AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Research on Bats: మన దగ్గరా గబ్బిలాల పై పరిశోధన..ఎప్పటినుంచి..ఎక్కడో.. ఎందుకో తెలుసా?

Research on Bats: కరోనా మహమ్మారి వ్యాప్తి తో.. ప్రపంచంలో ప్రజలకు తెలియకుండా జరుగుతున్న చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Research on Bats: మన దగ్గరా గబ్బిలాల పై పరిశోధన..ఎప్పటినుంచి..ఎక్కడో.. ఎందుకో తెలుసా?
Research On Bats
KVD Varma
|

Updated on: Jun 16, 2021 | 6:44 PM

Share

Research on Bats: కరోనా మహమ్మారి వ్యాప్తి తో.. ప్రపంచంలో ప్రజలకు తెలియకుండా జరుగుతున్న చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా వైరస్ వ్యాప్తిపై జరుగుతున్న పరిశోధనలపై రోజూ వెలువడుతున్న కథనాలు ఆసక్తి తొ పాటు విస్మయాన్ని కలిగిస్తున్నాయి. చైనాలోని వూహాన్ లో గబ్బిలాల పై పరిశోధనలు చేస్తున్నారని గతేడాది వార్తలు వెలువడినపుడు అందరూ ఆశ్చర్యపోయారు. అయితే, ఈ పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయని తరువాత తెలిసింది. కరోనా వైరస్ చైనా లోని వూహాన్ వైరాజీ ల్యాబ్ నుంచి లీకయిందన్న వాదనలే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు కూడా దీనినే నమ్ముతున్నారు. ఈ నేపధ్యంలో భారత్ లోనూ గబ్బిలాల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులపై పరిశోధనలు జరుగుతున్నాయని తెలుస్తోంది. బెంగళూరులోని ఎన్సీబీఎస్ (నేషన్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్) ల్యాబోరేటరీ వేదికగా ఈ పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనలపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, భారత అణు శక్తి విభాగం(డిపార్ట్ మెంట్ ఆఫ్ అటమిక్ ఎనర్జీ) నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. అయితే, ఇటీవల పరిణామాల నేపధ్యంలో బెంగళూరు ఎన్సీబీఎస్ లో కూడా జాగ్రత్తలు లోపించాయని విమర్శలు వస్తున్నాయి. దీంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. కరోనా వైరస్ ల్యాబ్ లీక్ థియరీతో ప్రపంచ వ్యాప్తంగా ల్యాబోరేటరీల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. అదేకోవలో ఇప్పుడు భారత్ కూడా అప్రమత్తం అయింది.

ఎన్సీబీఎస్ లో ఏం చేస్తారు?

గబ్బిలాల నుంచి వైరస్ వ్యాప్తిపై ఎన్ సీఆర్ బీలో పరిశోధనలు సాగుతున్నాయి. ఇక్కడ నాగాలాండ్ గబ్బిలాలపై పరిశోధనలు చేస్తున్నారు. నాగాలాండ్ లో గబ్బిలాల నుంచి వైరస్ లు వాటిని పట్టుకునే వాళ్లకు సోకిందన్న అంశంపై ఇక్కడ ఎప్పటి నుంచో పరిశోధనలు సాగుతున్నాయి. నాగాలాండ్ లోని గబ్బిలాల నుంచి న్యూక్లిక్ ఆమ్లం నమూనాలను ఇక్కడి శాస్త్రవేత్తల బృందం సేకరించింది. వీటిని అత్యంత రక్షణ ఉన్న బీఎస్ఎల్-4(బయో సేఫ్టీ లెవల్-4) వ్యవస్థలో స్టోర్ చేయాలని ఆరోగ్యశాఖ సూచించింది. బీఎస్ఎల్-4 సౌకర్యం పుణెలోని నేషనల్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ వైరాజీలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, బెంగళూరులోని ఎన్ సీబీఎస్ లో బీఎస్ఎల్-3(బయో సేఫ్టీ లెవల్-3) ల్యాబ్ సౌకర్యం లేదని దర్యాప్తులో బహిర్గతం అయింది.

నాగాలాండ్ బ్యాట్ వేటగాళ్ల నుంచి నమూనాలను తీసుకున్న ఎన్సీబీఎస్.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) నుంచి అనుమతి తీసుకోకుండానే పరిశోధనలు చేస్తున్నట్లు ప్రభుత్వ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఇప్పటికీ.. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖకు తెలుపలేదని ఎన్సీబీఎస్ పై ఆరోపణలు వస్తున్నాయి. 2017లో నాగాలాండ్ గబ్బిలాలు వాటి వేటగాళ్లపై పరిశోధన మొదలు పెట్టారు. 2019లో వెలువడ్డ ‘ఫైలో వైరస్- రియాక్టివ్ యాంటీ బాడీస్ ఇన్ హ్యూమన్స్ అండ్ బ్యాట్స్ ఇన్ నార్త్ ఈస్టర్న్ ఇండియా ఇంప్లై జూనొటిక్ స్పిల్ ఓవర్’ పేర పరిశోధన పత్రాలను ప్రచురించారని ఎన్సీబీఎస్ చెబుతోంది. ఈ పరిశోధన రెండేళ్ల క్రితమే పూర్తయిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి అంటున్నారు. మే, 2021లో.. గబ్బిలాలపై పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయని ఎన్సీబీఎస్ శాస్త్రవేత్త డాక్టర్ ఉమా రామక్రిష్ణన్ వెల్లడించారు. ఈ అధ్యయనంలో.. ఎన్సీబీఎస్ తో భాగస్వామ్యమున్న ఇతర సంస్థలు.. సింగపూర్ లోని డ్యూక్- ఎన్ యూఎస్ మెడికల్ స్కూల్, మేరీలాండ్ లోని బెతెస్డాలో ఉన్న యూనిఫార్మ్ డ్ సర్వీసెస్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్( అమెరికా రక్షణ విభాగం నిధుల సహాయంతో నడుస్తున్న సంస్థ), యూఎస్ ఢిఫెన్స్ త్రీట్ రెడుక్షన్ ఏజెన్సీ(డీటీఆర్ఏ).

ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో పరిశోధనల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎన్సీబీఎస్ ను హెచ్చరిస్తోంది.

Also Read: అంతరిక్ష కేంద్రంలో చిట్టెలుకలు..ఆశ్చర్యపోయిన శాస్త్రజ్ఞులు.ఎలా వచ్చాయంటూ ఆందోళన..వైరల్ అవుతున్న వీడియో: Viral Video.

Milk for Children: ప్రపంచంలో మొదటిసారిగా కృత్రిమంగా తల్లిపాలను తయారు చేసిన ఇజ్రాయిల్ స్టార్టప్ కంపెనీ బయోమిల్క్