Artificial Leg to Vulture: ప్రపంచంలో మొదటిసారిగా రాబందుకు కృత్రిమ కాలు..ఆస్ట్రియా వైద్యుల అద్భుత కృషి!
Artificial Leg to Vulture: ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒక రాబందుకు ప్రొస్థెటిక్ కాలిని అమర్చారు. ఇలా ఒక రాబందుకు చేయడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. గతంలో ఇటువంటి చికిత్సను ఒక గుడ్లగూబకు చేశారు.
Artificial Leg to Vulture: ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒక రాబందుకు ప్రొస్థెటిక్ కాలిని అమర్చారు. ఇలా ఒక రాబందుకు చేయడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. గతంలో ఇటువంటి చికిత్సను ఒక గుడ్లగూబకు చేశారు. ఆడ రాబందు మియా కాలు తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితిలో ఆస్ట్రియా లోని బర్డ్ ఆఫ్ ప్రీ-సెంచరీకి తీసుకువచ్చారు. ఇక్కడ రాబందు కాలికి చికిత్స చేశారు. కాలు పూర్తిగా పనిచేయలేని పరిస్థితిలో ఉండటంతో దానికి ప్రొస్థెటిక్ కాలును అమర్చారు. దీనికోసం వైద్యులు ఒక ప్రత్యేకమైన ప్రొస్థెటిక్ లెగ్ సిద్ధం చేశారు. ఇప్పుడు ఈ రాబందు ఎగరగలిగే స్థితికి చేరుకుంది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఈ రాబందును పూర్తిగా కోలుకున్న తరువాత దీనిని స్వేచ్చగా వదిలేస్తారు. వియన్నా మెడికల్ యూనివర్శిటీ నిపుణులు మియా కోసం శాశ్వత ప్రొస్థెటిక్ కాళ్ళను రూపొందించారు. గుడ్లగూబ లాంటి పక్షులు తేలికగా ఉన్నందున చిన్న పక్షులలో కృత్రిమ కాళ్లను ఉంచి వాటిని బతికించడం చాలా సులభం అని నిపుణులు అంటున్నారు. కానీ, రాబందు విషయంలో ఇది అంత సులభం కాదు.
ప్రొస్థెటిక్ లెగ్ తయారుచేసేటప్పుడు, రాబందు దాని శరీరంతో దాని బరువును భరించగలదా అనే అంశాన్ని పరిశీలిస్తూ సిద్ధం చేయాల్సివస్తుంది. మియా శస్త్రచికిత్స చేసిన వైద్యుల బృందానికి నాయకత్వం వహించిన ప్రొఫెసర్ ఆస్కార్ అజ్మాన్ గతంలో వికలాంగుల కోసం ప్రొస్థెటిక్ చేతులను రూపొందించారు. వైద్యుల ప్రకారం, రాబందు కాలు ఎముక చివరన ప్రొస్థెటిక్ కాలు జతచేశారు. 3 వారాల శస్త్రచికిత్స తర్వాత, రాబందు నడవడానికి ప్రయత్నించింది. సుమారు 6 వారాలు రాబందు తన శరీరంతో పాటు తన అడుగుల బరువును కూడా భరించగలిగింది. ఇప్పుడు ఈ రాబందు నడవగలదు అలాగే ఆకాశంలో మునుపటి వలె స్వేచ్చగా ఎగురగలదు.
పాదాల ఎక్స్-కిరణాలు ఇటీవలి శస్త్రచికిత్స తరువాత, రాబందు ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో, కాళ్ళు ఎంత బలంగా ఉన్నాయో తెలుసుకోవడానికి పాదాల ఎక్స్-రేలు తీసి పరిశీలించినట్టు ప్రొఫెసర్ ఆస్కార్ చెప్పారు. ఈ ప్రక్రియను ఓస్సోఆపరేషన్ అంటారు. ఈ కృత్రిమ కాలు సహాయంతో సాధారణ పక్షిలా ఈ రాబందు నడవగలుగుతుంది. ఆహారాన్ని సేకరించుకోగలుగుతుంది. ప్రొస్థెటిక్ కాళ్ళతో రాబందును అమర్చడం ఇదే మొదటిసారి. అని ఆయన తెలిపారు. సైన్టిఫిక్ జర్నల్‌లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, శస్త్రచికిత్స తర్వాత రాబందుకు యాంటీబయాటిక్స్ ఇచ్చారు. సుమారు 4 వారాల తరువాత, దెబ్బతిన్న చర్మం క్రమంగా మరమ్మత్తు చేయడం ప్రారంభించింది. వైద్యులు, ఇది సంతానోత్పత్తికి సరిపోయే పరిస్థితికి వచ్చిన తర్వాత, దీనిని తిరిగి అడవిలోకి వదిలివేస్తారని చెప్పారు.
Also Read: Nuclear weapons: ప్రపంచంలో అణ్వాయుధాల సంఖ్య తగ్గింది.. కానీ ఉన్నవాటి సామర్ధ్యం మరింత పెరిగింది!