Instagram Bug: ఇన్‌స్టాగ్రామ్‌లో బగ్.. ఏకంగా రూ. 22 లక్షలు తెచ్చిపెట్టింది! జాక్‌పాట్ కొట్టిన ముంబై కుర్రాడు
సోషల్ మీడియా యాప్స్‌లో ఉన్న లోపాలను గుర్తించేందుకు తగిన పారితోషకాలు అందిస్తుంటాయి ఆయా సంస్థలు. ఇలాంటి సందర్భాల్లోనే ఎథికల్ హకర్స్ తమ సత్తా చూపించేందుకు సిద్ధమవుతుంటారు.
Instagram Bug: సోషల్ మీడియా యాప్స్‌లో ఉన్న లోపాలను గుర్తించేందుకు తగిన పారితోషకాలు అందిస్తుంటాయి ఆయా సంస్థలు. ఇలాంటి సందర్భాల్లోనే ఎథికల్ హకర్స్ తమ సత్తా చూపించేందుకు సిద్ధమవుతుంటారు. మరికొందరు మాత్రం ఎల్లవేలా ఇదే పనిలో నిమగ్నమై బగ్స్‌ను కనుగొనేందుకు శతవిధాల ప్రయత్నిస్తుంటారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ బగ్‌ను గుర్తించిన మనదేశానికి చెందిన ఓ ఎథికల్ హకర్‌కు ఏకంగా రూ. 22 లక్షల జాక్‌పాట్ కొట్టాడు.
ఈ ఇంటర్నెట్ కాలంలో సమాచారమంతా సోషల్ మీడియా యాప్‌లతోనే నడుస్తోంది. అందుకే చాలా మంది ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలో బిజీగా కాలం గడుపుతుంటారు. సోషల్ మీడియా యాప్స్‌లో అకౌంట్ లేని వారు ప్రస్తుతం చాలా అరుదుగా ఉంటారనే చెప్పాలి. అయితే ఇలాంటి యాప్స్‌లో ప్రైవసీ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. అప్పుడప్పుడు కొన్ని లోపాలు బయటపడుతూనే ఉంటాయి. తాజాగా ఇలాంటి ఓ లోపమే ఇన్‌స్టాగ్రామ్‌లో వెతికి పట్టుకున్నాడు మయూర్ ఫార్టేడ్ అనే ముంబై కుర్రాడు. దీంతో సదరు కంపెనీకి వివరాలను అందించడంతో… ఫేస్‌బుక్ సంబంధింత బగ్‌ను నిర్ధారించుకుని సుమారు రూ.22 లక్షలను మయూర్‌కు అందించింది. ఈమేరకు ఫేస్‌బుక్ నుంచి వచ్చిన మేసేజ్‌ను తన ట్విట్టర్లో షేర్ చేశాడు ఈ కుర్రాడు.
అసలు ఈ బగ్ ఏంటీ? సాధారణంగా కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్‌లో ప్రైవసీని కోరుకునే వారు ప్రైవేట్ అకౌంట్‌గా మార్చుకుంటారు. ఇలాంటి ఫీచరే ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఉంది. అయితే ప్రస్తుత బగ్ కారణంగా ప్రైవేట్ అకౌంట్స్‌లోని పోస్టులు, స్టోరీస్, రీల్స్ వీడియోలను కూడా చూడవచ్చంట. ఈ బగ్‌ను మయూర్ కనుగొన్నాడు. దీంతో యూజర్ల ప్రైవసీకి భంగం కలిగే అవకాశం ఉందని ఈ ఎథికల్ హకర్ వెల్లడించాడు.
$30000 bounty from Facebook
Write-up: https://t.co/teRY3dDqNY#facebook #bugbounty #Instagram #infosec pic.twitter.com/NGU8UjWzAp
— Mayur Fartade (@mayurfartade) June 15, 2021
Also Read:
Research on Bats: మన దగ్గరా గబ్బిలాల పై పరిశోధన..ఎప్పటినుంచి..ఎక్కడో.. ఎందుకో తెలుసా?
Reliance Jio: అగ్రస్థానంలో రిలయన్స్ జియో…డౌన్‌లోడ్ స్పీడ్ ఎంతంటే..?