AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Milk for Children: ప్రపంచంలో మొదటిసారిగా కృత్రిమంగా తల్లిపాలను తయారు చేసిన ఇజ్రాయిల్ స్టార్టప్ కంపెనీ బయోమిల్క్

Milk for Children: ప్రపంచంలో మొట్టమొదటిసారిగా, ప్రయోగశాలలో నవజాత శిశువు కోసం తల్లి పాలు తయారు చేశారు. ఇజ్రాయిల్ స్టార్టప్ 'బయోమిల్క్' మహిళల రొమ్ము కణాల నుండి పాలు తయారు చేయడంలో విజయవంతమైంది.

Milk for Children: ప్రపంచంలో మొదటిసారిగా కృత్రిమంగా తల్లిపాలను తయారు చేసిన ఇజ్రాయిల్ స్టార్టప్ కంపెనీ బయోమిల్క్
Milk For Children
KVD Varma
|

Updated on: Jun 15, 2021 | 4:29 PM

Share

Milk for Children: ప్రపంచంలో మొట్టమొదటిసారిగా, ప్రయోగశాలలో నవజాత శిశువు కోసం తల్లి పాలు తయారు చేశారు. ఇజ్రాయిల్ స్టార్టప్ ‘బయోమిల్క్’ మహిళల రొమ్ము కణాల నుండి పాలు తయారు చేయడంలో విజయవంతమైంది. ఈ పాలలో తల్లి పాలలో లభించే అన్ని పోషకాలు ఎక్కువగా ఉన్నాయని కంపెనీ పేర్కొంది. చీఫ్ సైన్స్ ఆఫీసర్, మిల్క్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు డాక్టర్ లీలా స్ట్రిక్లాండ్ మాట్లాడుతూ, మా ఉత్పత్తిలో ఇతర ఉత్పత్తుల కంటే ఎక్కువ పోషకాలు ఉన్నాయి. ఇది తల్లి పాలతో చాలా పోలి ఉంటుంది. తల్లి పాలలో ఉండే ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వు ఆమ్లాలు, బయోయాక్టివ్ లిపిడ్లు వంటి అన్ని పోషకాలు ఇందులో ఉన్నాయి.

ఒకే ఒక్క తేడా..

డాక్టర్ లీలా మాట్లాడుతూ  ”ప్రయోగశాలలో తయారుచేసిన తల్లి పాలు, వాస్తవ తల్లి పాలకు మధ్య ఒకే తేడా ఉంది. అదే యాంటీబాడీస్ అంటే ప్రతిరోధకాలు. పిల్లలలో వ్యాధులపై పోరాడటానికి తల్లి పాలు నుండి ప్రతిరోధకాలు తయారవుతాయి, అయితే ఈ పాలు అలా చేయవు. కానీ అవసరమైన అన్ని పోషకాలు లభిస్తాయి.” అని చెప్పారు. ఇలా కృత్రిమంగా పాలను తయారు చేయాలని పరిశోధనలు చేయడానికి స్వీయ అనుభవమే కారణమని ఆమె చెప్పారు. ప్రీ మెచ్యూర్ డెలివరీ అంటే అనుకున్న సమయానికన్నా ముందుగానే పిల్లలు పుట్టేయడం. ఇలా పిల్లలు పుట్టినపుడు తల్లి పాలు ఇవ్వలేదు. అందుకు అవసరమైన పాలు తల్లి శరీరం తయారు చేయలేదు. ఇటువంటి పరిస్థితిలో బిడ్డలకు పాలు ఇవ్వడం ఇబ్బందికరంగా మారుతుంది. తనకు అటువంటి అనుభవమే కలిగినట్టు ఆమె చెప్పారు. తన బిడ్డ నెలలు నిండకుండానె పుట్టేయడంతో పాలు ఇవ్వలేకపోయానని తెలిపారు. అప్పుడే కృత్రిమంగా తల్లిపాలు తాయారు చేయాలనే ఆలోచనకు బీజం పడిందని డాక్టర్ లీలా చెప్పారు. 2013లో ప్రయోగశాలలో రొమ్ము కణాలను పెంచడం ప్రారంభించామని వెల్లడించారు. తమ కంపెనీలో ఎక్కువ మంది సిబ్బంది మహిళలే అని ఆమె వివరించారు.

పిల్లల రోగనిరోధక వ్యవస్థ, గట్ మరియు మెదడు అభివృద్ధికి మా ఉత్పత్తి సహాయపడే విధానం, ఇతర పాల ఉత్పత్తులు చేయవని డాక్టర్ లీలా అన్నారు. రాబోయే మూడేళ్లలో దీనిని మార్కెట్లో అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. తాను 2019 లో ఫుడ్ సైంటిస్ట్ మిచెల్ ఎగ్గర్తో కలిసి స్టార్టప్ ప్రారంభించానని డాక్టర్ లీల తెలిపారు. మా లక్ష్యం తల్లి పాలివ్వడాన్ని ఆపుచేయాలని కాదు. మా ఉత్పత్తి సహాయంతో మహిళలకు తల్లి పాలకు ప్రత్యామ్నాయాన్ని అందించాలనుకుంటున్నామంటూ డాక్టర్ లీల వివరించారు.

Also Read: Heart Problems: డయాబెటిస్ కోసం ఉపయోగించే మందుతో గుండె జబ్బులను కూడా నియంత్రించవచ్చు అంటున్న బ్రిటన్ శాస్త్రవేత్తలు

Drinking Water Benefits: కుండలో నీరు తాగుతున్నారా? అయితే ఈ సూపర్ బెనిఫిట్స్ గురించి తెలుసుకోండి!