TS CET: తెలంగాణలో సెట్ పరీక్షల నిర్వహణపై ఉన్నత విద్యామండలి కసరత్తు..! ఆగస్టులో నిర్వహించేందుకు ఏర్పాట్లు..!
Telangana CET : సెట్ పరీక్షల నిర్వహణపై తెలంగాణ ఉన్నత విద్యామండలి కసరత్తు మొదలు పెట్టింది. పరీక్షల నిర్వహణపై ఇప్పటికే విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఉన్నత విద్యామండలి కొన్ని ప్రతిపాదనలు పంపింది..
సెట్ పరీక్షల నిర్వహణపై తెలంగాణ ఉన్నత విద్యామండలి కసరత్తు మొదలు పెట్టింది. పరీక్షల నిర్వహణపై ఇప్పటికే విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఉన్నత విద్యామండలి కొన్ని ప్రతిపాదనలు పంపింది. ఉన్నత విద్యామండలి ప్రాదనలను అందుకున్న మంత్రి కార్యాలయం పరిశీలించి సీఎంవో కార్యాలయానికి పంపడం కూడా పూర్తైంది. ఇక ఇవాళో రేపో సెట్స్ నిర్వహణపై ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయంను ప్రకటించనుంది.
ఉన్నత విద్యామండలి పంపిన ప్రతిపదానల్లో పరీక్షల నిర్వహన ఎప్పుడు అనే అంశం క్లుప్తంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆగస్ట్ 4,5,6 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్, ఆగస్ట్ 9,10 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్&మెడికల్, ఆగస్ట్ 3న ఈసెట్, ఆగస్ట్ 11నుంచి 14వరకు పీజీసెట్, ఆగస్ట్ 19,20తేదీల్లో ఐ సెట్, ఆగస్ట్ 23 న లాసెట్, ఆగస్ట్ 24,34 తేదీల్లో ఎడ్ సెట్ నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి సిద్ధంగా ఉన్నట్లు ప్రతిపాదనల్లో పేర్కొంది. ఇక పీఈసెట్ నిర్వహణపై జూలై 16 తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
కాగా కోవిడ్ కారణంగా సెట్ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం కొంత తాత్సారం చేయడంతోపాటు మరింత మీమాంసలో పడింది. ఇప్పటికే పరీక్షలు రాసేందుకు విద్యార్థులు ఫీజులు కూడా చెల్లించారు. దీంతో పరీక్షల నిర్వహణపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఉన్నతమండలి ప్రతిపాదనలతో ఊపిరి పీల్చుకోనున్నారు. పరీక్షల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు.