Tollywood: సెట్లో వెలుగుతున్న లైట్లు.. తెలుగు సినీ జ‌నాల క‌ళ్ల‌ల్లో వెలుగులు

తెల్లారింది లెగండోయ్ ... అంటూ మేలుకొలుపు పాట మళ్ళీ మొదలైంది టాలీవుడ్ లో. కొద్దికొద్దిగా అన్ లాక్ సిట్యువేషన్స్ కనిపించడంతో.. ఇండస్ట్రీలో నెలకొన్న మబ్బులు కూడా తొలగిపోతున్నాయి.

Tollywood: సెట్లో వెలుగుతున్న లైట్లు.. తెలుగు సినీ జ‌నాల క‌ళ్ల‌ల్లో వెలుగులు
shootings in tollywood
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 16, 2021 | 2:51 PM

తెల్లారింది లెగండోయ్ … అంటూ మేలుకొలుపు పాట మళ్ళీ మొదలైంది టాలీవుడ్ లో. కొద్దికొద్దిగా అన్ లాక్ సిట్యువేషన్స్ కనిపించడంతో.. ఇండస్ట్రీలో నెలకొన్న మబ్బులు కూడా తొలగిపోతున్నాయి. మూడునెలలుగా ఆగిపోయిన షూటింగ్స్ … రీస్టార్ట్ మోడ్ లోకోస్తున్నాయి. తాజా షెడ్యూల్స్ కోసం ముహూర్తాలు సరిచూసుకుంటున్నారు మేకర్స్. మిగతా రాష్ట్రాల్లో సంగతి ఎలా వున్నా తెలంగాణలో మాత్రం సినిమా షూటింగుల సందడి మళ్ళీ మొదలైంది. ఇప్పటికే లాక్ డౌన్ గైడ్ లైన్స్ అనుసరిస్తూ టీవీ సీరియల్స్ షూటింగులు జరుపుకుంటున్నాయి. పగటి పూట కర్ఫ్యూ సడలించడంతో మెయిన్ స్ట్రీమ్ సినిమాలు కూడా గెట్ బ్యాక్ టు వర్క్ అంటున్నాయి. యంగ్ హీరో నితిన్‌ నటిస్తున్న మాస్ట్రో మూవీ ఫైనల్‌ షెడ్యూల్ ఇటీవ‌లే మొదలైంది.

నేచురల్ స్టార్ నానీ నిర్మాతగా.. తన సోదరి డైరెక్షన్లో మీట్ క్యూట్ అనే కొత్త సినిమా షురూ చేశారు. ఈ నెల 18 నుంచి 18 పేజెస్ తో బిజీ కాబోతున్నారు నిఖిల్. 21న శాకుంతలం సెట్లో జాయిన్ అవుతారు సమంత. నెలాఖరులోగా ఆచార్య, అఖండ సినిమాలు సెట్స్ మీదకెళ్లేలా ప్లాన్ జరుగుతోంది. లాస్ట్ మినిట్ లో విధిలేని పరిస్థితుల్లో ప్యాకప్ చెప్పిన పుష్ప టీమ్ కూడా ఈనెల 28 నుంచే షూటింగ్ మొదలుపెట్టబోతోంది.

F3 బ్యాలెన్స్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్న అనిల్ రావిపూడి జులై 1నుంచి మళ్ళీ క్లాప్ కొట్టబోతున్నారు. జులై 5 నుండి సర్కారు వారిపాట మొదలెట్టబోతున్నారు కెప్టెన్ పరశురామ్. షూట్ రీస్టార్ట్ కాగానే అప్డేట్స్ వచ్చేస్తాయ్ అని ఓపెన్ గా చెప్పేసిన నిర్మాతలు.. సర్కారువారి టీజర్ మేకింగ్ పై ఫోకస్ పెట్టే ఛాన్సుంది. గోపిచంద్ తో మారుతి చేస్తున్న పక్కా కమర్షియల్, ప్రభాస్ లైనప్ లో వెరీ నెక్స్ట్ మూవీ రాధేశ్యామ్… నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో షూటింగ్ మొదలుపెట్టే ప్రయత్నాల్లో వున్నాయి. సో.. జులైకల్లా పీక్స్ లోకెళ్లబోతోంది టాలీవుడ్ లో షూటింగ్స్ హడావిడి.

మేకర్స్ నుంచి సిగ్నల్స్ రావడంతో ఈ పాటికే స్టూడియోల్లో సెట్ వర్క్ మొదలుపెట్టేశాయి సినిమా యూనిట్లు. ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న టెలివిజన్ ప్రోగ్రాం ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కూడా షెడ్యూల్స్ ఫైనలైజ్ చేసుకుంది. షూటింగ్ జులై మొదటి వారంలో జరిగే ఛాన్సుంది. సో.. సెకండ్ వేవ్ ఎన్నాళ్లుంటుందోననే టెన్షన్స్ పోయి.. తక్కువ గ్యాప్ లోనే మళ్ళీ టాప్ గేర్లోకొచ్చేసింది పరిశ్రమ.

Also Read: భార్య‌తోనే ఉంటా.. మైన‌ర్ బాలుడి మారాం.. చివ‌రకు కోర్టు ఏం చెప్పిందంటే..

 ఖమ్మం జిల్లాలో వింత.. రాముడి విగ్రహం కళ్ళ నుండి నీళ్ళు !

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే