Reliance Jio: అగ్రస్థానంలో రిలయన్స్ జియో…డౌన్‌లోడ్ స్పీడ్ ఎంతంటే..?
మే నెలలో 4జీ డౌన్‌లోడ్ స్పీడ్‌లో రిలయన్స్ జియో అగ్రస్థానంలో నిలిచింది. మిగతా పోటీదారులతో పోల్చితే మూడు రెట్లు ఎక్కువగా ఉంది.
Reliance Jio: రిలయన్స్ జియో 4జీ డౌన్‌లోడ్ స్పీడ్ చార్ట్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ మేరకు మిగతా నెట్‌వర్క్‌ల కన్నా చాలా స్పీడ్‌లో ఉందని టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2021 మే నెల లెక్కల మేరకు రిలయన్స్ జియో డౌన్‌లోడ్ స్పీడ్ 20.7 మెగాబిట్ పర్ సెకండ్ (ఎంబీపీఎస్) స్పీడ్ ఉంది. ఇదే నెలలో వోడాఫోన్ ఐడియా 6.7 ఎంబీపీఎస్ స్పీడ్‌తో అప్‌లోడ్ విభాగంలో అగ్రస్థానంలో నిలిచిందని ట్రాయ్ వెల్లడించింది. ఇంతకుముందు కంటే రిలయన్స్ జియో 4జీ నెట్‌వర్క్ వేగం స్వల్పంగా పెరిగింది. అయితే ఇది ఇతర పోటీదారులైన వోడాఫోన్ ఐడియా కంటే మూడు రెట్లు ఎక్కువ ఉండడం విశేషం. సగటు డౌన్‌లోడ్ స్పీడ్ 6.3 ఎంబీపీఎస్ గా ఉంది.
2018, ఆగస్టులో విలీనం అయిన తరువాత వోడాఫోన్, ఐడియాల నెట్‌వర్క్ వేగాన్నికలిపి ఫలితాలను విడుదల చేయడం ఇదే మొదటిసారి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) జూన్ 8 న విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఎయిర్‌టెల్ అత్యల్ప సగటు వేగం 4.7 ఎంబీపీఎస్ ను కలిగి ఉంది.
వినియోగదారులు డౌన్‌లోడ్ స్పీడ్‌పై ఆసక్తి చూపిస్తుడంతో… ఆయా సంస్థలు కూడా ట్రాయ్ ఫలితాల కోసం ఎదురుచూస్తుంటాయి. ఎక్కువ స్పీడ్ ఉన్న వాటినే వినియోగదారులు కోరుకుంటున్నారని తాజా సర్వేలో వెల్లడైంది. అయితే డౌన్‌లోడ్ వేగం అధికంగా ఉంటే ఇంటర్నెట్ నుంచి కంటెంట్‌ను యాక్సెస్ చేయడం ఈజీగా ఉంటుంది. అలాగే అప్‌లోడ్ వేగం ఎక్కువగా ఉంటే ఫొటోలు లేదా వీడియోలను త్వరగా అప్‌లోడ్ చేయవచ్చు.
ట్రాయ్ ఫలితాల ప్రకారం, వోడాఫోన్ ఐడియా మే నెలలో సగటున 6.3 ఎంబీపీఎస్ అప్‌లోడ్ వేగాన్ని కలిగి ఉంది. దీని తరువాత రిలయన్స్ జియో 4.2 ఎంబీపీఎస్ వేగంతో, భారతి ఎయిర్‌టెల్ 3.6 ఎంబీపీఎస్‌తో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రభుత్వ సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రం ట్రాయ్ లిస్టులో చేరలేదు. మైస్పీడ్ అప్లికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి డేటాను సేకరించి.. సగటు స్పీడ్‌ను ట్రాయ్ నిర్ణయిస్తుంది. ఈమేరక ఫలితాలను విడుదల చేస్తోంది.
Also Read:
5G Technology: భారత్ లో 5జి టెక్నాలజీ త్వరలో.. దీనితో లక్షల్లో ఉద్యోగావకాశాలు దొరికే ఛాన్స్!
Covid New Drug: కొవిడ్ రోగుల్లో ఆశలు రేకెత్తిస్తున్న కొత్త డ్రగ్.. యాంటిబాడీ థెరపీతో మంచి ఫలితాలు