ఈటలపై విమర్శలు గుప్పిస్తున్న గులాబీ దళం.. నిజమైన ఉద్యమకారుడేనా అంటూ ఫైర్..
బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల ఈటల రాజేందర్‌పై దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఆయన నిజమైన ఉద్యమకారుడేనా అని ప్రశ్నించారు. తాను...
బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల ఈటల రాజేందర్‌పై MLA దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్‌నుపై విమర్శలు చేస్తూ.. అసలు ఆయన నిజమైన ఉద్యమకారుడేనా అని ప్రశ్నించారు. తాను తెలంగాణ ఉద్యమ సమయంలో లేకపోయినా… ఈటల రాజేందర్ విషయంలో స్పందించకపోతే తప్పవుతుందంటూనే విమర్శలు గుప్పించారు. ఈటల రాజేందర్ నిజమైన ఉద్యమకారుడు అయితే.. ఉద్యమ నాయకుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించే వాడు కాదని అన్నారు. ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద కల్యాణ లక్ష్మీ , షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సంద్బంగా ఈ వ్యాఖ్యలు చేశారు
ఈటల వ్యవహరించిన తీరు వల్ల బలహీన వర్గాలు తలదించుకునే పరిస్థితి వచ్చిందని.. బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు నిజమైన నాయకుడికి అన్ని సమయాల్లో నమ్మకంగా ఉంటారని తెలిపారు. రైతు బంధును వ్యతిరేకించిన ఈటల… తన భూమికి రైతు బంధు చెక్కులు ఎందుకు తీసుకున్నారని మండిపడ్డారు. ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కించపరిస్తే… త్వరలోనే బడుగు, బలహీన వర్గాలు ఈటల రాజేందర్ కు బుద్ధి చెప్తారని హెచ్చరించారు దానం నాగేందర్.