AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

China Spacecraft: అంతరిక్షంపై పట్టు బిగిస్తున్న డ్రాగన్ కంట్రీ.. విజయవంతంగా షెన్‌జూ-12 ప్రయోగం..

spacecraft Shenzhou-12: అంతరిక్ష ప్రయోగాలపై డ్రాగన్ కంట్రీ చైనా వేగం పెంచింది.  ఆ దిశగా తన ప్రయత్నాలను ముమ్మర చేస్తోంది. ఇప్పటికే స్పేస్‌స్టేషన్‌ నిర్మాణం తలపెట్టని చైనా... మరో ముందడుగు వేసింది. నిర్మాణంలో ఉన్న స్పేస్‌స్టేషన్‌లోకి ముగ్గురు వ్యోమగాములను  పంపించింది.

China Spacecraft: అంతరిక్షంపై పట్టు బిగిస్తున్న డ్రాగన్ కంట్రీ.. విజయవంతంగా షెన్‌జూ-12 ప్రయోగం..
Spacecraft Shenzhou 12
Sanjay Kasula
|

Updated on: Jun 17, 2021 | 1:55 PM

Share

అంతరిక్ష ప్రయోగాలపై డ్రాగన్ కంట్రీ చైనా వేగం పెంచింది.  ఆ దిశగా తన ప్రయత్నాలను ముమ్మర చేస్తోంది. ఇప్పటికే స్పేస్‌స్టేషన్‌ నిర్మాణం తలపెట్టని చైనా… మరో ముందడుగు వేసింది. నిర్మాణంలో ఉన్న స్పేస్‌స్టేషన్‌లోకి ముగ్గురు వ్యోమగాములను  పంపించింది. ఆ ముగ్గురు అంతరిక్ష నౌకను గురువారం ప్రయోగించింది. ఈ ముగ్గురిని టియాంగాంగ్ స్టేషన్ నుంచి లాంగ్ మార్చి -2 ఎఫ్ రాకెట్‌ ద్వారా స్పేస్‌ స్టేషన్‌లోకి పంపించారు. నీ హైషెంగ్, లీయూ బోమింగ్, టాంగ్ హోంగ్బో అనే ముగ్గురు వ్యోమగాములు మూడు నెలలపాటు అంతరిక్షంలోనే ఉంటారు. ఈ ముగ్గురు భూమికి 380 కిలోమీటర్ల దూరంలో ఉన్న తియానే మాడ్యూల్‌లో ఉంటారు. చైనా గోబి ఎడారిలో ప్రయోగించిన ఈ రాకెట్‌ గురువారం ఉదయం 9.22 గంటలకు కక్షలోకి చేరింది.

ఇది చైనా నిర్వహిస్తున్న అత్యంత సుదీర్ఘ అంతరిక్ష మిషన్ కాబోతోంది. దాదాపు గత అయిదేళ్లలో చైనా చేపట్టిన తొలి మానవ సహిత అంతరిక్ష మిషన్ ఇదే. చైనా తన సొంత టెక్నాలజీతో అభివృద్ధి చేస్తోన్న స్పేస్‌ స్టేషన్‌ పూర్తి చేసే క్రమంలో షెన్‌జౌ -12.. 11 మిషన్లలో మూడవది. వీటిలో నాలుగు బృందాలు ఉంటాయి. మూడు మాడ్యూళ్ళలో మొదటిది, అతిపెద్దది అయిన టియాన్హే ప్రారంభించడంతో ఏప్రిల్‌లో స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణం ప్రారంభమైంది.

ఈ ముగ్గురు వ్యోమగాములు  భవిష్యత్ అంతరిక్ష కేంద్ర నివాస గృహమైన టియాన్హేలో మూడు నెలలు పని చేయవలసి ఉంటుంది. చైనా షెన్‌జౌ -12 అంతరిక్ష నౌక ఏప్రిల్ 29 న భూమికి 340 నుంచి 450 కిమీ ఎత్తులో ఒక నిర్ధిష్ట కక్ష్యలో నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రంలోని టియాన్హె ప్రధాన విభాగంతో డాక్ అవుతుంది.

మాడ్యుల్‌లో ప్రతి దానికి ప్రత్యేక లివింగ్‌ స్పేస్‌, వ్యాయామం కోసం ట్రెడ్‌మిల్, గ్రౌండ్ కంట్రోల్‌తో ఈమెయిల్‌, వీడియో కాల్‌ల కోసం కమ్యూనికేషన్ సెంటర్‌ సదుపాయం ఉంది. మిషన్ కోసం తయారు కావడానికి, సిబ్బంది 6,000 గంటలకు పైగా శిక్షణ తీసుకున్నారు. చైనా అంతరిక్ష సంస్థ వచ్చే ఏడాది చివరి వరకు మొత్తం 11 ప్రయోగాలను ప్లాన్ చేస్తోంది, వీటిలో మరో మూడు మిషిన్లలో మనుషులను తీసుకెళ్లనున్నారు. అంతరిక్ష పరిశోధనల్లో చైనా సామర్థ్యం, విశ్వాసం పెరుగుతోందనడానికి తాజా మిషన్ మరో నిదర్శనంగా నిలిచింది.

ఇవి కూడా చదవండి : AP Exams: ఏపీ పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ.. ఇవాళ కీలక నిర్ణయం తీసుకోనున్న సీఎం జగన్..

ఏటీఎంలో దొంగలు పడ్డారు.. సీసీ కెమెరాను పగలగొట్టారు.. ఇక అంతా ఓకే అనుకుంటే..ఆ గదిలో ఓ మూల వణుకు పుట్టించింది..

TS CET: తెలంగాణలో సెట్‌ పరీక్షల నిర్వహణపై ఉన్నత విద్యామండలి కసరత్తు..! ఆగస్టులో నిర్వహించేందుకు ఏర్పాట్లు..!