US Bans Dogs: అమెరికా కీలక నిర్ణయం.. ఆయా దేశాల నుంచి తీసుకువచ్చే కుక్కలపై నిషేధం.. ఎందుకంటే..!

US Bans Dogs: ఒక వైపు కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తుండగా, మరో వైపు కుక్కలకు వచ్చే రేబిస్‌ వ్యాధి ప్రమాదకరంగా మారుతోంది. దాదాపు వంద దేశాల్లో రేబిస్‌..

US Bans Dogs: అమెరికా కీలక నిర్ణయం.. ఆయా దేశాల నుంచి తీసుకువచ్చే కుక్కలపై నిషేధం.. ఎందుకంటే..!
Follow us
Subhash Goud

|

Updated on: Jun 16, 2021 | 2:17 PM

US Bans Dogs: ఒక వైపు కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తుండగా, మరో వైపు కుక్కలకు వచ్చే రేబిస్‌ వ్యాధి ప్రమాదకరంగా మారుతోంది. దాదాపు వంద దేశాల్లో రేబిస్‌ వ్యాధి సమస్య పెరిగిపోతోంది. అయితే ఈ కుక్కల దిగుమతిపై అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా దేశాల నుంచి తీసుకొచ్చే కుక్కలపై ఏడాది పాటు నిషేధం విధిస్తూ ఆ దేశ ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెంపుడు కుక్కలు లేదా అమ్మకం, దత్తత ద్వారా దేశంలోకి తీసుకువచ్చే కుక్కలపై ఈ నిషేధం విధించింది. అయితే ఇప్పటికే దేశంలోకి తీసుకొచ్చిన కుక్కలకు రేబిస్‌ వ్యాక్సినేషన్‌ జరిగినట్లు తగిన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. పూర్తిగా వ్యాక్సినేషన్‌ చేయడానికి తగినంత వయసు లేనప్పటికీ తప్పుడు ధృవపత్రాలు చూపించి వాటిని దేశంలోకి తీసుకొస్తున్నారని, అందుకే విదేశాల నుంచి తీసుకువస్తున్న ఈ కుక్కలపై నిషేధం విధించినట్లు పేర్కొంది. జూలై 14 నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని సెంట్రల్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌​అండ్​ప్రివెన్షన్​(CDC) ఈ ప్రకటన జారీ చేసింది.

ప్రతి యేటా సుమారు 10 లక్షల కుక్కలు దిగుమతి

కాగా, అమెరికాకు ప్రతి యేటా సుమారు 10 లక్షల కుక్కలు దిగుమతి అవుతుంటాయని సీడీసీ అధికారులు తెలిపారు. వీటిలో దాదాపు 4 శాతం నుంచి 7.5 శాతం కుక్కలపై ఈ నిషేధం ఎఫెక్ట్‌ ఉంటుందని అధికారులు వెల్లడించారు. అయితే కొన్ని పరిస్థితుల్లో ఈ ఆంఓలను సడలిస్తామన్నారు. అంధులకు దారి చూపే గైడ్‌ కుక్కలకు, అమెరికాకు తమ కుక్కలతో పాటు మారుతున్న విదేశీలకు ఈ మినహాయింపు ఉంటుందని తెలిపారు. కాగా, ఇటీవల తిరస్కరణ అయిన కుక్కల్లో ఎక్కువగా రష్యా, ఉక్రెయిన్‌, కొలంబియా నుంచి దిగుతమతి చేసుకున్నవే ఉన్నాయని అధికారులు తెలిపారు.

ఇవీ కూడా చదవండి

Israel: అలవాటులో పొరపాటు.. ఇజ్రాయెల్ మాజీ ప్రధానమంత్రి ఏం చేశాడో తెలుసా?.. వీడియో హల్‌చల్ చేస్తున్న వీడియో..

America secret Satellite: అంతరిక్షంలోకి రహస్యంగా అమెరికా ప్రత్యేక సైనిక ఉపగ్రహం..

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!