil Raju: ప్రముఖ నిర్మాత దిల్ రాజు వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే సరికొత్త కాంబినేషన్లతో సినిమాలు నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. అటు చిన్న సినిమాలను.. ఇటు భారీ బడ్డెట్ చిత్రాలను తెరకెక్కిస్తూ ఫుల్ బిజీగా మారిపోయాడు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సూపర్ హిట్ సినిమాలను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు దిల్ రాజు.

ప్రస్తుతం రామ్ చరణ్, శంకర్ కాంబోలో వచ్చే సినిమాను నిర్మించనున్నాడు. ఈ సినిమా కోసం రూ. 130 కోట్లు ఖర్చు చేయనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. మరోవైపు ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో మరో భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఇవేకాకుండా.. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ తో హిందీలో జెర్సీ రీమేక్ నిర్మిస్తున్నాడు. అలాగే వంశీ పైడిపల్లి.. తమిళ స్టార్ హీరో విజయ్ కాంబినేషన్ లో ఓ భారీ మూవీ తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు. ఇందుకోసం విజయ్ కు ఏకంగా రూ. 100 కోట్ల పారితోషికం ఇవ్వనున్నట్లుగా సమాచారం. ఇక దిల్ రాజ్ మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ కూడా లైన్ లోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడట. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, తమిళ స్టార్ హీరో సూర్య కాంబోలో ఓ సినిమా నిర్మించాలని ప్రయత్నిస్తున్నట్లుగా టాక్. ఇప్పటికే సూర్య డేట్స్ కోసం కూడా చర్చలు స్టార్ట్ చేసారట. త్వరలోనే ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారట. మొత్తానికి ఈ ఏడాది వరుస పాన్ ఇండియా చిత్రాలతో దిల్ రాజ్ ఫుల్ బిజీగా మారబోతున్నట్లుగా తెలుస్తోంది.

Also Read: Akshay Kumar : వచ్చే ఏడాదిలో 5 సినిమాల రిలీజ్‌కు అక్షయ్ ప్లాన్ .. 1000 కోట్ల వసూళ్లు టార్గెట్ అంటున్నారే..

Akshay Kumar : వచ్చే ఏడాదిలో 5 సినిమాల రిలీజ్‌కు అక్షయ్ ప్లాన్ .. 1000 కోట్ల వసూళ్లు టార్గెట్ అంటున్నారే..

The Family Man 2 : ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ భారీ ప్లాన్ .. రాజీ క్యారెక్టర్‌ను ఫుల్‌ఫ్లెడ్జడ్‌గా ఎలివేట్ చేస్తూ మూవీ..

ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..