Microsoft Windows 11: అదిరిపోయే ఫీచర్లతో రానున్న మైక్రోసాఫ్ట్ విండోస్ 11! లాంచ్ డేట్ ఎప్పుడంటే..?
మైక్రోసాఫ్ట్ త్వరలో నూతన విండోస్ ఓస్‌ను విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. విండోస్ 11 గా పిలిచే ఈ కొత్త ఓస్ కోసం టెక్ ప్రియులు ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. విండోస్ 11 ను జూన్ 24న విడుదల చేయబోతోంది.
Microsoft Windows 11: మైక్రోసాఫ్ట్ త్వరలో నూతన విండోస్ ఓస్‌ను విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. విండోస్ 11 గా పిలిచే ఈ కొత్త ఓస్ కోసం టెక్ ప్రియులు ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. 6 ఏళ్ల క్రితం (29 జులై 2015) మైక్రోసాఫ్ట్ విండోస్ 10 ఓస్‌ను విడుదల చేసింది. ఆ తరువాత మరలా విండోస్ 10కు అప్‌గ్రేడ్ వర్షన్ అయిన విండోస్ 11 ను జూన్ 24న విడుదల చేయబోతోంది. విండోస్ లాంచ్ ఈవెంట్ ఆ రోజు ఉదయం 11 గంటలకు(భారతదేశ కాలమానం ప్రకారం రాత్రి 8.30) జరగనుంది. అయితే, విడుదలకు ముందు కీలక ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ప్రస్తుతం ఈ ఫీచర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. లీకైన వివరాల మేరకు.. స్టార్ట్ మెనూలో భారీగా మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే విండోస్ యాప్ స్టోర్ లోనూ పలు మార్పులు చేయనున్నారు. అలాగే విండోస్ ఐకాన్‌ను కూడా మార్చారని లీకులు వెల్లడిస్తున్నాయి. దీంతో కొత్త విడ్జెట్ ఐకాన్ తో విండోస్ 11 దర్శనమివ్వనుంది.
అయితే, విండోస్ 10ఎక్స్ డిజైన్‌ను కొన్ని మార్పులు చేసి విండోస్ 11గా తీసుకొస్తున్నట్లు టెక్ ప్రముఖులు వెల్లడిస్తున్నారు. ఈ కొత్త ఓస్‌లో యాప్ ఐకాన్స్ టాస్క్‌బార్ మధ్యలో కనిపించనున్నాయి. ట్రే ఏరియా ఖాళీగా కనిపించనుంది. వీటితోపాటు నూతన స్టార్ట్ బటన్, మెనూని యాడ్ చేశారు. యాప్ ఐకాన్స్, స్టార్ట్ మెనూని టాస్క్ బార్ సెంటర్లోనూ మార్చుకునే సౌలభ్యం ఉండనుందంట. షట్ డౌన్, పిన్డ్ యాప్స్, రీసెంట్ ఫైల్స్, రీస్టార్ట్ ఆప్షన్లను ఇంకా ఈజీగా చేశారంట. అలాగే విండోస్ 11లో వైడ్ డార్క్ మోడ్ ఫీచర్ అందించారంట. యూఐ (యూజర్ ఇంటర్‌ఫేస్) కూడా చాలా క్లీన్‌గా ఉందంట. రీడిజైన్ చేసిన యాప్ ఐకాన్, రౌండెడ్ కార్నర్స్ యాప్స్ ఇందులో ఉండనున్నాయి. కొత్త విండోస్ యాప్ స్టోర్ ఐకాన్ మాత్రం లీకైన ఫొటోలలో కనిపించలేదు. ఫైనల్ వెర్షన్‌లో ఉండొచ్చు.
బిల్డ్ 2021 కాన్ఫరెన్స్‌లో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల విండోస్ 11పై అప్‌డేట్ అందించారు. గత దశాబ్దంలో వచ్చిన అప్‌డేట్లలో ఇది ఎంతో ముఖ్యమైనదని పేర్కొన్నారు. న్యూస్, వెదర్, ఇతర వెబ్ కంటెంట్‌ను త్వరగా వెతికేందుకు టాస్క్‌బార్‌లో ఓ ఫీచర్ యాడ్ చేశారంట. అన్ని యాప్స్‌ను ఒకసారి మ్యాగ్జిమైజ్ చేసేందుకు స్నాప్ కంట్రోల్స్ అందించారంట. ఎక్స్‌బాక్స్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరుగుపరిచారంట. ఎక్స్‌బాక్స్ గేమ్ పాస్‌లను వేగంగా యాక్సెస్ చేయవచ్చంట.
Windows 11 has app groups on the Taskbar now! Snap some apps to create a group and you can even switch between groups on the fly!#Windows11 pic.twitter.com/3Ucdszkm3H
— KrisTheHuman (@KrisTheHuman_) June 17, 2021
hey Cortana, is Windows 11 real? pic.twitter.com/GcbBdNL0NZ
— Tom Warren (@tomwarren) June 16, 2021
Also Read:
Satya Nadella: తెలుగుతేజం టెక్ నిపుణుడు సత్య నాదెళ్ల మరో ఘనత.. మైక్రోసాఫ్ట్ చైర్మన్‌గా బాధ్యతలు