Young Tiger NTR: తగ్గేదేలే అంటున్న తారక్.. లెజెండరీ స్టార్స్‌ను ఢీ కొడుతున్న ఎన్టీఆర్..

వరుసగా లెజెండరీ స్టార్స్‌తో ఢీ కొడుతున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌. నటులుగా నేషనల్ లెవల్‌ క్రేజ్‌ ఉన్న స్టార్స్‌ను తన సినిమాల్లో కీ రోల్స్‌ కోసం సెలెక్ట్‌ చేసుకుంటున్నారు.

Young Tiger NTR: తగ్గేదేలే అంటున్న తారక్.. లెజెండరీ స్టార్స్‌ను ఢీ కొడుతున్న ఎన్టీఆర్..
Ntr

NTR : వరుసగా లెజెండరీ స్టార్స్‌తో ఢీ కొడుతున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌. నటులుగా నేషనల్ లెవల్‌ క్రేజ్‌ ఉన్న స్టార్స్‌ను తన సినిమాల్లో కీ రోల్స్‌ కోసం సెలెక్ట్‌ చేసుకుంటున్నారు. ఇప్పటికే జనతా గ్యారేజ్‌ సినిమాలో మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌తో స్క్రీన్‌ షేర్ చేసుకున్నారు మన యంగ్ టైగర్‌. కొరటాల కాంబినేషన్‌లో చేస్తున్న నెక్ట్స్ మూవీ కోసం కూడా ఓ టాప్ స్టార్‌ను రంగంలోకి దించుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మాలీవుడ్ మెగాస్టార్‌ మమ్ముట్టి… ఎన్టీఆర్‌ నెక్ట్స్‌ మూవీలో నటిస్తున్నారన్న ప్రచారం గట్టిగానే జరుగుతోంది. అదే జరిగితే ఇద్దరు మలయాళ టాప్‌ స్టార్స్‌తో స్క్రీన్‌ చేసుకున్న హీరోగా రికార్డ్ సెట్ చేస్తారు తారక్‌.

అంతేకాదు ఆ తరువాత చేయాల్సిన ప్రశాంత్ నీల్ సినిమాకు కూడా ఇలాంటి క్రేజీ కాంబోనే సెట్‌ చేస్తున్నారట మేకర్స్‌. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో మల్టీ లింగ్యువల్‌ స్టార్ విజయ్‌ సేతుపతి ఇంపార్టెంట్‌ రోల్‌లో నటిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇలా ప్రతీ సినిమాలోనూ అవార్డు విన్నింగ్‌ స్టార్స్‌తో పోటి పడి మరి నటిస్తున్నారు నందమూరి యంగ్ హీరో.

మరిన్ని ఇక్కడ చదవండి :

Pawan Kalyan: ప‌వ‌ర్ వాయిస్‌తో ఫోక్ సాంగ్ పాడ‌బోతున్న ప‌వ‌న్.. ఈసారి అభిమానుల‌కు మ‌రో స్పెష‌ల్

Vyjayanthi movies: చిన్న ఎన్టీఆర్‌తో స‌రైన సినిమా కోసం వైజయంతీ సంస్థ ఆరాటం

Akshay Kumar : వచ్చే ఏడాదిలో 5 సినిమాల రిలీజ్‌కు అక్షయ్ ప్లాన్ .. 1000 కోట్ల వసూళ్లు టార్గెట్ అంటున్నారే..

Superstar Rajinikanth: సూపర్ స్టార్ సడన్ టూర్.. అమెరికా వెళ్లిన తలైవా.. కారణం అదేనా..